...
...
Next Story

Telangana Budget 2026: ఇంటర్‌ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం - ITI విద్యార్థులకు నెలకు రూ.2 వేలు

ఇంటర్ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. ఇకపై మధ్యాహ్న భోజనం పథకాన్ని ఇంటర్ విద్యార్థులకు కూడా వర్తింపజేయనున్నారు. ఈ మేరకు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు.

Published on: Mar 20, 2026, 14:44:08 IST
Advertisement

రాష్ట్రంలోని ఇంటర్, ఐటీఐ, ఏటీసీల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2026-27 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సందర్భంగా… కొత్త పథకాన్ని ప్రకటించింది. ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజన పథకం అమలు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్గ ప్రకటించారు. ఇక ఐటీఐ, ఏటీసీల్లో చదివే విద్యార్థులకు నెలకు రూ.2 వేల ఉపకారవేతం ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఇంటర్‌ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం
ఇంటర్‌ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం

ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కొత్తగా బ్రేక్ ఫాస్ట్ పథకం అమల్లోకి తీసుకురాబోతున్నట్లు ఆర్థిక మంత్రి భట్టి తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన పోషకాలతో కూడిన ఆహారాన్ని అందజేస్తామని…. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ పథకం అమల్లోకి రాబోతుందని తెలిపారు. ఈ బ్రేక్ ఫాస్ట్ పథకంలో భాగంగా.. మూడు రోజులు పాలు, మరో మూడు రోజులు రాగి జావ అందజేస్తారని వివరించారు.

ఈసారి బడ్జెట్ ఎంతంటే..?

మొత్తం రూ.3,24,234 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక న్యాయం అదించడమే తమ లక్ష్యమని ఉపముఖ్యమంత్రి భట్టి వెల్లడించారు. క్యూర్‌, ప్యూర్‌, రేర్ కాన్సెప్ట్‌తో ముందుకు వెళ్తున్నామని భట్టి విక్రమార్క అన్నారు. పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నామని చెప్పారు.

తెలంగాణ బడ్జెట్‌లో ఆరోగ్యశాఖకు రూ.13,679 కోట్లు కేటాయించారు. ఇక ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1000 కోట్లు, హ్యామ్ రోడ్లకు రూ.3,053 కోట్లు కేటాయించారు. యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్‌కి రూ.5,000 కోట్లు కేటాయించగా… విద్యార్థుల డైట్ ఛార్జీలు రూ.2,170 కోట్లు కేటాయించారు. స్కాలర్‌షిప్‌లకు రూ.4,343 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి భట్టి ప్రకటించారు. ఈ బడ్జెట్ లో మొత్తంగా విద్యా శాఖకు రూ.26,674 కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe