రాష్ట్రంలో పక్కాగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేయడంపై విద్యావంతులైన అధికారులు, ఎన్నికల యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలోని అన్ని పోలింగ్ స్టేషన్ల పరిధిలో నిర్వహించే గ్రామ, వార్డు సభలు, ఎలక్టోరల్ రోల్ సవరణలపై తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి, ఐఏఎస్ ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కీలక మార్గదర్శకాలు…

ఓటర్ల జాబితాలో ఉండే తప్పులను సరిదిద్దడం, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వివరాలను క్షుణ్ణంగా పరిశీలించడంపై సీఈఓ క్షేత్రస్థాయి అధికారులకు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంపొందించేందుకు గ్రామ, వార్డు సభలను వేదికగా చేసుకోవాలని సీఈఓ స్పష్టం చేశారు. ఈ సభల్లో బీఎల్ఓలు క్రింది అంశాలను విధిగా చదివి వినిపించాలని ఆదేశించారు.
- ఏఎస్‌డీడీ ఓటర్లు : చిరునామాలో లేనివారు, ఇతర ప్రాంతాలకు మారినవారు, మరణించినవారు , మరియు ఒకరికంటే ఎక్కువ చోట్ల పేర్లున్న ఓటర్ల వివరాలను ప్రజల సమక్షంలో బహిరంగంగా చదివి వినిపించాలి.
- ముసాయిదా ఓటర్లు : కొత్తగా ముసాయిదా ఓటర్ల జాబితాలో చేర్చిన ఓటర్ల పేర్లను కూడా స్పష్టంగా ప్రదర్శించాలి.
- దరఖాస్తుల పరిశీలన : ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నప్పటికీ, ఏదైనా సాంకేతిక కారణాల వల్ల ముసాయిదా జాబితాలో పేర్లు రాని దరఖాస్తుదారుల వివరాలను తక్షణమే గుర్తించి… పరిశీలన జరపాలి.
2026 అక్టోబర్ 01 నాటికి 18 సంవత్సరాల వయస్సు పూర్తి చేసుకునే అర్హత గల పౌరులందరినీ ఓటర్లుగా నమోదు చేయించేలా విస్తృత అవగాహన కల్పించాలని సీఈఓ సూచించారు.
- ఫారం-6 : అర్హులైన కొత్త ఓటర్ల నమోదు కోసం ఫారం-6, డిక్లరేషన్ ఫారం, అవసరమైన ధ్రువీకరణ పత్రాలను సమర్పించేలా ప్రోత్సహించాలి.
- ఫారం-7 : అర్హత లేని, చెల్లని ఓటర్ల పేర్ల తొలగింపు కోసం ఫారం-7 ఉపయోగించాలి.
- ఫారం-8 : వివరాల్లో మార్పులు, చేర్పులు, సవరణల కోసం ఫారం-8 ద్వారా దరఖాస్తులు స్వీకరించాలి.
మ్యాపింగ్ లేని కేసులకు… జాబితాలో విరుద్ధ అంశాలున్న ఓటర్లకు తక్షణమే నోటీసులు రూపొందించి జారీ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని సీఈఓ ఆదేశించారు. జారీ చేసే ప్రతీ నోటీసులో విచారణ వేదిక , తేదీ సమయాన్ని స్పష్టంగా నమోదు చేయడం తప్పనిసరి చేశారు.
{{/usCountry}}మ్యాపింగ్ లేని కేసులకు… జాబితాలో విరుద్ధ అంశాలున్న ఓటర్లకు తక్షణమే నోటీసులు రూపొందించి జారీ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని సీఈఓ ఆదేశించారు. జారీ చేసే ప్రతీ నోటీసులో విచారణ వేదిక , తేదీ సమయాన్ని స్పష్టంగా నమోదు చేయడం తప్పనిసరి చేశారు.
{{/usCountry}}రాజకీయ పార్టీల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో భాగంగా, నో-మ్యాపింగ్ మరియు అనామలీస్ ఉన్న ఓటర్ల జాబితాలను సంబంధిత రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందించాలని బిఎల్ఓలకు ఆదేశాలు ఇచ్చారు. ఓటర్ల జాబితా ప్రక్రియపై స్పష్టతనిచ్చేందుకు ప్రతి వారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహించాలని స్పష్టం చేశారు.
గ్రామ, వార్డు సభలను అత్యంత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా మాత్రమే పౌరుల్లో వ్యవస్థపై విశ్వసనీయత పెరుగుతుందని సీఈఓ సి. సుదర్శన్ రెడ్డి పునరుద్ఘాటించారు. జిల్లా వ్యాప్తంగా ఓటర్ల నమోదు, నోటీసుల సమర్పణ, గ్రామ సభల నిర్వహణపై మరిన్ని సమాచారానికి లేదా తమ ఓటు నమోదు స్థితిని సరిచూసుకోవడానికి పౌరులు తమ ప్రాంతీయ ceo.telangana.gov.in పోర్టల్‌ను సందర్శించవచ్చని పేర్కొన్నారు.
మరోవైపు ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఓటర్ల(నో మ్యాపింగ్ , అనామలిస్)కు నోటీసుల జారీ ప్రక్రియ షురూ అయింది. నోటీసులు అందుకున్న వారిని ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 20 వరకు ఎన్నికల అధికారులు విచారణ చేపట్టనున్నారు. నోటీసుల జనరేషన్, ప్రింటింగ్ ప్రక్రియ ఈ నెల 31 నాటికి పూర్తి కానుంది.