...
...
Next Story

కర్ణాటక సీఎంతో పాలమూరు మంత్రుల చర్చలు - జూరాల నుంచి నీటి విడుదల

జురాల, బీమా ప్రాజెక్టుల పరిధిలో పంటలను కాపాడేందుకు కృష్ణా నీటిని విడుదల చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను మంత్రి జూపల్లి కృష్ణారావు బృందం కోరింది. డీకే సానుకూలంగా స్పందించారు.

Updated on: Sep 23, 2026, 12:59:30 IST
Advertisement

రాష్ట్రంలోని ప్రాజెక్టుల పరిధిలో ఎండిపోతున్న పంటలను కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దిగువన ఉన్న ఎండబెట్టిన ఎకరాలకు జీవం పోసేందుకు కృష్ణా నదీ జలాలను విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప్రతినిధి బృందం కర్ణాటక ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. ఈ మేరకు మంగళవారం బెంగళూరులో కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌తో ప్రజాప్రతినిధుల బృందం భేటీ అయింది.

నీటి విడుదల కోసం విజ్ఞప్తి…

కర్ణాటక సీఎంతో మంత్రి జూపల్లి, ఎమ్మెల్యేలు
కర్ణాటక సీఎంతో మంత్రి జూపల్లి, ఎమ్మెల్యేలు

తెలంగాణలోని జూరాల, నెట్టెంపాడు, భీమా మరియు కోయిల్ సాగర్ సాగునీటి ప్రాజెక్టుల ఆయకట్టు పరిధిలో వేసిన పంటలు ప్రస్తుతం అత్యంత కీలకమైన దశకు చేరుకున్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఈ సమయంలో నీరు అందకపోతే పంటలు పూర్తిగా ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతారని డీకే శివకుమార్‌కు వివరించారు. ఈ నాలుగు ప్రాజెక్టుల కింద సుమారు 5.5 లక్షల ఎకరాల్లో రైతులు రకరకాల పంటలు సాగు చేస్తున్నారని, ఈ పంటలను కాపాడేందుకు నెలకు 5,000 క్యూసెక్కుల చొప్పున నీటిని కర్ణాటక రిజర్వాయర్ల నుంచి విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనపై డీకే శివకుమార్ సానుకూలంగా స్పందించారని ప్రతినిధుల బృందం వెల్లడించింది.

కర్ణాటకకు సరిహద్దుగా ఉన్న జోగులాంబ గద్వాల జిల్లాలోని జురాల ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తూ గత కొద్దిరోజులుగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ అంశంపై రాజకీయంగానూ కాక పుట్టింది. సెప్టెంబర్ 21న ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS) పార్టీ ఆందోళనలు చేపట్టగా, సెప్టెంబర్ 22న గద్వాల జిల్లాలో బాధితులైన రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావును పోలీసులు అడ్డుకుని నిలిపివేశారు.

జూరాల ప్రాజెక్టు నుంచి ఆయకట్టు సాగు కోసం నీటి విడుదల ప్రారంభమైంది. మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాలతో ఇవాళ అధికారులు జూరాల ప్రధాన ఎడమ, కుడి కాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు భేటీ అయి కృష్ణా జలాలపై చర్చలు జరిపిన అనంతరం ఈ పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు సుమారు 2,300 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. ఎగువ ప్రాంతాల నుంచి దాదాపు 2,800 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి చేరుతోంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks