వేలాది మంది ఇళ్ల నివాస యజమానులకు ఉపశమనం కలిగించేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ భూముల్లో అనుమతులు తీసుకోకుండా నిర్మించిన ఇళ్ల రిజిస్ట్రేషన్లకు ఉన్న అడ్డంకులను తొలగించేందుకు సిద్ధమైంది. నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అసెస్మెంట్ (నాలా) రుసుము చెల్లించకుండా నిర్మించిన నివాసాలకు కూడా ఇకపై సులభంగా రిజిస్ట్రేషన్లు పూర్తి చేసేందుకు అధికారికంగా అనుమతులు ఇచ్చింది.
'నాలా' చిక్కుముళ్లకు చెక్…

ఇన్నాళ్లూ ఈ తరహా భూములు మరియు నిర్మించిన ఇళ్లు నిషేధిత ఆస్తుల జాబితా (22ఏ)లోనే మగ్గిపోయాయి. దీనివల్ల కొనుగోలుదారులు, యజమానులు తమ ఆస్తులను విక్రయించుకోలేక, బ్యాంక్ రుణాలు పొందలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటీవల శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీకి అనుగుణంగా రెవెన్యూ శాఖ పలు చర్యలు చేపట్టింది. నాలా చిక్కుముడులకు చెక్ పెట్టేలా శనివారం మార్గదర్శకాలను జారీ చేసింది.
కోర్టు కేసులు, న్యాయపరమైన వివాదాల్లో ఉన్న భూములు మినహా, నాలా అనుమతుల కోసం వచ్చే అర్హత కలిగిన దరఖాస్తులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని రెవెన్యూ శాఖ ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో దశాబ్దాలుగా రిజిస్ట్రేషన్ల కోసం ఎదురుచూస్తున్న సగటు మధ్యతరగతి ప్రజలకు కొండంత ఊరట లభించినట్లయింది.
సాధారణంగా వ్యవసాయ భూమిని నివాస లేదా వ్యాపార అవసరాలకు మార్చాలంటే 'నాలా' చట్టం ప్రకారం నిర్ణీత రుసుము చెల్లించి అనుమతి పొందడం విధిగా ఉంటుంది. అయితే గత కొన్నేళ్లుగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే వేల సంఖ్యలో వెంచర్లు, లేఅవుట్లు వెలిసాయి. చాలామంది ఫార్మ్‌లాండ్స్ పేరుతో సాగు భూములను కొనుగోలు చేసి వాటిల్లో ఇళ్లు, విల్లాలు కట్టుకున్నారు. ఇవన్నీ 22ఏ జాబితాలోకి చేరడంతో దశాబ్దాలుగా రిజిస్ట్రేషన్ వ్యవస్థ స్థంభించిపోయింది.
ఈ సమస్య వల్ల ప్రజలకే కాకుండా ప్రభుత్వ ఖజానాకు కూడా భారీగా గండి పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో భూముల్లో భవంతులు లేచినా, రెవెన్యూ రికార్డుల్లో మాత్రం అవి ఇప్పటికీ సాగు భూములుగానే కొనసాగుతున్నాయి. ఒకే సర్వే నంబర్ లో కొంత భాగంలో ఇల్లు నిర్మించుకుని, మిగతా భాగంలో వ్యవసాయం చేసుకుంటున్న వారు లక్షల సంఖ్యలో ఉన్నారు. నిబంధనల ప్రకారం ఆ భూమిని రీ-సర్వే చేసి, ఉప-సంఖ్య (సబ్ డివిజన్) కేటాయించి, నివాస స్థలాన్ని సాగు భూమి వివరాల నుంచి తొలగించాలి. కానీ ఈ ప్రక్రియ జరగకపోవడంతో పాత రికార్డులే దర్శనమిస్తున్నాయి.
{{/usCountry}}ఈ సమస్య వల్ల ప్రజలకే కాకుండా ప్రభుత్వ ఖజానాకు కూడా భారీగా గండి పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో భూముల్లో భవంతులు లేచినా, రెవెన్యూ రికార్డుల్లో మాత్రం అవి ఇప్పటికీ సాగు భూములుగానే కొనసాగుతున్నాయి. ఒకే సర్వే నంబర్ లో కొంత భాగంలో ఇల్లు నిర్మించుకుని, మిగతా భాగంలో వ్యవసాయం చేసుకుంటున్న వారు లక్షల సంఖ్యలో ఉన్నారు. నిబంధనల ప్రకారం ఆ భూమిని రీ-సర్వే చేసి, ఉప-సంఖ్య (సబ్ డివిజన్) కేటాయించి, నివాస స్థలాన్ని సాగు భూమి వివరాల నుంచి తొలగించాలి. కానీ ఈ ప్రక్రియ జరగకపోవడంతో పాత రికార్డులే దర్శనమిస్తున్నాయి.
{{/usCountry}}దీనివల్ల వ్యవసాయం జరగని భూములకు కూడా ప్రభుత్వం అందిస్తున్న 'రైతు భరోసా' సహాయం జమ అవుతోంది. తద్వారా ప్రతి ఏటా రూ.కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. ఇప్పుడు నాలా అనుమతులు, రిజిస్ట్రేషన్లకు స్పష్టమైన మార్గం సుగమం కావడంతో….. నిజమైన సాగు భూముల వివరాలు తేలి రైతుభరోసా నిధులు పక్కదారి పట్టకుండా అడ్డుకట్ట పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రతి దరఖాస్తును పరిష్కరించాలి - మంత్రి పొంగులేటి
ఇదే విషయంపై రెవెన్యూ ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. 22ఏ సమస్యల పరిష్కారానికి ఇచ్చిన ఆదేశాలు క్షేత్రస్థాయిలో పక్కాగా అమలుకావాలని స్పష్టం చేశారు. మండల స్థాయి అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తేనే బాధితులకు త్వరితగతిన న్యాయం జరుగుతుందని తేల్చిచెప్పారు.
నాలా రుసుము చెల్లింపు ప్రక్రియలో సామాన్య ప్రజలకు ఎలాంటి అయోమయం, అనవసర జాప్యం కలగకుండా అధికారులు పూర్తి సహకారం అందించాలని హెచ్చరించారు. ఎక్కడా కూడా లంచాలకు, నిర్లక్ష్యానికి తావులేకుండా అర్హత ఉన్న ప్రతి దరఖాస్తును వెంటనే పరిష్కరించాలన్నారు. ఇందులో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.