TGRPDCL : ఇక రాష్ట్రంలో మూడో విద్యుత్ డిస్కమ్‌ - జీవో విడుదల

Telangana Rythu Power Distribution Company Limited : రాష్ట్రంలో మూడో విద్యుత్ డిస్కమ్‌ ఏర్పాటైంది. ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. తెలంగాణ రైతు పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ (టీజీఆర్‌పీడీసీఎల్‌) ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

Published on: Mar 11, 2026, 16:17:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కొత్త విద్యుత్ డిస్కమ్ ఏర్పాటు చేస్తూ తెలంగాణ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో TGSPDCL, TGNPDCL విద్యుత్ డిస్క్ లు ఉండగా… తాజాగా మరోక డిస్కమ్ ను ఏర్పాటు చేసింది. తెలంగాణ రైతు పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ (టీజీఆర్‌పీడీసీఎల్‌) పేరుతో ఈ కొత్త డిస్కమ్ పని చేయనుంది.

టీజీఆర్‌పీడీసీఎల్‌
టీజీఆర్‌పీడీసీఎల్‌

ఈ కొత్త విద్యుత్ డిస్కమ్ ద్వారా… వ్యవసాయం, మిషన్ భగీరథ (CPWS), HMWSSB, ఎత్తిపోతల పథకాలతో పాటు మున్సిపల్ నీటి కనెక్షన్‌లకు ప్రత్యేక DTRల ద్వారా విద్యుతును సరఫరా చేస్తారు. కేటాయించిన PPA వాటా ప్రకారం విద్యుత్ కొనుగోలు చేయడంతో పాటు కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌లను మంజూరు చేస్తారు.

తెలంగాణ రైతు విద్యుత్ పంపిణీ సంస్థ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ముషారఫ్ అలీ ఫరూఖీ వ్యవహరించనున్నారు.డైరెక్టర్లుగా వంటేరు తిరుపతి రెడ్డి (డైరెక్టర్-ఫైనాన్స్, TGNPDCL), పి. కృష్ణా రెడ్డి (డైరెక్టర్-ఫైనాన్స్, రెవెన్యూ & లీగల్, TGSPDCL), వంగూరు మోహన్ రావు (డైరెక్టర్-ప్రాజెక్ట్స్, TGNPDCL), ఎన్. నరసింహులు (డైరెక్టర్-ఆపరేషన్, TGSPDCL) ఉండనున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఈ కొత్త విద్యుత్ డిస్కమ్ ఏర్పాటుపై గత కొంత కాలంగా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు సమీక్షలు నిర్వహించారు. విద్యుత్ విభాగంలో ప్రక్షాళనకు అవసరమైన సంస్కరణలు చేయాలని నిర్ణయించారు.

రాష్ట్రంలో వ్యవసాయం, గృహజ్యోతి, ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, ఇతర ప్రభుత్వ సంస్థలకు సరఫరా చేసే 200 యూనిట్ల ఉచిత్ విద్యుత్‌ను కొత్త డిస్కం పరిధిలోకి తీసుకురావాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి గతంలో సూచించారు. ఇందుకు గాను రాష్ట్రమంతా ఒకే యూనిట్‌గా కొత్త డిస్కమ్ పరిధి ఉండాలని అభిప్రాయపడ్డారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో సంబంధిత శాఖ అధికారులు కొత్త డిస్కమ్ ఏర్పాటుపై కసరత్తు చేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ అధికారికంగా జీవోను విడుదల చేశారు. తెలంగాణ రైతు పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ (టీజీఆర్‌పీడీసీఎల్‌) పేరిట కొత్త డిస్కమ్ ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More