...
...
Next Story

Telangana Inter Admissions : ఇంటర్ అడ్మిషన్లపై కొత్త అప్డేట్ - ఇదే చివరి అవకాశం!

తెలంగాణలో ఇంటర్ ప్రవేశాల కోసం చూస్తున్న విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు మరో అప్డేట్ ఇచ్చింది. రాష్ట్రంలోని అన్ని రకాల జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు మరో అవకాశం కల్పించింది.

Published on: Oct 23, 2026, 15:20:17 IST
Advertisement

తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు ఐదు నెలలు కావొస్తున్న తరుణంలో ఇప్పటివరకు ప్రవేశాలు పొందలేకపోయిన విద్యార్థులకు ఇంటర్మీడియట్ విద్యా మండలి మరో అవకాశం కల్పించింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరేందుకు అక్టోబర్ 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు అవకాశం ఉంటుందని ప్రకటన జారీచేసింది.

తెలంగాణలో ఇంటర్‌లో చేరేందుకు మరో అవకాశం
తెలంగాణలో ఇంటర్‌లో చేరేందుకు మరో అవకాశం

ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో విద్యార్థులు నేరుగా చేరవచ్చని…. ఒకవేళ ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ప్రవేశం పొందాలనుకుంటే ప్రతి అడ్మిషన్‌కు రూ.500 ఆలస్య రుసుము (లేట్ ఫీజు) చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

ఇంటర్మీడియట్ అడ్మిషన్ల ప్రక్రియలో ప్రైవేట్ కళాశాలలు ఎలాంటి ప్రత్యేక ప్రవేశ పరీక్షలు నిర్వహించకూడదని బోర్డు ఇప్పటికే హెచ్చరించింది. పదో తరగతిలో సాధించిన మార్కులు లేదా జీపీఏ మెరిట్ ప్రాతిపదికన మాత్రమే సీట్లను భర్తీ చేయాలని ఆదేశించింది. ప్రవేశాల సమయంలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సామాజిక వర్గాల వారీగా కేటాయించిన రిజర్వేషన్ల పద్ధతిని విధిగా పాటించాలని విద్యాసంస్థల యాజమాన్యాలకు స్పష్టం చేసింది.

ఈసారి ప్రవేశాలు పొందే ప్రతి విద్యార్థికి కొన్ని కొత్త నిబంధనలను విధిగా అమల్లోకి తెచ్చారు. అడ్మిషన్ పొందే విద్యార్థి తన ఆధార్ కార్డు కాపీని సమర్పించాల్సి ఉంటుంది. దీంతో పాటు యువతను మాదకద్రవ్యాల మహమ్మారికి దూరంగా ఉంచే ఆలోచనతో, తాము ఎలాంటి డ్రగ్స్ లేదా మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని హామీ ఇస్తూ 'యాంటీ డ్రగ్ డిక్లరేషన్' పత్రంపై విద్యార్థి, తల్లిదండ్రులు విధిగా సంతకం చేసి సమర్పించాలని బోర్డు నిబంధన విధించింది.

అనుమతి లేని కళాశాలలతో జాగ్రత్త: ఇంటర్ బోర్డు హెచ్చరిక

గుర్తింపు లేని కొన్ని ప్రైవేట్ జూనియర్ విద్యాసంస్థలు చేసే నిరాధారమైన ప్రచారాలు, ఆకర్షణీయమైన ప్రకటనలు, నకిలీ గారడీలను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. అడ్మిషన్లకు సంబంధించి లేదా కళాశాలల గుర్తింపుపై ఎలాంటి సందేహాలు ఉన్నా వెంటనే TGBIE అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించి సమాచారం తెలుసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks