తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్(TGBIE) మార్చి 2027లో జరగబోయే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు (IPE March 2027) సంబంధించిన ఫీజు చెల్లింపుల షెడ్యూల్ను అధికారికంగా విడుదల చేసింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి ఒక ప్రకటన ద్వారా పూర్తి వివరాలను వెల్లడించారు.

మొదటి సంవత్సరం, ద్వితీయ సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులతో పాటు, ఫెయిల్ అయిన అభ్యర్థులు (జనరల్, వొకేషనల్), అలాగే అటెండెన్స్ మినహాయింపు పొందిన ప్రైవేట్ అభ్యర్థులు (ఆర్ట్స్/హ్యుమానిటీస్ గ్రూపులు) ఈ ఫీజు చెల్లించేందుకు అర్హులుగా పేర్కొన్నారు.
ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలు విద్యార్థులు ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా, ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించేందుకు చివరి తేదీల వివరాలను ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఆలస్య రుసుము లేకుండా 26-10-2026 నుండి 09-11-2026 వరకు చెల్లించవచ్చు.
ముఖ్యమైన తేదీలు
రూ.100 ఆలస్య రుసుముతో 11-11-2026 నుండి 20-11-2026 వరకు చెల్లించాలి.
రూ.500 ఆలస్య రుసుముతో 22-11-2026 నుండి 29-11-2026 వరకు ఫీజు పే చేయవచ్చు.
రూ.1,000 ఆలస్య రుసుముతో 01-12-2026 నుండి 07-12-2026 వరకు చెయెుచ్చు.
రూ.2,000 ఆలస్య రుసుముతో 09-12-2026 నుండి 14-12-2026 వరకు ఫీజు చెల్లించాలి.
ఫీజుల వివరాలు
కోర్సుల వారీగా పరీక్షల ఫీజు వివరాలు చూసుకుంటే.. పరీక్షలకు హాజరయ్యే ప్రథమ, ద్వితీయ సంవత్సరాల జనరల్, వొకేషనల్ విద్యార్థులకు చెల్లించాల్సిన రుసుము వివరాలను బోర్డు స్పష్టంగా ప్రకటించింది.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ జనరల్ రెగ్యులర్-రూ.540.
{{/usCountry}}ఇంటర్ ఫస్ట్ ఇయర్ జనరల్ రెగ్యులర్-రూ.540.
{{/usCountry}}ఇంటర్ ఫస్ట్ ఇయర్ వొకేషనల్ రెగ్యులర్-రూ.890 (థియరీ: రూ.540 + ప్రాక్టికల్స్: రూ.250 + ఇంగ్లీష్ ప్రాక్టికల్స్: రూ.100).
ఇంటర్ సెకండ్ ఇయర్ జనరల్ ఆర్ట్స్-రూ.540.
ఇంటర్ సెకండ్ ఇయర్ జనరల్ సైన్స్-రూ.890(థియరీ: రూ.540 + ప్రాక్టికల్స్: రూ.250 + ఇంగ్లీష్ ప్రాక్టికల్స్: రూ.100).
ఇంటర్ సెకండ్ ఇయర్ వొకేషనల్-రూ.890(థియరీ: రూ.540 + ప్రాక్టికల్స్: రూ.250 + ఇంగ్లీష్ ప్రాక్టికల్స్: రూ.100).
విద్యార్థులు తమ తమ కళాశాలల ప్రిన్సిపాళ్ల ద్వారా నిబంధనల ప్రకారం నిర్దేశిత తేదీల్లోగా పరీక్ష ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. చివరి తేదీ వరకు వేచి చూడకుండా, ఎలాంటి ఫైన్ లేదా ఆలస్య రుసుము పడకుండా అక్టోబర్ 26 నుండి నవంబర్ 09 మధ్యలోనే ఫీజు చెల్లించడం ఉత్తమం. దరఖాస్తు సమయంలో విద్యార్థులు తమ వ్యక్తిగత వివరాలు, సబ్జెక్టులు, గ్రూపుల ఎంపికను సరిగ్గా చెక్ చేసుకోవాలని ఇంటర్ బోర్డు సూచించింది.