తెలంగాణ ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. ఫిబ్రవరి 25 నుంచే పరీక్షలు

తెలంగాణ ఇంటర్ ఎగ్జామ్స్ 2026 షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 25 నుంచే పరీక్షలు ముదలవుతాయి. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి ముదటి వారంలో ఉంటాయి.

Published on: Oct 25, 2025, 12:36:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు(IPE) 2026 ఫిబ్రవరి 25 నుండి ప్రారంభమవుతాయి. శనివారం విలేకరుల సమావేశంలో తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఎస్ కృష్ణ ఆదిత్య వివరాలు వెల్లడించారు. ఫిబ్రవరి 25 నుండి మార్చి 18 వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షల టైమ్‌టేబుల్‌ను రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని అన్నారు. ‘మేము త్వరలో పరీక్షలకు సంబంధించిన వివరణాత్మక షెడ్యూల్‌ను జారీ చేస్తాం.’ అని ఆయన చెప్పారు.

తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి మొదటి వారం నుండి ప్రారంభమవుతాయి. ఇంటర్మీడియట్ పరీక్షల ఫీజును సంబంధిత కళాశాలకు చెల్లించాల్సిన నోటిఫికేషన్ బోర్డు త్వరలో జారీ చేస్తుంది. ఈ ప్రక్రియ నవంబర్ 1 నుండి ప్రారంభమవుతుంది.

ఇంటర్ పరీక్షల తేదీలతోపాటుగా ప్రాక్టికల్స్, పరీక్షల్లో చేస్తున్న మార్పుల గురించి ఇంటర్ బోర్డు సెక్రటరీ ఆదిత్య వివరాలు వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా ముత్తం 9 లక్షల 50 వేల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో డిజిటల్ కంటెంట్ లోకి ప్రతీ చాప్టర్ మారుస్తున్నట్టుగా పేర్కొన్నారు. ఇంటర్ సిలబస్‌లో పలు మార్పులు తీసుకొచ్చామన్నారు. ప్రతీ సబ్జెక్టును 80:20లో విభజిస్తున్నామన్నారు.

విద్యార్థుల భాషా నైపుణ్యాలు పెంచేలా కార్యక్రమాలు ఉంటాయన్నారు బోర్డు సెక్రటరీ. కొత్త సిలబస్ 2026 నుంచి అమలులోకి వస్తుందన్నారు. కామర్స్ విద్యార్థుల కోసం ఏసీఈ గ్రూపును అంటే అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్‌తో స్పెషల్ కోర్సు రూపొందించినట్టుగా వెల్లడించారు.

తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యలో భారీ మార్పులు రాబోతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్ విద్యలో పలు సంస్కరణలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వచ్చే ఏడాది నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయి.

ప్రస్తుతం సెకండ్ ఇయర్ ఎంపీసీ, బైపీసీ వారికి ప్రయోగ పరీక్షలు ఉన్న విషయం తెలిసిందే. ఇక మీదట ఫస్ట్ ఇయర్ వారికి కూడా ఉండనున్నాయి. ప్రస్తుతం ఉన్న మార్కులనే రెండు సంవత్సరాలకు సమానంగా కేటాయింపు చేస్తారు. అంటే ఫస్ట్ ఇయర్‌ ఎంపీసీ గ్రూపులో ఫిజిక్స్, కెమిస్ట్రీ 15 మార్కులు, సెకండర్ ఇయర్‌లో 15 మార్కులకు ప్రాక్టికల్స్ ఉంటాయి. బైపీసీ గ్రూపులో ఒక్కో సబ్జెక్టుకు 30 చొప్పున నాలుగు సబ్జెక్టులకు 120 మార్కులకు ప్రాక్టికల్స్ ఉంటాయి. వాటిని ఇక మీదట సగం చేస్తారు.

గణితం, భౌతిక, రసాయన శాస్త్రాల్లో సిలబస్ తగ్గించేందుకు చర్యలు తీసుకోనుంది ఇంటర్ బోర్డు. జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి నిర్దేశించిన దాని కంటే ఇక్కడ సిలబస్ ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. ఎన్​సీఈఆర్​టీతో సమానంగా ఇకపై సిలబస్​ను ఉండనుంది. పాఠ్య పుస్తకాల్లో క్యూఆర్ కోడ్ ముద్రించి.. దాన్ని స్కాన్ చేస్తే మరిన్ని వివరాలు వచ్చేలా చేయనున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More