...
...
Next Story

తెలంగాణ ఐటీఐ అడ్మిషన్ల నోటిఫికేషన్ 2026 విడుదల.. అప్లై ఎలా చేయాలి? పూర్తి వివరాలు ఇవే

తెలంగాణలో 2026-27 విద్యా సంవత్సరానికి ఐటీఐలో ప్రవేశానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరిస్తారు.

Published on: May 28, 2026, 11:04:55 IST
Advertisement

2026-27 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కాలేజీల్లో ప్రవేశాల భర్తీకి ఉపాధి, శిక్షణ శాఖ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులకు అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలను అందించడమే లక్ష్యంగా ఈ ప్రవేశాలు కల్పిస్తున్నారు.

తెలంగాణ ఐటీఐ అడ్మిషన్స్ 2026
తెలంగాణ ఐటీఐ అడ్మిషన్స్ 2026

ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మోటార్ మెకానిక్, కంప్యూటర్ ఆపరేటర్ వంటి 47 రకాల విభిన్న ట్రేడ్‌లలో శిక్షణ ఇస్తారు. మెుత్తం ప్రభుత్వ ఐటీఐలు: 63 ఉన్నాయి. ఏటీసీ (Advanced Training Centres) సెంటర్లు 65, ప్రైవేట్ ఐటీఐ కాలేజీలు 230 ఉన్నాయి.

మెజారిటీ కోర్సులకు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అయితే కొన్ని ప్రత్యేక కోర్సులకు 8వ తరగతి పాసైన వారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థుల కనీస వయస్సు 14 ఏళ్లు నిండి ఉండాలి. కాగా గరిష్ట వయోపరిమితిపై ఎలాంటి నిబంధనలు లేవు. ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా ప్రవేశపెట్టిన డ్రోన్ కోర్సులో చేరాలనుకునే అభ్యర్థులకు కనీసం 16 ఏళ్లు నిండి ఉండటం తప్పనిసరి.

ఈ ప్రవేశాలకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. అభ్యర్థులకు పదో తరగతిలో వచ్చిన మార్కులు/జీపీఏ (GPA) ఆధారంగా, పూర్తి పారదర్శకంగా మెరిట్ లిస్ట్ రూపొందించి సీట్లను కేటాయిస్తారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా వర్తిస్తుంది.

  • దరఖాస్తు ప్రారంభ తేదీ: మే 25, 2026
  • చివరి తేదీ: జూన్ 8, 2026

అధికారిక వెబ్‌సైట్ iti.telangana.gov.in పోర్టల్‌ను సందర్శించి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో ఆధార్ కార్డ్, మార్క్స్ మెమో, కుల ధృవీకరణ పత్రం (Caste Certificate), ఆదాయ ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలను సిద్ధంగా ఉంచుకోవాలి.

'ఐటీఐ దరఖాస్తు సమర్పణకు కావలసినవి: మొబైల్ నంబర్, మెయిల్ ఐడీ, ఎస్ఎస్సీ / తత్సమాన మెమో, స్టడీ సర్టిఫికేట్లు, కుల ధృవీకరణ పత్రం, పీహెచ్ మొదలైన వాటి స్కాన్ చేసిన కాపీలు, ఇటీవలి పాస్ ఫోటో, సంతకం.' అని నోటిఫికేషన్‌లో ప్రభుత్వం పేర్కొంది.

ఎలా అప్లై చేయాలి?

  • తెలంగాణ ఐటీఐ అడ్మిషన్స్ పోర్టల్‌ https://iti.telangana.gov.in/ను సందర్శించండి.
  • 'కొత్త రిజిస్ట్రేషన్' పై క్లిక్ చేసి, ప్రాథమిక నమోదును పూర్తి చేయండి.
  • లాగిన్ అయి, మీ వ్యక్తిగత, విద్యా వివరాలతో దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.
  • అవసరమైన అన్ని పత్రాలను, మీ ఇటీవలి ఫోటోను అప్‌లోడ్ చేయండి.
  • దరఖాస్తు రుసుము చెల్లించి, మీ దరఖాస్తును సమర్పించండి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks