...
...
Next Story

రైల్వే ప్రయాణికులకు అలర్ట్…. వికారాబాద్, షాద్‌నగర్‌లలో పలు రైళ్లకు తాత్కాలిక హాల్టింగ్!

కన్హా శాంతివనంలో జరగనున్న ఆధ్యాత్మిక సదస్సు నేపథ్యంలో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు వికారాబాద్, షాద్‌నగర్ స్టేషన్లలో తాత్కాలిక స్టాపేజ్ కేటాయిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రకటన విడుదలైంది.

Published on: Sep 25, 2026, 17:15:01 IST
Advertisement

తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ముఖ్యమైన అప్డేట్ అందించింది. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని కన్హా శాంతివనంలో సహజ్ మార్గ్ స్పిరిచువాలిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఆధ్యాత్మిక సదస్సు జరగనుంది. ఈ మహోత్సవానికి దేశవిదేశాల నుంచి వేలాదిమంది భక్తులు, ఆధ్యాత్మిక ప్రేమికులు తరలివచ్చే అవకాశం ఉంది. భక్తుల రద్దీని దృష్ట్యా వారి సౌకర్యార్థం వికారాబాద్, షాద్‌నగర్ రైల్వే స్టేషన్లలో పలు కీలక ఎక్స్‌ప్రెస్ రైళ్లకు తాత్కాలికంగా ఒక నిమిషం పాటు నిలుపుదల (హాల్టింగ్) కల్పిస్తున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.

వికారాబాద్ స్టేషన్‌లో ఆగనున్న రైళ్లు:

  • సీఎస్‌టీ ముంబై - భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబరు: 11019) : ఈ రైలు 2026 సెప్టెంబరు 24, 25 తేదీల్లో ప్రారంభమయ్యే సర్వీసులకు సంబంధించి వికారాబాద్ స్టేషన్‌కు అర్థరాత్రి దాటిన తర్వాత 01.56 గంటలకు చేరుకుని, 01.57 గంటలకు బయలుదేరుతుంది.
  • రాజ్‌కోట్ - సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబరు: 22717): 2026 సెప్టెంబరు 24న రాజ్‌కోట్‌లో బయలుదేరే ఈ రైలు ఉదయం 05.09 గంటలకు వికారాబాద్ చేరుకుని, 05.10 గంటలకు బయలుదేరుతుంది.
  • భువనేశ్వర్ - సీఎస్‌టీ ముంబై కోణార్క్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబరు: 11020) : ఈ రైలు 2026 సెప్టెంబరు 29, 30 తేదీల్లో గమ్యస్థానం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.17 గంటలకు వికారాబాద్ చేరుకుని, 12.18 గంటలకు ప్రయాణమవుతుంది.
  • సికింద్రాబాద్ - రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబరు: 22718) : 2026 సెప్టెంబరు 29న సికింద్రాబాద్‌లో ప్రారంభమయ్యే ఈ రైలు సాయంత్రం 16.17 గంటలకు వికారాబాద్ స్టేషన్‌కు చేరుకుని, 16.18 గంటలకు బయలుదేరుతుంది.

షాద్‌నగర్ స్టేషన్‌లో ఆగనున్న రైలు:

  • అశోకాపురం - కాచిగూడ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబరు: 12786) : 2026 సెప్టెంబరు 24, 25 తేదీల్లో ప్రయాణం ప్రారంభించే ఈ రైలు తెల్లవారుజామున 04.29 గంటలకు షాద్‌నగర్ స్టేషన్‌కు చేరుకుని, 04.30 గంటలకు బయలుదేరుతుంది.

పలు రైళ్లకు తాత్కాలిక హాల్టింగ్!
పలు రైళ్లకు తాత్కాలిక హాల్టింగ్!

కన్హా శాంతివనానికి వెళ్లే భక్తులు ఈ తాత్కాలిక సదుపాయాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికను ఈ వేళలకు అనుగుణంగా సిద్ధం చేసుకోవాలని కోరారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks