TG EAPCET 2026 Results : రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఈఏపీసెట్ ఫలితాలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే ప్రాథమిక కీలను విడుదల చేయగా…. తుది ఫలితాలను ప్రకటించేందుకు జేఎన్టీయూ కసరత్తు చేస్తోంది. అన్ని కుదిరితే ఈనెల 25వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఈ తేదీ కుదరకపోతే ఒకరోజు అటు ఇటు కావొచ్చని సమాచారం. మొత్తంగా… ఈనెలాఖారులోపే ఈ ఫలితాలను ప్రకటించే సూచనలున్నాయి.

పరీక్షలు విజయవంతంగా ముగియడంతో,… ప్రస్తుతం ఫలితాలను ప్రాసెసింగ్ చేస్తున్నారు. ఇప్పటికే అగ్రికల్చర్, ఫార్మసీ ప్రాథమిక కీలపై అభ్యంతరాలను స్వీకరించారు. ఇక ఇంజినీరింగ్ స్ట్రీమ్ ప్రాథమిక కీపై అభ్యంతరాలకు ఇవాళ్టితో గడువు పూర్తి కానుంది. ఈ గడువు ముగిస్తే… అభ్యంతరాలను పరిశీలించి… తుది కీలతో పాటు ర్యాంకులను సిద్ధం చేస్తారు.
టీజీ ఈఏపీసెట్ - 2026 ఫలితాలు ఎప్పుడు.. ?
మే 25వ తేదీన టీజీ ఈఏపీసెట్ ఫలితాలను వెల్లడించాలని ప్రాథమికంగా నిర్ణయించినప్పటికీ… ఒకవేళ సాంకేతిక కారణాల వల్ల ఆ రోజు వీలు కాకపోతే.. మరుసటి రోజైన మే 26న ఫలితాలు విడుదల చేసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఫలితాల వెల్లడి అనంతరం ర్యాంకుల ఆధారంగా ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఎప్‌సెట్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలు విడుదలైన వెంటనే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్(eapcet.tsche.ac.in)) ద్వారా తమ ర్యాంక్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫలితాల వెల్లడి తేదీపై ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఈసారి ఇంజినీరింగ్ పరీక్షలను మొత్తం ఆరు షిఫ్టుల్లో నిర్వహించారు. ఈ పరీక్షల కోసం 2,10,766 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 1,97,241 (దాదాపు 93.5%) మంది పరీక్షకు హాజరైనట్లు పరీక్ష కన్వీనర్ విజయకుమార్‌రెడ్డి వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి విద్యార్థుల హాజరు శాతం ఆశాజనకంగా ఉందని అధికారులు భావిస్తున్నారు.
{{/usCountry}}ఈసారి ఇంజినీరింగ్ పరీక్షలను మొత్తం ఆరు షిఫ్టుల్లో నిర్వహించారు. ఈ పరీక్షల కోసం 2,10,766 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 1,97,241 (దాదాపు 93.5%) మంది పరీక్షకు హాజరైనట్లు పరీక్ష కన్వీనర్ విజయకుమార్‌రెడ్డి వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి విద్యార్థుల హాజరు శాతం ఆశాజనకంగా ఉందని అధికారులు భావిస్తున్నారు.
{{/usCountry}}