విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఫిబ్రవరి 16 నుంచి స్కూళ్లలో సాయంత్రం స్నాక్స్
తెలంగాణలో పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. సాయంత్రంపూట స్నాక్స్ అందించాలని నిర్ణయించింది.
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లోని పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. స్కూళ్లలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు స్నాక్స్ అందించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10 వరకు మెుత్తం 19 రోజులపాటు వీటిని అందించనున్నారు. ఇందుకోసం సమగ్ర శిక్షా అభియాన్ నిధుల నుంచి రూ.4.23 కోట్లు మంజూరు అయ్యాయి.

పదో తరగతి విద్యార్థులకు సాయంత్రంపూట స్నాక్స్ అందించాలని నిర్ణయిస్తూ.. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. గవర్నమెంట్, జిల్లా పరిషత్, మోడల్ స్కూళ్లలోన విద్యార్థులకు వీటిని అందిస్తారు. జిల్లాల వారీగా కేటాయించిన బడ్జెట్‌ను వెంటనే.. ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులకు విడుదల చేయాలని చెప్పారు. అక్కడి నుంచి స్కూళ్లకు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా స్కూళ్లలో ఉండే విద్యార్థులు ఆకలితో ఇబ్బంది పడకూడదని ఈ నిధులు కేటాయించినట్టుగా తెలిపారు.
పదో తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసులు అక్టోబర్, నవంబర్ నెలల్లోనే ప్రారంభమయ్యాయి. అయితే కేవలం 19 రోజులే స్నాక్స్ అందించడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. గతేడాది 39 రోజులు అందించారని, ఈ ఏడాది కేవలం 19 రోజులే ఇవ్వడం సరికాదని టీఆర్టీఎఫ్ పేర్కొంది.
పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు
తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపుల గడువు పూర్తి కాగా అధికారులు మరో అవకాశం కల్పించారు. తత్కాల్ పథకం కింద రూ.1000 ఆలస్య రుసుంతో ఈ నెల 21 నుంచి ఫీజు చెల్లించుకోవచ్చని ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ గడువు జనవరి 27వ తేదీతో ముగియనుంది. ఇక జనవరి 29వ తేదీలోపు విద్యార్థుల సమాచారాన్ని ఆయా హెడ్ మాస్టర్లు.. డీఈవోలకు సమర్పించాల్సి ఉంటుంది.
ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించిన నేపథ్యంలో మరోసారి పరీక్ష రుసుము చెల్లించడానికి గడువు తేదీలు ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగింపు ఉండదు. విద్యార్థులు https://bse.telangana.gov.in/ వెబ్ సైట్ లో వివరాలను తెలుసుకోవచ్చు.
కొద్దిరోజుల కిందటే తెలంగాణ పదో తరగతి పరీక్ష టైమ్ టేబుల్ విడుదలైంది. 2026 మార్చి 14 శనివారం ప్రారంభమై.. ఏప్రిల్ 16వ తేదీన ముగుస్తాయి. పరీక్షలు ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహిస్తారు. ఫిజిక్స్, బయోలజీ ఎగ్జామ్స్ సమయంలో మాత్రం మార్పులు ఉంటాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


