TG RERA Grievance : గృహ కొనుగోలుదారులకు అండగా టీజీ రెరా - గ్రీవెన్స్ అండ్ గైడెన్స్ సెల్ ప్రారంభం, ఏం చేస్తుందంటే..?

TG RERA PGGC : రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత పెంచేందుకు తెలంగాణ రెరా మరో అడుగు ముందుకువేసింది. ఇళ్లు కొనేవారు, బిల్డర్లు, ఏజెంట్ల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 'పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ గైడెన్స్ సెల్'ను అందుబాటులోకి తెచ్చింది.

Published on: Apr 17, 2026, 11:29:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గృహ కొనుగోలుదారులకు మరింత భరోసాగా ఉండేందుకు తెలంగాణ రెరా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ గైడెన్స్ సెల్ ను గురువారం ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంలో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించేందుకు, ఫిర్యాదులను వేగంగా స్వీకరించేందుకు వీలుగా ఈ సరికొత్త వ్యవస్థ పని చేయనుంది.

తెలంగాణ రెరా కీలక నిర్ణయం (Photo for representational purposes only)
తెలంగాణ రెరా కీలక నిర్ణయం (Photo for representational purposes only)

హైదరాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ASCI) సహకారంతో ఈ విభాగాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచనల మేరకు….. జాతీయ స్థాయి చర్చల అనంతరం ఈ గ్రీవెన్స్ సెల్‌ను తీసుకువచ్చారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత బలోపేతం చేయడం దీని ప్రధాన ఉద్దేశం.

కొనుగోలుదారులకు మరింత భరోసా..

సాధారణంగా ఇళ్లు లేదా ఫ్లాట్లు కొనే సమయంలో సామాన్యులకు అనేక సందేహాలు ఉంటాయి. ప్రాజెక్ట్ వెరిఫికేషన్ ఎలా చేయాలి? బిల్డర్ చెబుతున్న వివరాలు నిజమేనా? వంటి విషయాల్లో ఈ ప్రత్యేక సెల్ మార్గదర్శనం చేస్తుంది.

"రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకతను పెంచేందుకు, భాగస్వాములందరినీ సమన్వయం చేసేందుకే ఈ విభాగాన్ని ప్రారంభించాం" అని టీజీ-రెరా చైర్మన్ ఎన్. సత్యనారాయణ ఒక ప్రకటనలో వెల్లడించారు.

2016 నాటి రియల్ ఎస్టేట్ నియంత్రణ మరియు అభివృద్ధి చట్టం (RERA) పారదర్శకతను నిర్ధారిస్తున్నప్పటికీ… ప్రాజెక్టుల జాప్యం, బిల్డర్ల నుంచి కమ్యూనికేషన్ లోపం వంటి సమస్యలు బాధితులను ఇబ్బంది పెడుతున్నాయి. ఈ కొత్త సెల్ ద్వారా ఫిర్యాదుదారులకు వారి హక్కులు, బాధ్యతలపై అవగాహన కల్పించడంతో పాటు, రీఫండ్, నష్టపరిహారం మరియు గడువులోగా స్వాధీనం వంటి అంశాల్లో సహకారం అందిస్తారు.

కేవలం కొనుగోలుదారులకే కాకుండా, ప్రాజెక్ట్ ప్రమోటర్లు, భూ యజమానులు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు కూడా ఈ సెల్ సహాయకారిగా ఉంటుంది. ప్రాజెక్టుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ, చట్టపరమైన నిబంధనలు, డిస్క్లోజర్స్ (వివరాల వెల్లడి) వంటి అంశాల్లో వీరికి స్పష్టతనిస్తుంది. దీనివల్ల రియల్ ఎస్టేట్ రంగంలో వృత్తి నైపుణ్యం పెరగడమే కాకుండా… అనవసరమైన వివాదాలు తగ్గే అవకాశం ఉంది.

ఈ గ్రీవెన్స్ సెల్ నిర్వహణ కోసం ప్రభుత్వం ఒక పటిష్టమైన బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ఒక టీమ్ లీడర్, డెస్క్ ఆఫీసర్లు, కమ్యూనికేషన్స్ స్పెషలిస్ట్, అసిస్టెంట్లు ఉంటారు. వీరు ప్రతి రోజూ వచ్చే ఫిర్యాదులను క్రమబద్ధీకరించి, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్తారు. తెలంగాణవ్యాప్తంగా ఉన్న రియల్ ఎస్టేట్ స్టేక్ హోల్డర్లకు ఇది ఒక వంతెనలా పనిచేస్తుందని చైర్మన్ వివరించారు. ఈ సెల్ కేవలం సమస్యల పరిష్కారానికే కాకుండా….. భవిష్యత్తులో కొత్త పాలసీల రూపకల్పనకు అవసరమైన ఫీడ్‌బ్యాక్‌ను కూడా ప్రభుత్వానికి అందిస్తుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More