తెలంగాణలోని పదో తరగతి విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే వీరి నిరీక్షణకు తెరపడే సమయం దగ్గరపడింది. ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న టెన్త్ ఫలితాలను ఈ నెల 29న లేదా 30వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రభుత్వ పరీక్షల విభాగం ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది.

మొదట మే మొదటి వారంలో ఫలితాలు వస్తాయని భావించినప్పటికీ… ఈ నెలాఖారు నాటికే ఫలితాలను ప్రకటించనున్నారు. స్పాట్ వాల్యూయేషన్ తో పాటు ఇతర ప్రక్రియలు వేగంగా పూర్తి కావటంతో ముందుగానే విడుదల చేయాలని నిర్ణయించారు.
రాష్ట్రవ్యాప్తంగా మార్చి 14వ తేదీ నుంచి ప్రారంభమైన పదో తరగతి ప్రధాన పరీక్షలు ఏప్రిల్ 13వ తేదీతో ముగిశాయి. సుమారు 5.15 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు ముగిసిన వెంటనే విద్యాశాఖ యుద్ధ ప్రాతిపదికన జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ప్రారంభించింది. ఈ నెల 23వ తేదీ నాటికే పేపర్ల దిద్దుబాటు ప్రక్రియను అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. మార్కుల నమోదు, క్రోడీకరణ ప్రక్రియను కూడా వేగంగా నిర్వహించి….. ఫలితాలను సిద్ధం చేశారు.
సర్కార్ గ్రీన్ సిగ్నల్…!
ఫలితాల విడుదలకు సంబంధించి విద్యాశాఖ పంపిన ప్రతిపాదనలకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ నెల 29న (బుధవారం) ఫలితాలను ప్రకటించేందుకు ప్రాథమికంగా నిర్ణయించారు. ఒకవేళ సాంకేతిక కారణాల వల్ల ఆ రోజు వీలుకాకపోతే, మరుసటి రోజైన 30వ తేదీన ప్రకటించే అవకాశం ఉంది. ఇంటర్ ఫలితాల మాదిరిగానే ఈ ఫలితాలను కూడా ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు చేతుల మీదుగా విడుదల చేస్తారని తెలిసింది.
TG SSC ఫలితాలను ఎక్కడ చెక్ చేసుకోవాలి…?
తెలంగాణ టెన్త్ ఫలితాలను https://bse.telangana.gov.in/ లేదా results.cgg.gov.in వెబ్ సైట్లలో తెలుసుకోవచ్చు. హాల్ టికెట్ నెంబర్ ఆధారంగా చెక్ చేసుకోవచ్చు. అయితే ఈసారి ఎస్సెస్సీ బోర్డు కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే హాల్‌టికెట్లను సైతం వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకొనే వెసులుబాటు కల్పించిన బోర్డు….. తాజాగా ఫలితాలను సైతం వాట్సాప్ ద్వారా తెలుసుకొనే వీలు కల్పించింది.
{{/usCountry}}తెలంగాణ టెన్త్ ఫలితాలను https://bse.telangana.gov.in/ లేదా results.cgg.gov.in వెబ్ సైట్లలో తెలుసుకోవచ్చు. హాల్ టికెట్ నెంబర్ ఆధారంగా చెక్ చేసుకోవచ్చు. అయితే ఈసారి ఎస్సెస్సీ బోర్డు కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే హాల్‌టికెట్లను సైతం వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకొనే వెసులుబాటు కల్పించిన బోర్డు….. తాజాగా ఫలితాలను సైతం వాట్సాప్ ద్వారా తెలుసుకొనే వీలు కల్పించింది.
{{/usCountry}}పరీక్ష రాసిన విద్యార్థులు…. 80969 58096 నంబర్‌కు ‘హాయ్’ అని సందేశం పంపించాలి. ఆ తర్వాత ఎస్సెస్సీ రిజల్ట్స్ అని టైప్‌చేసి హాల్‌టికెట్ నంబర్, ఇతర వివరాలు నమోదుచేయాలి. ఆ తర్వాత ఫలితం స్క్రీన్‌పై డిస్ ప్లే అవుతుంది.
అంతేకాకుండా గతేడాది మాదిరిగానే హిందుస్తాన్ టైమ్స్ వెబ్ సైట్ ( https://www.hindustantimes.com/ ) లోనూ ఫలితాలు అందుబాటులో ఉంటాయి. విద్యార్థి హాల్ టికెట్ నెంబర్ ఆధారంగా మార్కుల వివరాలను వేగంగా తెలుసుకోవచ్చు.