టీజీఎస్ఆర్టీసీ నుంచి ఏపీకి సంక్రాంతి స్పెషల్ బస్సులు.. ఈ తేదీల్లో

హైదరాబాద్‌ నుంచి ఏపీకి సంక్రాంతికి వెళ్లేందుకు ఇప్పటికే చాలా మంది ప్రయాణికులు ప్లాన్ చేసుకున్నారు. కొందరికి టికెట్ బుక్ అవ్వక ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. అలాంటి వారి కోసం గుడ్‌న్యూస్ చెప్పింది టీజీఎస్ఆర్టీసీ.

Published on: Dec 30, 2025, 16:45:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సంక్రాంతి సందడి మెుదలైపోయింది. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లేందుకు చాలా మంది ఇప్పటికే రైలు, బస్సు, విమాన టికెట్లను బుక్ చేసుకున్నారు. ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఫుల్ అయిపోయాయి. రైల్వే శాఖ సైతం ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇక ప్రైవేటు బస్సుల్లో ఛార్జీలు మాత్రం దారుణంగా పెంచేశారు. ముందస్తుగా ఏపీకి వెళ్లేవారు టికెట్లు బుక్ చేసేసుకున్నారు

సంక్రాంతికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
సంక్రాంతికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

చాలా మంది టికెట్లు దొరక్క ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. అలాంటివారికి టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు ప్రత్యేక బస్సులను నడుపుతోంది ఆర్టీసీ. ఈ మేరకు వివరాలు వెల్లడించింది. ఈ బస్సు సర్వీసులు జనవరి 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని బీహెచ్‌ఈఎల్‌ డిపో మేనేజర్ సుధా వెల్లడించారు.

ఈ ప్రత్యేక బస్సు సర్వీసులు జనవరి 9 నుండి 13 వరకు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు టీజీఎస్ఆర్టీసీ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకోవాలి. రాబోయే సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ శివారు ప్రాంతాల నుండి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలకు అదనపు బస్సు సర్వీసులను నడపుతోంది ఆర్టీసీ.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, బీహెచ్ఈఎల్(ఆర్‌సీ పురం) డిపో నుండి మియాపూర్, కేపీహెచ్‌బీ, ఔటర్ రింగ్ రోడ్ (ORR) మీదుగా ప్రయాణం సజావుగా సాగేలా, ట్రాఫిక్ రద్దీని నివారించడానికి ప్రత్యేక బస్సులు నడుపుతారు. సిటీలోకి వచ్చి వెళ్తే.. ట్రాఫిక్‌తో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. చాలా టైమ్ వేస్ట్ అవుతుంది.

ఈ స్పెషల్ బస్సు సర్వీసులు అమలాపురం, కాకినాడ, నరసాపురం, విశాఖపట్నం, రాజమండ్రి, పోలవరం, గుంటూరు, చీరాల, విజయవాడతోపాటుగా ఇతర ప్రాంతాలను కవర్ చేస్తాయి. సంక్రాంతి ప్రత్యేక సర్వీసులు జనవరి 9 నుండి 13 వరకు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు టీజీఎస్ఆర్టీసీ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. మరిన్ని వివరాల కోసం, ప్రయాణికులు 9959226149 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించవచ్చు.

ప్రత్యేక రైళ్లు

దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతి పండుగ దృష్ట్యా తాజాగా 11 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. జనవరి 7వ తేదీ నుంచి 12వ తేదీ మధ్యలో ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. సంక్రాంతి ఏపీకి వెళ్లి తిరిగి రావాలి అనుకునేవారికి ఈ ట్రైన్లు ఎంతగానో ఉపయోగకరంగా ఉండనున్నాయి. కాకినాడ-వికారాబాద్, వికారాబాద్-పార్వతీపురం, పార్వతీపురం-వికారాబాద్, పార్వతీపురం-కాకినాడ టౌన్, సికింద్రాబాద్-పార్వతీపురం, కాకినాడ టౌన్-వికారాబాద్ మధ్య ఈ రైళ్లు నడుస్తాయని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది.

ఈ ప్రత్యేక రైళ్లలో 1ఏసీ, 2ఏసీ, 3ఏసీ, స్లీపర్‌ కోచ్‌లతో పాటు సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లు కూడా ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఆంధ్రా-తెలంగాణ మధ్య జనవరి 7వ తేదీ నుంచి జనవరి 12వ తేదీ మధ్య ప్రయాణించేవారు.. బుకింగ్స్ చేసుకోవచ్చు, ప్రారంభమయ్యాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More