ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌లోని స్కైరూట్ ఏరోస్పేస్ ఇన్ఫినిటీ క్యాంపస్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టగల సామర్థ్యం గల భారతదేశ మొట్టమొదటి ప్రైవేట్ కమర్శియల్ లాంచ్ వెహికల్ విక్రమ్-1ని ఆవిష్కరించారు. స్కైరూట్ ఏరోస్పేస్ ఇన్ఫినిటీ క్యాంపస్ దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ ఫ్యాక్టరీ. 200,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇది నెలకు ఒక ఆర్బిటల్ రాకెట్‌ను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంటుంది. అనేక ప్రయోగ వాహనాల ఎండ్-టు-ఎండ్ అభివృద్ధి, ఏకీకరణ, పరీక్ష కోసం దీనిని రూపొందించారు.

క్యాంపస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న ప్రధాని మోదీ ప్రసంగించారు. దశాబ్దాలుగా భారతదేశ అంతరిక్ష ప్రయాణానికి శక్తినిచ్చినందుకు ఇస్రోను ప్రశంసించారు. దాని విశ్వసనీయత, సామర్థ్యం, ప్రత్యేకమైన ప్రయోగాలు ప్రపంచంలో గుర్తింపు తెచ్చాయని కొనియాడారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న అంతరిక్ష రంగంలో అపూర్వమైన అవకాశాలను ప్రస్తావించారు. యువత ఆవిష్కరణలు, రిస్క్ తీసుకోవడం, కొత్త శిఖరాలకు చేరుకుంటున్నారన్నారు.
'నేడు దేశం అంతరిక్ష రంగంలో అపూర్వమైన అవకాశాన్ని చూస్తోంది. నేడు భారతదేశ అంతరిక్ష వ్యవస్థలో ప్రైవేట్ రంగం ఒక పెద్ద ముందడుగు వేస్తోంది. స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ భారతదేశం కొత్త ఆలోచన. ముఖ్యంగా యువ శక్తికి ప్రతిబింబం. మన యువత ఆవిష్కరణ, రిస్క్ తీసుకునే సామర్థ్యం, నేడు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి.' అని ప్రధాని మోదీ అన్నారు.
భారతదేశ పురోగతి సంపద ద్వారా కాదని, సంకల్ప శక్తి ద్వారా నడిచిందని గుర్తు చేశారు. సైకిల్ మీద రాకెట్ మోసుకెళ్లే పరిస్థితి నుంచి మన ప్రస్థానం మెుదలైందని మోదీ గుర్తు చేశారు. వ్యవసాయం, వాతావరణ అంచనాల్లో మరింత విజ్ఞానం సాధించాలన్నారు. స్పేస్ సెక్టార్‌లో కో ఆపరేటివ్, ఎకో సిస్టమ్ తీసుకువచ్చామన్నారు. జన్‌జీ అనుకున్నది సాధించేలా ప్రభుత్వం సహకరిస్తుందని ఈ సందర్భంగా మోదీ హామీ ఇచ్చారు. ప్రైవేట్ రంగంలో అంతరిక్ష సంస్థలు పుట్టుకొస్తున్నాయని జన్‌జీ ఇంజినీర్లు, డిజెనర్లు, కోడర్స్, సైంటిస్టులు అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు.
విక్రమ్-I అనేది ఒక సాంకేతిక అద్భుతం, ఇది దాదాపు 300 కిలోల పేలోడ్లను లో ఎర్త్ ఆర్బిట్ (LEO)కి మోసుకెళ్లేలా రూపొందించారు. ఇది పూర్తిగా కార్బన్-ఫైబర్ బాడీని కలిగి ఉంది. ఈ విక్రమ్స్ సిరీస్ కు ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ వ్యవస్థాపకుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ పేరు పెట్టారు. విక్రమ్-I అత్యంత ముఖ్యమైన లక్షణాలలో ఒకటి ఒకేసారి ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టగల సామర్థ్యం.
{{/usCountry}}విక్రమ్-I అనేది ఒక సాంకేతిక అద్భుతం, ఇది దాదాపు 300 కిలోల పేలోడ్లను లో ఎర్త్ ఆర్బిట్ (LEO)కి మోసుకెళ్లేలా రూపొందించారు. ఇది పూర్తిగా కార్బన్-ఫైబర్ బాడీని కలిగి ఉంది. ఈ విక్రమ్స్ సిరీస్ కు ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ వ్యవస్థాపకుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ పేరు పెట్టారు. విక్రమ్-I అత్యంత ముఖ్యమైన లక్షణాలలో ఒకటి ఒకేసారి ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టగల సామర్థ్యం.
{{/usCountry}}