యాదగిరిగుట్ట భక్తులకు శుభవార్త - తులాభారం సేవలు పునఃప్రారంభం, ఈ తేదీలో కోటి పుష్పార్చన

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నేటి నుంచి తులాభారం, తోమాలసేవలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. భక్తులు తమ కోరికల మేరకు నగదు లేదా వివిధ రకాల సరకులతో తులాభారం తూగి స్వామివారికి మొక్కులు తీర్చుకోవచ్చు.

Published on: Nov 12, 2026, 10:51:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో భక్తుల కోరిక మేరకు కీలక ఆర్జిత సేవలు మళ్లీ అందుబాటులోకి రానున్నాయి. ఆలయంలో తులాభారం, తోమాలసేవలను గురువారం(నేటి) నుంచి పునఃప్రారంభిస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) భవానీశంకర్ వెల్లడించారు. గతంలో ప్రవేశపెట్టి నిలిపివేసిన ఈ సంప్రదాయ సేవలను భక్తుల సౌకర్యార్థం తిరిగి మొదలుపెడుతున్నట్లు ఆయన తెలిపారు.

యాదగిరిగుట్ట ఆలయం
యాదగిరిగుట్ట ఆలయం

తోమాలసేవ, తులాభారం వివరాలివే….

తోమాలసేవలో పాల్గొనదలచిన భక్తులు రూ. 1,250 చెల్లించి టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఉదయం సహస్రనామార్చన పూర్తయిన వెంటనే టికెట్ పొందిన దంపతులను గర్భాలయంలోకి అనుమతించి తోమాలసేవలో పాల్గొనే అవకాశం కల్పిస్తారు.సేవ అనంతరం స్వామివారి ప్రసాదంగా అభిషేకం లడ్డూతో పాటు ఉత్తరీయాన్ని ఆలయ అధికారులు అందజేస్తారు.

ఇక మొక్కులు తీర్చుకునే భక్తుల కోసం తులాభారం సేవను కూడా అందుబాటులోకి తెచ్చారు. భక్తులు తమ బరువుకు సమానంగా నగదు లేదా వివిధ రకాల సరకులను సమర్పించి తులాభారం మొక్కును చెల్లించుకోవచ్చని ఈవో భవానీశంకర్ వివరించారు.

కార్తీక ఏకాదశి వేళ కోటి పుష్పార్చన :

మరోవైపు…. ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రాష్ట్రం పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ దేవస్థానం ప్రత్యేక వైదిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పవిత్ర కార్తీక మాసంలోని ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నవంబర్ 20వ తేదీ శుక్రవారం నాడు శ్రీ లక్ష్మీనరసింహస్వామి నామార్చన సహిత 'కోటి పుష్పార్చన' నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అత్యంత వైభవంగా ఈ పూజా క్రతువు కొనసాగుతుంది.

కార్తీక మాస ఉత్సవాల్లో భాగంగా యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో నవంబర్ 20 నుంచి 22 వరకు మూడు రోజుల పాటు ప్రముఖులతో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.

  • నవంబర్ 20 : ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ ఆధ్యాత్మిక ప్రవచనం చేస్తారు. అనంతరం తేలు విజయ భక్తి సంగీత కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
  • నవంబర్ 21: ప్రముఖ సంగీత దర్శకులు ఆర్.పి. పట్నాయక్ ఆధ్వర్యంలో ప్రత్యేక సంగీత విభావరి ప్రేక్షకులను అలరించనుంది.
  • నవంబర్ 22 : పరంపర సంస్థ ఆధ్వర్యంలో అభినేత్రి బృందం సభ్యులు తెలంగాణ దేవాలయాల విశిష్టతను చాటిచెప్పే ఇతివృత్తంతో ప్రత్యేక నృత్య ప్రదర్శన ఇవ్వనున్నారు.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More