హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నీటి కొరత తీవ్ర సమస్యగా మారుతోంది. రోజువారీ అవసరాలకు నీరు దొరకక వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మాధాపూర్, అమీర్‌పేట్, గచ్చిబౌలి, కొండాపూర్, మణికొండ ప్రాంతాల్లోని పేయింగ్ గెస్ట్ (PG) హాస్టళ్లు, కో-లివింగ్ స్పేస్‌లలో నీటి సంక్షోభం ఎదురవుతోంది. అయ్యప్ప సొసైటీలాంటి పీజీలు ఎక్కువగా ఉండే ప్రాంతంలోనూ ఈ సమస్య ఉంది.

నీటి సమస్య తీవ్రతను వివరిస్తూ విద్యార్థులు, ఉద్యోగులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. భూగర్భ జలాలు గణనీయంగా పడిపోవడం, బోర్లు పూర్తిగా ఎండిపోవడంతో హాస్టల్ నిర్వాహకులు నీటి ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు. అయితే ట్యాంకర్ల కొరత వల్ల సరిపడా నీరు అందడం లేదు. మరోవైపు కొంతమంది పీజీల్లో ఉన్నవారు వాష్ రూమ్‌లను ఉపయోగించుకునేందుకు సమీపంలోని మెట్రో స్టేషన్లకు వెళ్లాల్సిన పరిస్థితి కూడా వస్తోంది. స్నానాలు చేయకుండానే ఆఫీసులకు వెళ్తున్నామంటూ కొందరు ఉద్యోగులు వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.
ఉదయాన్నే నీళ్లు రాకపోవడంతో ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు స్నానాలు కూడా చేయకుండా ఆఫీసులకు, కళాశాలలకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాధాపూర్, అమీర్‌పేట్ వంటి ప్రాంతాల్లో నీటి కొరత భరించలేక పలు హాస్టల్ నిర్వాహకులు కొద్దిరోజుల పాటు సేవలు నిలిపివేసే ఆలోచనలో పడ్డారు. దీంతో ఉండేందుకు వసతి లేక విద్యార్థులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ తమ సొంత ఊళ్లకు లేదా ప్రత్యామ్నాయ ప్రాంతాలను చూసుకుంటున్నారు. హైదరాబాద్ వాటర్ బోర్డుకు రోజువారీ ట్యాంకర్ బుకింగ్‌ల సంఖ్య రికార్డు స్థాయికి చేరుతోంది.
హాస్టళ్లలో ఖాళీ బకెట్లతో నీళ్ల కోసం వేచి చూస్తున్న దృశ్యాలు, నీటి ట్యాంకర్ల వద్ద జనాలు గుమిగూడిన వీడియోలు ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లలో తెగ హల్చల్ చేస్తున్నాయి. 'హైదరాబాద్ ఐటీ హబ్‌లో డెవలప్మెంట్ బాగుంది కానీ కనీస అవసరమైన నీళ్లు లేవు.' అంటూ నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ విద్యార్థినిని నాలుగు గంటలకుగా తమ పీజీలో నీరు లేవని చెప్పిన వీడియో బాగా వైరల్ అయింది. చలికాలంలోనే ఇలా ఉంటే.. ఇక వేసవిలో పరిస్థితి ఎలా ఉంటుందోనని విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసింది. నీటిని వృథా చేయకండి అంటూ విద్యార్థిని పేర్కొంది.
{{/usCountry}}హాస్టళ్లలో ఖాళీ బకెట్లతో నీళ్ల కోసం వేచి చూస్తున్న దృశ్యాలు, నీటి ట్యాంకర్ల వద్ద జనాలు గుమిగూడిన వీడియోలు ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లలో తెగ హల్చల్ చేస్తున్నాయి. 'హైదరాబాద్ ఐటీ హబ్‌లో డెవలప్మెంట్ బాగుంది కానీ కనీస అవసరమైన నీళ్లు లేవు.' అంటూ నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ విద్యార్థినిని నాలుగు గంటలకుగా తమ పీజీలో నీరు లేవని చెప్పిన వీడియో బాగా వైరల్ అయింది. చలికాలంలోనే ఇలా ఉంటే.. ఇక వేసవిలో పరిస్థితి ఎలా ఉంటుందోనని విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసింది. నీటిని వృథా చేయకండి అంటూ విద్యార్థిని పేర్కొంది.
{{/usCountry}}నగరంలో పెరుగుతున్న నీటి అవసరాలు, ట్యాంకర్ల సమస్యను పరిష్కరించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) చర్యలు వేగవంతం చేసింది. తాగునీటి ఎద్దడిని తగ్గించేందుకు క్యూరింగ్, కార్ వాషింగ్, మొక్కలకు నీళ్లు పోయడం వంటి ఇతర అవసరాలకు శుద్ధి చేసిన మురుగునీటిని ఉపయోగించాలని అధికారులు నిర్ణయించారు. మరోవైపు నగరంలో వాటర్ సప్లై నిలిచిపోతుందంటూ సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దని, అధికారిక సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని జలమండలి ప్రజలను కోరింది.
ప్రజలు ప్రతి బొట్టు నీటిని పొదుపుగా వాడుకోవాలి. తాగడానికి మాత్రమే మంచి నీటిని వాడి, ఇతర అవసరాలకు రీసైకిల్ చేసిన నీటిని వినియోగించడం మంచిది.