మావోయిస్టు పార్టీ ఛీఫ్‌గా చాలాకాలం బాధ్యతలు నిర్వర్తించిన గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ రావు ఆచూకీ తెలిసింది. చాలా ఏళ్లుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దశాబ్దాలపాటు మావోయిస్టు పార్టీని గణపతి నడిపించారు. కొన్నేళ్లుగా నేపాల్‌లో ఉంటున్నారు. తీవ్ర అనారోగ్యంతో గణపతి బాధపడుతున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా నడవలేని స్థితిలో ఉన్నారు.

గణపతిని ఇండియాకు రప్పించేందుకు తెలంగాణ పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గణపతి కూడా లొంగిపోతే దాదాపు మావోయిస్ట్ పార్టీ శకం ముగిసినట్టేనని అధికారులు భావిస్తున్నారు. తెలంగాణ నుంచి ఉన్న మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలోకి వచ్చేశారు.
2004లో మావోయిస్టు ప్రధాన కార్యదర్శి అయ్యారు గణపతి. నవంబర్ 10, 2018 వరకు ఆ పదవిలో కొనసాగారు. మావోయిస్టు కేంద్ర కమిటీ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం.. అనారోగ్యం, వృద్ధాప్యం కారణంగా గణపతి తన పదవి నుంచి స్వచ్ఛందంగా వైదొలిగారు. ఈ మేరకు గణపతిని తన బాధ్యతల నుంచి తప్పించాలన్న సిఫార్సును కేంద్ర కమిటీ ఆమోదించింది. ఆ సమయంలో ఫిలిప్పీన్స్‌లో చికిత్స తీసుకున్నట్టు సమాచారం. గణపతిపై సుమారు రూ. 2.52 కోట్ల వరకు రివార్డు ఉంది. ఆ తర్వాత ఆయన స్థానంలో నంబాల కేశవ్ రావు అలియాస్ బసవరాజ్ పార్టీ ఛీఫ్‌గా నియమితులయ్యారు.
ఇటీవల ఆసిఫాబాద్ అడవుల్లో దేవ్ జీతోపాటు మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు, నున్నె నరసింహారెడ్డి కూడా లొంగిపోయారు. తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోతున్నట్టుగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. పలువురు అగ్రనేతలు మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్ తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టలకు వస్తున్నారని నిఘా వర్గాలకు సమాచారవం వచ్చింది. దీంతో ఆపరేషన్ కగార్ 2 చేపట్టారు. కర్రెగుట్టల్లో పలువురు నక్సలైట్లు చనిపోయారు.
2026 మార్చి 31వ తేదీ నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్రం టార్గెట్ పెట్టుకుంది. ఆ దిశగానే మెుదటి నుంచి ఆపరేషన్ కగార్ విషయంలో అగ్రెసివ్‌గా ముందుకు వెళ్తుంది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో భద్రతా బలగాలు నిరంతరం కూంబింగ్ చేస్తున్నాయి. మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి బసవరాజ్‌ను ఎన్కౌంటర్లో చనిపోయారు. ఆ తర్వాత దేవ్‌జీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ప్రస్తుతం లొంగిపోయారు.
{{/usCountry}}2026 మార్చి 31వ తేదీ నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్రం టార్గెట్ పెట్టుకుంది. ఆ దిశగానే మెుదటి నుంచి ఆపరేషన్ కగార్ విషయంలో అగ్రెసివ్‌గా ముందుకు వెళ్తుంది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో భద్రతా బలగాలు నిరంతరం కూంబింగ్ చేస్తున్నాయి. మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి బసవరాజ్‌ను ఎన్కౌంటర్లో చనిపోయారు. ఆ తర్వాత దేవ్‌జీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ప్రస్తుతం లొంగిపోయారు.
{{/usCountry}}