హైదరాబాద్ మహానగరంలో రాబోయే రోజుల్లో తాగునీటి కొరత తలెత్తకుండా జలమండలి పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. అంతర్జాతీయంగా ఎల్‌నినో పరిస్థితులు నెలకొనడం…. దానికి తోడు నగరానికి ప్రధాన తాగునీటి ఆధారాలైన సింగూరు, మంజీరా జలవనరుల్లో నీటి నిల్వలు క్రమంగా తగ్గుతుండటంతో అధికారులు ముందస్తు చర్యలను వేగవంతం చేశారు.

ఇందులో భాగంగా రోజుకు 40 మిలియన్ గ్యాలన్ల (ఎంజీడీ) అదనపు గోదావరి జలాలను హైదరాబాద్‌కు తరలించనుంది. ఇప్పటికే పైప్ లైన్ అనుసంధాన పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ నవంబర్ 15వ తేదీ నాటికి పైప్‌లైన్ అనుసంధాన పనులను పూర్తి చేసి గోదావరి జలాలను నగరానికి రప్పించాలని అధికారులు నిర్ణయించారు.
రెండు వైపులా వేగంగా పనులు…..
పైప్‌లైన్ నిర్మాణాన్ని ఒకే వైపు నుంచి కాకుండా రెండు వైపుల నుంచి సమాంతరంగా చేపట్టి, అనుసంధాన ప్రక్రియను వేగంగా చేస్తున్నారు. బిల్లుల చెల్లింపులు, ఆర్థిక సర్దుబాట్లను పక్కనపెట్టి మరీ…. ప్రస్తుతం మంచినీటి ప్రాజెక్ట్ పూర్తికే అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని తాజా జలమండలి ఎండీ ఆదేశించారు.
పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడానికి రోజుకు 8 గంటల చొప్పున మూడు షిఫ్టులలో ప్రత్యేక కార్మిక బృందాలను రంగంలోకి దించాలని ఆదేశించారు. ప్రతి షిఫ్టుకూ వేర్వేరు బృందాలను నియమించి రాత్రింబవళ్లు పనులు కొనసాగేలా చూడాలన్నారు. రాత్రి వేళల్లో పనులకు ఆటంకం కలగకుండా భారీ ఫ్లడ్‌లైట్లు, అవసరమైన యంత్ర సామాగ్రి, ఇతర సాంకేతిక సౌకర్యాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు.
రోడ్డు క్రాసింగ్ పనులపై ప్రత్యేక దృష్టి….
పైప్‌లైన్ అనుసంధానంలో అత్యంత కీలకమైన రోడ్డు క్రాసింగ్ పనులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అవసరమైన రవాణా, పోలీసు అనుమతులు, భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసుకోవటంతో పాటు…. రాత్రి నుంచే రోడ్డు కటింగ్ పనులు ప్రారంభించనున్నారు. రెండు మూడు రోజుల్లోనే పైపుల అమరికకు మార్గం సుగమం అయ్యేలా మరో రెండు మూడు అదనపు ప్రత్యేక కార్మిక బృందాలను ఈ పనుల కోసం కేటాయించనున్నారు.
{{/usCountry}}పైప్‌లైన్ అనుసంధానంలో అత్యంత కీలకమైన రోడ్డు క్రాసింగ్ పనులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అవసరమైన రవాణా, పోలీసు అనుమతులు, భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసుకోవటంతో పాటు…. రాత్రి నుంచే రోడ్డు కటింగ్ పనులు ప్రారంభించనున్నారు. రెండు మూడు రోజుల్లోనే పైపుల అమరికకు మార్గం సుగమం అయ్యేలా మరో రెండు మూడు అదనపు ప్రత్యేక కార్మిక బృందాలను ఈ పనుల కోసం కేటాయించనున్నారు.
{{/usCountry}}గోదావరి జలాల తరలింపులో ఎలాంటి అడ్డంకులు రాకుండా మిషన్ భగీరథ, అటవీ శాఖ అధికారులతో జలమండలి అధికారులు నిరంతరం సమన్వయం చేసుకోనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఇతర గోదావరి ప్రాజెక్టు పనుల్లో ఉన్న ఇంజినీరింగ్ నిపుణులు, కార్మిక బృందాలు, ఎక్స్‌కవేటర్లు, డ్రిల్లింగ్ యంత్రాలు, ఇతర భారీ వాహనాలను తక్షణమే ఘన్‌పూర్ పనులకు మళ్లించనున్నారు.
వేసవికి ముందే పక్కా ప్రణాళిక….
ముందుముందు వేసవి కాలంలో నగరంలో నీటి వినియోగం గణనీయంగా పెరుగుతుందని, దానికి తగినట్లుగా అందుబాటులో ఉన్న ప్రతి నీటి వనరునూ సమర్థవంతంగా వాడుకోవాలని జల మండలి ఎండీ అశోక్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యంగా మంజీరా, సింగూరు ప్రాజెక్టులపై ఆధారపడిన నగర ప్రాంతాలకు ప్రత్యామ్నాయంగా గోదావరి జలాలను అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యమని తెలిపారు.
పైప్‌లైన్ పనుల పురోగతిని ప్రతిరోజూ అధికారులు స్వయంగా పర్యవేక్షించాలని, సాంకేతిక సమస్యలు వస్తే అక్కడికక్కడే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ ప్రాజెక్టు సకాలంలో పూర్తవ్వడం జలమండలి ప్రతిష్ఠకు సంబంధించిన అంశమని, కాంట్రాక్టర్లు, అధికారులు పూర్తి బాధ్యతాయుతంగా పనిచేసి నవంబర్ 15 కల్లా రోజుకు 40 ఎంజీడీల అదనపు గోదావరి నీటి సరఫరాకు మార్గం సుగమం చేయాలని స్పష్టం చేశారు.