...
...
Next Story

Andhra Pradesh AQI : దీపావళి ఎఫెక్ట్... ఏపీలోని 17 నగరాల్లో పడిపోయిన గాలి నాణ్యత! విశాఖలో మరింతగా...

Andhra Pradesh Air Quality Index : దీపావళి వేడుకల అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోని 17 నగరాల్లో గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించింది. విశాఖపట్నం, రాజమహేంద్రవరంలో వాయు కాలుష్యం 'పేలవమైన' స్థాయికి చేరిందని ఏపీపీసీబీ వెల్లడించింది.

Published on: Nov 10, 2026, 05:12:30 IST
Advertisement

దీపావళి సంబరాల వేళ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా వాయు కాలుష్యం ఒక్కసారిగా పెరిగింది. పరిధిలోని 17 నగరాల్లో గాలి నాణ్యత గణనీయంగా క్షీణించిందని పర్యావరణ నియంత్రణ మండలి గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా పారిశ్రామిక నగరమైన విశాఖపట్నంతో పాటు రాజమహేంద్రవరం నగరాల్లో గాలి నాణ్యత సూచీ (AQI) తీవ్ర ఆందోళనకర స్థాయికి పడిపోయి 'పూర్' (పేలవమైన) కేటగిరీకి చేరింది.

విశాఖలో పెరుగుతున్న కాలుష్యం…..

దిపావళి తర్వాత తీవ్రమైన వాయు కాలుష్యం (Image Source Pixel)
దిపావళి తర్వాత తీవ్రమైన వాయు కాలుష్యం (Image Source Pixel)

సోమవారం విడుదల చేసిన ఎయిర్ క్వాలిటీ బులిటెన్ ప్రకారం….. రాష్ట్రంలోనే అత్యధికంగా విశాఖపట్నంలో 264 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) నమోదైంది. అంతకుముందు రోజు ఇక్కడ ఏక్యూఐ 229గా ఉండగా, ఒక్క రోజులోనే మరింత పెరిగింది. ఇక రాజమహేంద్రవరంలో గాలి నాణ్యత అత్యంత వేగంగా పడిపోయింది. అంతకుముందు రోజు 104గా ఉన్న ఏక్యూఐ ఏకంగా 220కి చేరి, 'మోడరేట్' (మధ్యస్థం) స్థాయి నుంచి నేరుగా 'పూర్' కేటగిరీకి పడిపోయింది.

ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (APPCB) చైర్మన్ పి. కృష్ణయ్య అందించిన వివరాల ప్రకారం…... రాష్ట్రంలోని మిగిలిన 15 నగరాలు ప్రస్తుతం 'మోడరేట్' కేటగిరీలో ఉన్నాయి. ఇక్కడ ఏక్యూఐ నమోదు 101 నుంచి 200 మధ్యలో ఉంది. అంతకుముందు ఆదివారం రోజున రాష్ట్రంలోని 12 నగరాల్లో గాలి నాణ్యత 'సంతోషదాయకమైన' (సాటిస్‌ఫ్యాక్టరీ) స్థాయిలో ఉండగా, కేవలం విశాఖపట్నం ఒక్కటే 'పూర్' కేటగిరీలో ఉండేదని ఆయన గుర్తుచేశారు.

'మోడరేట్' కేటగిరీలో ఉన్న నగరాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి 191 ఏక్యూఐ నమోదుతో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో నెల్లూరు (175), శ్రీకాకుళం (170) ఉన్నాయి. ఏలూరులో అత్యల్పంగా 118 ఏక్యూఐ నమోదైంది. మరోవైపు, ఆదివారం వరకు 'సాటిస్‌ఫ్యాక్టరీ' కేటగిరీలో ఉన్న రాజధాని ప్రాంతం అమరావతి, విజయవాడ, గుంటూరు, అనంతపూర్ నగరాల్లో కూడా దీపావళి తర్వాత గాలి నాణ్యత క్షీణించి 'మోడరేట్' స్థాయికి చేరింది.

ఏక్యూఐ వర్గీకరణ ప్రకారం.. గాలి నాణ్యత సూచీ 101 నుంచి 200 (మోడరేట్) మధ్య ఉంటే ఊపిరితిత్తుల వ్యాధులు, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అదే ఏక్యూఐ 201 నుంచి 300 (పూర్) మధ్య ఉంటే, ఎక్కువ సేపు ఆ గాలిలో గడిపే సాధారణ ప్రజలకు కూడా శ్వాసకోశ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks