...
...
Next Story

AP Cabinet Decisions : వర్చువల్‌గా ఏపీ కేబినెట్ భేటీ - భారీ పెట్టుబడులకు గ్రీన్‌సిగ్నల్, ఈ కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర

సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్… రూ.36 వేల కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతి పనులు, రుషికొండ ప్యాలెస్, విద్యుత్ ప్రాజెక్టులపై కీలక నిర్ణయాలు తీసుకుంది.

Published on: Nov 27, 2026, 16:50:50 IST
Advertisement

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం హైబ్రిడ్ విధానంలో జరిగింది. పలువురు మంత్రులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్‌గా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

భారీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్….

ఏపీ కేబినెట్ భేటీ
ఏపీ కేబినెట్ భేటీ

విశాఖ వేదికగా జరిగిన సీఐఐ సదస్సులో ఒప్పందాలు కుదుర్చుకున్న 6 సంస్థల పెట్టుబడి ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సంస్థల ద్వారా రాష్ట్రానికి రూ. 36 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఫలితంగా వేలమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

పెనుగొండలో రూ. 19 వేల కోట్లతో కియా రెండో ఆటోమొబైల్ ప్లాంట్ ఏర్పాటు, శ్రీకాకుళంలో అదానీ ఇంటిగ్రేటెడ్ టైటానియం కాంప్లెక్స్ ఏర్పాటు ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. 'ఏపీ ఎంఎస్‌ఎంఈ రైట్ టు బిజినెస్ బిల్లు-2026'కు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

రాజధాని అమరావతి పనులకు మంత్రివర్గం మరికొన్ని నిధులు కేటాయించింది. హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయ నిర్మాణ పనులకు నిధుల కేటాయింపుతో పాటు కీలక నిర్ణయాలు తీసుకుంది.

  • అమరావతిలో సమీకృత సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల నిర్మాణ వ్యయాన్ని రూ. 6,641 కోట్లకు పెంచుతూ ఆమోదం తెలిపింది.
  • అమరావతి పరిధిలోని గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి రూ. 1,215 కోట్ల పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
  • శాఖమూరులో అమరావతి సంగమం నిర్మాణానికి రూ. 626 కోట్ల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.
  • రాజధానిలో గ్రీన్ వర్క్స్ ప్యాకేజీ-2 కింద రూ. 180.68 కోట్ల అభివృద్ధి పనులకు ఆమోదం ఇచ్చింది.
  • రుషికొండ ప్యాలెస్‌ను నాలుగు నెలల పాటు ప్రజల సందర్శన కోసం తెరవాలని కేబినెట్ నిర్ణయించినట్లు తెలిసింది. ఆ తర్వాత పీపీపీ పద్ధతిలో ఆతిథ్య రంగానికి అప్పగించాలని తీర్మానించినట్లు సమాచారం.
  • విద్యుత్ అవసరాల కోసం కోల్ ఇండియాతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసేందుకు ఏపీజెన్‌కోకు అనుమతి ఇచ్చింది.
  • మైలవరంలో 1,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టు కోసం 1,127 ఎకరాల భూమి కేటాయించింది.
  • ప్రకాశం జిల్లాలో రోజుకు 12 టన్నుల సామర్థ్యంతో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
  • శ్రీకాకుళంలో రూ.13,667 కోట్లతో అదానీ ఇంటిగ్రేటెడ్ టైటానియం కాంప్లెక్స్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

 

ABOUT THE AUTHOR

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks