...
...
Next Story

AP EAPCET Results 2026 : ఈ నెలాఖరున ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు...! తాజా అప్డేట్స్

AP EAPCET Results 2026 : ఏపీ ఈఏపీసెట్ - 2026 ఫలితాలను జూన్ 30న విడుదల చేసేందుకు ఉన్నత విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. సీబీఎస్‌ఈ విద్యార్థులు తమ డిక్లరేషన్ ఫారాలను జూన్ 27 సాయంత్రం లోగా సమర్పించాల్సి ఉంటుంది.

Published on: Jun 26, 2026, 15:04:26 IST
Advertisement

AP EAPCET Results 2026 : ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET) ఫలితాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చింది. ఈఏపీసెట్-2026 ఫలితాలను జూన్ 30వ తేదీన విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. ఆ దిశగా రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ అన్ని రకాల కసరత్తు చేస్తోంది.

ఆలస్యానికి అసలు కారణం ఇదే!

ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు 2026 (istock image)
ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు 2026 (istock image)

నిజానికి మొదట ప్రకటించిన అధికారిక షెడ్యూల్ ప్రకారం జూన్ 1వ తేదీనే ఈఏపీసెట్ ఫలితాలను విడుదల చేయాల్సి ఉంది. అయితే….. ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించడం, వాటి ఫలితాల వెల్లడిలో సమయం పట్టడంతో ఫలితాలు విడుదలకు లైన్ క్లియర్ కాలేదు. ఇటీవలనే ఈ ఫలితాలు విడుదలయ్యాయి.

మరోవైపు సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాల ప్రక్రియ పూర్తికాకపోవడం మరో ప్రధాన కారణంగా ఉంది. ఈఏపీసెట్ తుది ర్యాంకుల కేటాయింపులో ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉంటుంది. దీనివల్ల ఇంటర్ మార్కుల నమోదు ప్రక్రియ పూర్తయితేనే ర్యాంకులను ఖరారు చేయడం సాధ్యమవుతుంది. ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు ఇప్పటికే విడుదల కాగా….. ఇప్పుడు సీబీఎస్‌ఈ మార్కుల ప్రక్రియ తుది దశకు చేరింది.

ఇంటర్ మార్కుల వెయిటేజీకి ఎంతో ప్రాధాన్యం ఉన్న నేపథ్యంలో ఈఏపీసెట్ కన్వీనర్ సీబీఎస్‌ఈ విద్యార్థులకు ఒక ముఖ్యమైన అలర్ట్ జారీ చేశారు. సీబీఎస్‌ఈ 12వ తరగతి రీవెరిఫికేషన్, రీవాల్యుయేషన్‌లలో మార్కులు పెరిగిన విద్యార్థులు ఎవరైనా ఉంటే….. వారు తమకు మారిన మార్కులతో కూడిన డిక్లరేషన్ ఫామ్‌ను జూన్ 27వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ఈ గడువు ముగిసిన తర్వాత సీబీఎస్‌ఈ అభ్యర్థుల మార్కుల డేటాను క్రోడీకరించి, తుది ఫలితాలను సిద్ధం చేయడానికి అధికారులకు మరో రెండు రోజుల సమయం పడుతుంది.

ఏపీ ఈఏపీసెట్ ఫలితాలను https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ లేదా మనమిత్ర వాట్సాప్(9552300009) ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ఏపీ ఈఏపీసెట్ 2026 లో విద్యార్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. ర్యాంకుల విడుదల తర్వాత….. సీట్ల భర్తీ కోసం ఉన్నత విద్యా మండలి కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ప్రకటిస్తుంది. విడతల వారీగా నిర్వహించే కౌన్సెలింగ్ ద్వారానే సీట్ల ప్రక్రయను పూర్తి చేస్తారు. సీట్లు మిగిలితే స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు జారీ అవుతాయి.

ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,55,803 మంది విద్యార్థులు ఏపీ ఈఏపీసెట్ - 2026కు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 3,29,474 మంది ఈఏపీసెట్ పరీక్షలు రాశారు. అంటే మొత్తం 92.60 శాతం హాజరు నమోదైంది.

  • ఇంజినీరింగ్, ఫార్మసీ (ఎంపీసీ స్ట్రీమ్) : ఈ విభాగానికి అత్యధికంగా 2,76,576 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, వారిలో 2,58,545 మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ విభాగంలో అత్యధికంగా 93.48 శాతం హాజరు నమోదైంది.
  • వ్యవసాయ, ఫార్మసీ (బైపీసీస్ట్రీమ్) : అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు సంబంధించి మొత్తం 79,227 మంది దరఖాస్తు చేసుకోగా.. 70,929 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ స్ట్రీమ్‌లో 89.53 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe