2025 ఏడాది ముగిసి.. మరో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టేందుకు మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. అయితే ఈ ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆంధ్రుల రాజధాని అమరావతి నిర్మాణ కోసం పనులు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది. మరోవైపు పెట్టుబడులను కూడా ఆకర్షించే పనిలో ఉండగా… ఈ ఏడాది కొన్ని విషాధ ఘటనలు కూడా జరిగాయి. ముఖ్యమైన కొన్ని ఘటాలపై ఓ లుక్కేయండి….
- మూడేళ్లలో రాజధాని పనులను పూర్తి చేస్తామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఈ ఏడాది కీలకమైన పనులకు శ్రీకారం చుట్టారు. ఇటీవలనే హైకోర్టు నిర్మాణ పనులను ప్రారంభించారు.
- తిరుపతి ఆలయం వద్ద తొక్కిసలాట, సింహాచలం ఆలయం వద్ద గోడ కూలిపోవడం, కాశిబుగ్గ పుణ్యక్షేత్రంలో రెయిలింగ్ ఇవ్వడం వంటి మూడు ప్రధాన ఆలయ ఘటనలు విషాదం ముగిల్చాయి. ఈ విషాదాల్లో మొత్తం 23 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 100 మంది గాయపడ్డారు.
- అక్టోబర్ నెలలో కర్నూల్ వద్ద ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురైంది. మంటలు చెలరేగి 19 మంది ప్రయాణికులు మృతి చెందారు.
- మొంథా తుఫాన్ దాటికి కనీసం రూ .5,233 కోట్ల నష్టాన్ని కలిగించింది.
- నవంబర్ లో మారేడుమిల్లి సమీపంలో జరిగిన రెండు వరుస ఎన్ కౌంటర్లలో అగ్రశ్రేణి నక్సలైట్ మాద్వి హిడ్మాతో సహా 13 మంది మావోయిస్టులు మరణించారు.
- అమరావతి రాజధాని నిర్మాణం కోసం మరో విడత భూసేకరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
- రాష్ట్రంలో మరో 2 కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. డిసెంబర్ 31వ తేదీతో ఈ జిల్లాలు అమల్లోకి వచ్చాయి. వీటితో రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య 28కి చేరింది.
- విశాఖపట్నంలో 15 బిలియన్ డాలర్ల ఏఐ గూగుల్ డేటా సెంటర్ పెట్టుబడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ సందర్భంగా వచ్చిన రూ .13 లక్షల కోట్లకు పెట్టుబడులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా పట్టాలెక్కాల్సి ఉంది.
- తల్లికి వందనం (పాఠశాలకు వెళ్లే పిల్లవాడికి రూ .15,000) మరియు అన్నదాత సుఖీభవ (అర్హులైన రైతులకు సంవత్సరానికి రూ .20,000) స్కీమ్ పట్టాలెక్కింది.
- 10 ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ తీవ్రంగా పోరాటం చేస్తోంది. కోటి మందికి పైగా సంతకాలను సేకరించి… గవర్నర్ కు కూడా కాపీని అందజేస్తోంది.
- ఏపీ డీఎస్సీని పూర్తి చేయటం ద్వారా కొత్త టీచర్లు విధుల్లో చేరారు.
- మహిళకు ఉచిత బస్సు స్కీమ్ ప్రారంభమైంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఈ స్కీమ్ అమల్లో ఉంది.
- అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ సాగర తీరంలో సుమారు 3 లక్షల మంది యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
- ఇక అమరావతి దార్శనికతను సాకారం చేయడానికి టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే పాలనకు 2026 సంవత్సరం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే రాజధాని నగర నిర్మాణ పనులను పూర్తి చేయడానికి ఒక నిర్దిష్ట కాలపరిమితితో ముందుకు సాగుతున్నట్లు ప్రభుత్వం నొక్కి చెప్పింది. ఈ నేపథ్యంలో 2026లో కీలక పనులు పూర్తి కావాల్సి ఉంది.

{{^htLoading}} {{/htLoading}}
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}