2025 సంవత్సరం టీటీడీలో సంక్షోభాలు, దర్యాప్తులు, సంస్కరణలు.. ఇలా ఎన్నో!

2025 సంవత్సరం తిరుమల క్షేత్రం తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. టీటీడీలో అనేక సంక్షోభాలు, దర్యాప్తులు, సంస్కరణలు ఈ ఏడాది ఎన్నో జరిగాయి.

Published on: Dec 29, 2025, 13:26:58 IST
By , Tirumala
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

2025లో తిరుమల శ్రీవారి ఆలయం పేరు ఎప్పుడూ జనాల్లో ఉంటూనే ఉంది. కేవలం భక్తితో మాత్రమే కాదు.. అనేక విషయాల గురించి టీటీడీ వార్తల్లో నిలిచింది. 2025 సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం పేరు ఎక్కువగా వినిపిపించింది. సంస్కరణలు, సంక్షోభాలు, దర్యాప్తులు, రాజకీయ వివాదాలు వరుసగా ఆలయం గురించి ప్రజలు మాట్లాడుకునేలా చేశాయి. పరిపాలన, జవాబుదారీతనం, సంస్థాగత పర్యవేక్షణపై అనేక ప్రశ్నలు లేవనెత్తాయి.

టీటీడీ (TTD)
టీటీడీ (TTD)

2025 సంవత్సరం విషాదకరంగా ప్రారంభమైంది. జనవరిలో వైకుంఠ ఏకాదశి దర్శన టోకెన్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాట ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 40 మందికిపైగా గాయపడ్డారు. భక్తుల రద్దీ సమయంలో నిర్వహణ లోపాలతో ఇది జరిగిందని విమర్శలు వచ్చాయి.

అంతకుముందు విషయాల గురించి జనాల్లో చర్చలు జరుగుతూ ఉండగానే.. అనేక కొత్త విషయాలు తెరపైకి వచ్చాయి. పరకామణి నగదు లెక్కింపు కుంభకోణం, లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి ఉపయోగించారనే ఆరోపణలు, ఇంజనీరింగ్ పనులలో అవకతవకలు, ప్రమోషన్లపై వివాదాలతో తిరుమల తిరుపతి దేవస్థానం వార్తల్లో ఉంది. అయితే ఓవైపు వీటి మీద దర్యాప్తు జరుగుతుండగానే.. మరోవైపు అనేక కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.

వస్త్రాల సరఫరాలో జరిగిన అవకతవకలు, రాష్ట్ర పర్యాటక శాఖతో వివాదాస్పద భూ మార్పిడి ప్రతిపాదన, తిరుమలకు ఇతర సేకరణ సంబంధిత సమస్యలు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏడాది పొడవునా దర్యాప్తు సంస్థల నుండి వచ్చిన పరిశోధనలు ఒకదాని తర్వాత ఒకటి బయటపడటంతో టీటీడీ వార్తల్లో నిలిచింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్), క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్, అవినీతి నిరోధక బ్యూరో.. నిరంతర దర్యాప్తులు చేస్తూనే ఉన్నాయి. దీంతో రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ శ్రీవారిపై రాజకీయం చేయకనే చేశాయని చెప్పవచ్చు.

కల్తీ నెయ్యి కేసులో సీబీఐ నేతృత్వంలోని సిట్ సుప్రీంకోర్టుకు నివేదికను సమర్పించింది. పెద్ద ఎత్తున మోసం జరిగిందని ఆరోపించింది. కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ, రాష్ట్ర పోలీసులు, భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల సంస్థ (FSSAI) అధికారులతో కూడిన బృందం సేకరణ విధానాలలో తీవ్రమైన లోపాలను గుర్తించింది. కాంట్రాక్ట్ కేటాయింపులలో ముడుపులు, ఇతరుల ప్రమేయం ఉందని సూచించింది. కల్తీ నెయ్యి ద్వారా బోలేబాబా డెయిరీ రూ. 251.53 కోట్లు ఆర్జించినట్లు, కల్తీ నెయ్యి కోసం పామాయిల్‌తోపాటుగా ఇతర ఉత్పత్తులు ఉపయోగించినట్టుగా గుర్తించారు. ఈ కేసులో అరెస్టులు జరిగాయి. లోపాల గురించి గత ఛైర్మన్లు, ఎగ్జిక్యూటివ్ అధికారులను కూడా ప్రశ్నించారు. మరోవైపు హైకోర్టు పరకామణి దర్యాప్తును పర్యవేక్షిస్తూనే ఉంది.

ఇక మెున్నటికి మెున్న స్వచ్ఛమైన పట్టు వస్త్రాలకు బదులుగా నాసిరకం పాలిస్టర్ శాలువాల సరఫరాలో రూ.54.95 కోట్ల కుంభకోణం జరిగినట్లు విజిలెన్స్ విచారణలో బయటపడింది. ఇది మరింత వివాదం చెలరేగేలా చేసింది. టీటీడీ ఈ వస్త్రాలను పరీక్షలు చేయించగా.. పట్టు కాదని తెలిసింది.

ఇలాంటి గందరగోళం పరిస్థితుల మధ్య సేవలను మెరుగుపరచడం, విశ్వాసాన్ని పునర్నిర్మించడం లక్ష్యంగా టీటీడీ అనేక సంస్కరణలను ప్రవేశపెట్టింది. ఉచిత ఆహార సముదాయంలో లడ్డూలు, భోజన నాణ్యతను భక్తులు ఇష్టపడ్డారు. భక్తుల నుండి అధిక సంతృప్తి స్థాయిలను నమోదు అయింది.

ఆలయ చరిత్రలో తొలిసారిగా డిసెంబర్ 30 నుండి ప్రారంభమయ్యే వైకుంఠ ఏకాదశి పండుగ మొదటి మూడు రోజులలో సాధారణ భక్తులకు ఆన్‌లైన్ దర్శన టోకెన్లు జారీ చేశారు. డీజిల్, పెట్రోల్ వాహనాలను పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలతో భర్తీ చేస్తూ, విద్యుత్ వినియోగానికి పూర్తిగా మారడానికి బోర్డు మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేసింది. వివిధ రాష్ట్రాల్లో టీటీడీ నిర్వహించే దేవాలయాలలో అన్న ప్రసాద సేవలను తీసుకువచ్చేందుకు ప్రణాళిక వేసింది. ఇతర రాష్ట్రాల్లో శ్రీవారి ఆలయాలు కూడా నిర్మించనున్నారు. 100 ఎకరాల్లో దివ్య వృక్షాల ప్రాజెక్ట్‌ను కూడా టీటీడీ ప్రారంభించింది.

మరోవైపు తిరుమల శ్రీవారి మెట్ల మార్గం దగ్గర టీటీడీ కాంట్రాక్ట్ సిబ్బంది మాంసాహార భోజనం చేసిన ఘటనతో భక్తులు తీవ్రంగా సీరియస్ అయ్యారు. వీరికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగిస్తూ.. టీటీడీ నిర్ణయం తీసుకుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More