Tirumala Pournami Garuda Seva : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో అక్టోబర్ 26వ తేదీన పౌర్ణమి గరుడ సేవను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సర్వం సిద్ధం చేసింది. పవిత్రమైన పౌర్ణమి ఘడియల సందర్భాన్ని పురస్కరించుకుని ఈ విశేష వాహన సేవను చేపట్టనున్నారు.
మాడ వీధుల్లో ఊరేగనున్న శ్రీనివాసుడు

అక్టోబర్ 26న రాత్రి 7 గంటల నుంచి 9 గంటల నడుమ పౌర్ణమి గరుడ సేవ కన్నులపండువగా సాగనుంది. సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్పస్వామివారు సువర్ణ కాంతులతో భాసిల్లే గరుడ వాహనంపై వేంచేసి తిరుమల తిరుమాడ వీధులలో ఊరేగనున్నారు. ఈ పవిత్ర సమయంలో తిరువీధుల్లో విహరిస్తూ స్వామివారు భక్తులకు దివ్య దర్శనం ఇవ్వనున్నారు.
సప్తగిరీశుడి వాహనాల్లో గరుడ వాహన సేవ అత్యంత విశిష్టమైనదిగా భక్తులు భావిస్తారు. ప్రతి నెల పౌర్ణమి రోజున నిర్వహించే ఈ సేవను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తిరుమలకు తరలివస్తారు.
గరుడ వాహనంపై విహరించే శ్రీనివాసుడిని దర్శించుకోవడం వల్ల పాపాలు తొలగి, సర్వ శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. గరుడ సేవ నేపథ్యంలో మాడ వీధుల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అధికారులు, భద్రతా సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
న్యూ ఢిల్లీ ఎస్వీ ఆలయంలో పవిత్రోత్సవాలు :
మరోవైపు న్యూఢిల్లీలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో అక్టోబర్ 30 నుండి నవంబర్ 01వ తేదీ వరకు వార్షిక పవిత్రోత్సవాలను టీటీడీ వైభవంగా నిర్వహించనుంది. ఇందులో భాగంగా 29వ తేదీ గురువారం సాయంత్రం అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అక్టోబర్ 30న పవిత్ర ప్రతిష్ఠ, స్నపన తిరుమంజనం, 31న పవిత్ర సమర్పణ, నవంబర్ 01న మహా పూర్ణాహుతి, చక్రస్నానం నిర్వహించనున్నారు. చివరి రోజు సాయంత్రం నాలుగు మాడ వీధులలో స్వామివారి తిరుచ్చి వీధి ఉత్సవం నిర్వహిస్తారు.
{{/usCountry}}ఈ సందర్భంగా అక్టోబర్ 30న పవిత్ర ప్రతిష్ఠ, స్నపన తిరుమంజనం, 31న పవిత్ర సమర్పణ, నవంబర్ 01న మహా పూర్ణాహుతి, చక్రస్నానం నిర్వహించనున్నారు. చివరి రోజు సాయంత్రం నాలుగు మాడ వీధులలో స్వామివారి తిరుచ్చి వీధి ఉత్సవం నిర్వహిస్తారు.
{{/usCountry}}ఆలయంలో నిత్యం నిర్వహించే అర్చనలు, ఆర్జిత సేవలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, బ్రహ్మోత్సవాలు తదితర వైదిక క్రతువుల్లో తెలిసీ తెలియక సంభవించే దోషాల నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో అంకురార్పణ, యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పవిత్ర ప్రతిష్ఠ, విశేష హోమాలు, పవిత్ర సమర్పణ, పూర్ణాహుతి తదితర క్రతువులను ఆగమోక్తంగా నిర్వహిస్తారు. తద్వారా స్వామివారి కృపాకటాక్షాలు భక్తులపై ప్రసరించి, సకల శుభాలు కలగాలని ప్రార్థిస్తారు.