...
...
Next Story

తెలుగు ప్రయాణికులకు శుభవార్త... తిరుపతి - చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు, షెడ్యూల్ వివరాలు

Tirupati Charlapalli Special Trains : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుపతి - చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈనెల 26, 27 తేదీల్లో ఈ ట్రైన్స్ రాకపోకలు సాగిస్తాయి.

Published on: Jul 25, 2026, 13:48:17 IST
Advertisement

SCR Tirupati Charlapalli Special Trains : తిరుపతి, హైదరాబాద్ మార్గంలో ప్రయాణించే వారికి దక్షిణ మధ్య రైల్వే (SCR) శుభవార్త అందించింది. ప్రయాణికుల రద్దీని తగ్గించడంతో పాటు ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు తిరుపతి - చర్లపల్లి (హైదరాబాద్) స్టేషన్ల మధ్య ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతోంది.

రైళ్ల షెడ్యూల్ వివరాలు…

  • రైలు నంబర్ 07417 (తిరుపతి - చర్లపల్లి) : ఈ ప్రత్యేక రైలు 2026 జులై 26వ తేదీ ఆదివారం రోజున రాత్రి 20:00 గంటలకు (రాత్రి 8:00) తిరుపతిలో బయలుదేరుతుంది. మరుసటి రోజు (సోమవారం) ఉదయం 09:15 గంటలకు చార్లపల్లికి చేరుకుంటుంది. ఈ మార్గంలో ఒక సర్వీస్ అందుబాటులో ఉంటుంది.
  • రైలు నంబర్ 07418 (చర్లపల్లి - తిరుపతి) : తిరుగు ప్రయాణంలో ఈ ప్రత్యేక రైలు 2026 జులై 27వ తేదీ సోమవారం రోజున సాయంత్రం 16:30 గంటలకు (సాయంత్రం 4:30) చార్లపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు (మంగళవారం) ఉదయం 08:00 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ మార్గంలో కూడా ఒక సర్వీస్ నడుస్తుంది.

తిరుపతి - చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు
తిరుపతి - చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు

ప్రయాణికులందరికీ అనువుగా ఉండేలా ఈ ప్రత్యేక రైళ్లలో వివిధ రకాల తరగతులను అందుబాటులోకి తెచ్చారు. ఈ రైళ్లలో 2-టైర్ ఏసీ , 3-టైర్ ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేశారు.

రెండు వైపులా ప్రయాణించే ఈ ప్రత్యేక రైళ్లు మార్గమధ్యంలో అనేక ప్రధాన రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఖమ్మం, వరంగల్ , కాజీపేట స్టేషన్లలో ఈ రైలుకు స్టాపేజీలు కల్పించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాన్లను అనుసంధానించే ఈ ప్రధాన స్టేషన్లలో రైలు ఆగడం వల్ల ఇరు రాష్ట్రాల ప్రయాణికులకు ఊరట లభించనుంది. టికెట్ల బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైనందున ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా ముందస్తుగా దరఖాస్తు చేసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks