దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని అధిగమించేందుకు దక్షిణ కోస్తా రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం తిరుపతి - ఆవడి - రేణిగుంట మధ్య ప్రత్యేక జన్ సాధారణ్ మెము (MEMU) రైలును నడుపుతున్నట్లు వెల్లడించింది. ఈ ప్రత్యేక రైలు సర్వీస్ 2026 అక్టోబర్ 17 శనివారం నాడు ఒక్క రోజే నడపనున్నారు.
ట్రైన్ టైమింగ్స్ వివరాలు….
- తిరుపతి నుంచి అవడి (రైలు నంబర్ 07610) : ఈ ప్రత్యేక రైలు (07610) అక్టోబర్ 17 శనివారం తెల్లవారుజామున 01:00 గంటలకు తిరుపతి స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. అదే రోజు ఉదయం 04:00 గంటలకు తమిళనాడులోని అవడి స్టేషన్కు చేరుకుంటుంది.
- అవడి నుంచి రేణిగుంట (రైలు నంబర్ 07609): తిరుగు ప్రయాణంలో ఈ ప్రత్యేక రైలు (07609) అక్టోబర్ 17 శనివారం ఉదయం 04:25 గంటలకు అవడి నుంచి బయలుదేరి, అదే రోజు ఉదయం 06:45 గంటలకు రేణిగుంట స్టేషన్కు చేరుకుంటుంది. ఈ తిరుగు ప్రయాణపు రైలును రేణిగుంట వరకే నిలిపివేస్తారు.
స్టాపేజీల వివరాలు…

{{^htLoading}} {{/htLoading}}
తిరుపతి నుంచి అవడి మార్గంలో ఈ ప్రత్యేక రైలు రేణిగుంట, పుత్తూరు, ఏకాంబరకుప్పం, తిరుత్తణి, అరక్కోణం, తిరువళ్లూరు స్టేషన్లలో ఆగుతుందని రైల్వే అధికారులు తెలిపారు. పండుగ వేళ ప్రయాణించే భక్తులు మరియు ప్రయాణికులు ఈ ప్రత్యేక రైలు సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}