Tirumala SSD Tokens : శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఈ తేదీల్లో SSD టోకెన్ల జారీ రద్దు

శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్ ఇచ్చింది. మార్చి 3న చంద్రగ్రహణం కారణంగా… మార్చి 1, 2వ తేదీల్లో ఇవ్వాల్సిన SSD టోకెన్ల జారీని రద్దు చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

Published on: Mar 1, 2026, 07:02:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అప్డేట్ ఇచ్చింది. మార్చి 3వ తేదిన చంద్ర గ్రహణం కారణంగా మార్చి 2, 3వ తేదీలలో శ్రీవారి దర్శనాలకు సంబంధించి తిరుపతిలో జారీ చేసే స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్లు జారీని రద్దు చేసింది.

మార్చి 1, 2వ తేదీల్లో SSD టోకెన్ల జారీ రద్దు
మార్చి 1, 2వ తేదీల్లో SSD టోకెన్ల జారీ రద్దు

ఇక మార్చి 2, 3వ తేదీలకు సంబంధించిన ‌SSD టోకెన్లు ముందురోజు అనగా మార్చి 1, 2వ తేదీల్లో జారీ చేయబడవని టీటీడీ వెల్లడించింది. ఇక మార్చి 4వ తేదీ దర్శనానికి సంబంధించిన SSD టోకెన్లను మార్చి 3వ తేదీన జారీ చేస్తారు.

మార్చి 3వ తేదీన వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా రద్దవుతాయని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఈ కారణంగా మార్చి 2వ తేదీన వీఐపీ దర్శన సిఫార్సు లేఖలు స్వీకరించబడవని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు సహకరించాలని టీటీడీ తాజా ప్రకటన ద్వారా కోరింది.

శ్రీవారి ఆలయం మూసివేత:

చంద్రగ్రహణం కారణంగా మార్చి 3వ తేదీన శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. ఉదయం 9 నుండి సాయంత్రం 7.30 గంటల వరకు అంటే సుమారు 10.30 గంటల పాటు మూసివేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.

మార్చి 3వ తేదీ సాయంత్రం 3.20 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై 6.47 గంటలకు పూర్తవుతుంది. సాధారణంగా గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ.

సాయంత్రం 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. అనంతరం శ్రీవారి దర్శనం భక్తులకు 8:30గం నుండి పునః ప్రారంభవుతుంది.

చంద్రగ్రహణం కారణంగా మార్చి 3వ‌ తేదీ మంగళవారం అష్టదళ పాద పద్మారాధన సేవను, కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్స‌వం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.

వీటితో పాటు ఆరోజున వీఐపీ బ్రేక్ దర్శనాలు, శ్రీవాణి దర్శనాలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, చంటి పిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు, దివ్యాంగులు, దాతలు, ఎన్ఆర్ఐ దర్శనాలను కూడా రద్దు చేయడం జరిగింది. శ్రీవారి భక్తులు ఈ విషయాలను గమనించి తమ తిరుమల యాత్ర ప్రణాళికను రూపొందించుకోవాలని టీటీడీ సూచించింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More