...
...
Next Story

SCR Special Trains : తెలుగు ప్రయాణికులకు గుడ్ న్యూస్ - తిరుపతికి వీక్లీ స్పెషల్ ట్రైన్స్! హాల్ట్ స్టేషన్ల లిస్ట్

SCR Special Trains : వేసవి ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. జల్నా - తిరుపతి మధ్య ప్రత్యేక వీక్లీ రైళ్లను ప్రకటించింది. జూన్ 4 నుంచి జూన్ 26 వరకు నడిచే ఈ రైళ్లు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తాయి.

Published on: May 27, 2026, 10:51:09 IST
Advertisement

వేసవి కాలం ముగుస్తున్న తరుణంలో ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు, ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే (SCR) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలోని జల్నా నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి మధ్య ప్రత్యేక వీక్లీ రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. 2026 జూన్ మొదటి వారం నుంచి జూన్ ఆఖరి వారం వరకు ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

టైమింగ్స్ - ముఖ్య వివరాలు:

  • రైలు నంబర్ 07814 (జల్నా - తిరుపతి) : ఈ ప్రత్యేక రైలు జూన్ 4, 2026 నుంచి జూన్ 25, 2026 వరకు ప్రతి వారం గురువారం నాడు జల్నా స్టేషన్ నుంచి తిరుపతికి బయలుదేరుతుంది.
  • రైలు నంబర్ 07815 (తిరుపతి - జల్నా): తిరుగు ప్రయాణంలో ఈ రైలు జూన్ 5, 2026 నుంచి జూన్ 26, 2026 వరకు ప్రతి వారం శుక్రవారం నాడు తిరుపతి నుండి జల్నాకు ప్రయాణికులను చేరవేస్తుంది.

తిరుపతి నుంచి వీక్లీ స్పెషల్ ట్రైన్స్
తిరుపతి నుంచి వీక్లీ స్పెషల్ ట్రైన్స్

ఈ ప్రత్యేక రైళ్లు మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అనేక ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.

  • ఆంధ్రప్రదేశ్: విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట.
  • తెలంగాణ: బాసర, నిజామాబాద్, ఆర్మూర్, కోరుట్ల, లింగంపేట జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం.
  • మహారాష్ట్ర: పార్తూర్, సెలూ, పర్భణి, పూర్ణ, నాందేడ్, ముద్ఖేడ్.

ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణికుల సౌకర్యార్థం సెకండ్ ఏసీ (2AC), థర్డ్ ఏసీ (3AC), స్లీపర్ క్లాస్ (Sleeper Class), జనరల్ సెకండ్ క్లాస్ (General Second Class) కోచ్‌లను ఏర్పాటు చేశారు.

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు, అలాగే వేసవి సెలవుల ముగింపులో సొంతూళ్లకు ప్రయాణమయ్యే వారికి ఈ ప్రత్యేక రైళ్లు ఎంతో ప్రయోజనకరంగా మారనున్నాయి. ప్రయాణికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ ప్రయాణాన్ని ముందస్తుగానే ప్లాన్ చేసుకోవాలని, సురక్షితంగా ప్రయాణించాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe