Sign in

Tirumala Special Festivals : తిరుమల శ్రీవారి భక్తులకు అప్డేట్ - జూన్ ‌నెల‌లోని విశేష ప‌ర్వ‌దినాలు, లిస్ట్

Tirumala Special Festivals June 2026 : తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ నెలలో జరిగే విశేష పర్వదినాల వివరాలను టీటీడీ విడుదల చేసింది. జూన్ 26 నుంచి 28 వరకు జ్యేష్టాభిషేకం, జూన్ 29న పౌర్ణమి గరుడ సేవ నిర్వహించనున్నారు.

Published on: May 26, 2026, 07:32:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Tirumala Special Festivals June 2026 : కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో వచ్చే జూన్ నెలలో నిర్వహించబోయే విశేష పర్వదినాలు, ఉత్సవాల వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రకటించింది. శ్రీవారి ఆలయంలో ప్రతి ఏటా సాంప్రదాయబద్ధంగా జరిగే జ్యేష్టాభిషేకంతో పాటు పలు ముఖ్యమైన ఆధ్యాత్మిక కార్యక్రమాల తేదీలను భక్తుల సౌకర్యార్థం ముందుగానే విడుదల చేశారు. జూన్ నెలలో స్వామివారిని దర్శించుకోవాలనుకునే భక్తులు ఈ ఉత్సవాల తేదీలను బట్టి తమ తిరుమల యాత్రను ప్లాన్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.

తిరుమల శ్రీవారి ఆలయం
తిరుమల శ్రీవారి ఆలయం

జూన్‌ నెల‌లో శ్రీ‌వారి ఆల‌యంలో విశేష ప‌ర్వ‌దినాలు :

  • జూన్ 11 (గురువారం): సర్వ ఏకాదశి పర్వదినం. ఈ రోజున స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
  • జూన్ 13 (శనివారం): మాస శివరాత్రి.
  • జూన్ 26 (శుక్రవారం): తిరుమల శ్రీవారి ఆలయంలో అత్యంత వైభవంగా జరిగే 'జ్యేష్టాభిషేకం' (అభిధేయక అభిషేకం) ఉత్సవాలు ఘనంగా ప్రారంభమవుతాయి.
  • జూన్ 27 (శనివారం): శ్రీ నాథమునుల వర్ష తిరు నక్షత్రం మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు.
  • జూన్ 28 (ఆదివారం): శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు సాగే జ్యేష్టాభిషేకం ఉత్సవాలు ఈ రోజుతో సమాప్తమవుతాయి.
  • జూన్ 29 (సోమవారం): పౌర్ణమి పురస్కరించుకుని రాత్రి వేళ తిరుమల మాడ వీధుల్లో శ్రీవారి 'పౌర్ణమి గరుడ సేవ' వైభవంగా జరగనుంది. సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామి వారు తన వాహనమైన గరుడునిపై అధిరోహించి భక్తులకు దర్శనమిస్తారు.

ఈ విశేష పర్వదినాల సందర్భాల్లో తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగానే దర్శన క్యూలైన్లు, లడ్డూ ప్రసాదం పంపిణీ, తాగునీరు, వసతి తదితర ఏర్పాట్లను టీటీడీ ముందస్తుగా పర్యవేక్షిస్తోంది.

మరోవైపు వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలకు భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో టీటీడీ ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తిరుమలలో శ్రీవారి దర్శనం, అన్నప్రసాదం, తాగునీరు, భద్రత తదితర సేవలను సమర్థవంతంగా అందిస్తోంది.

భక్తుల సౌకర్యార్థం నాణ్యమైన మౌలిక వసతులు, ఫ్యాన్లు, తాగునీటి సదుపాయం, ఎప్పటికప్పుడు సమాచారం అందించే విధానం, వర్షాలకు తడవకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు టీటీడీ అధికారులు చెబుతున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టిటిడి విజిలెన్స్, జిల్లా పోలీసులు, టీటీడీలోని వివిధ విభాగాలు, శ్రీవారి సేవకులు సమన్వయంతో నిరంతరం సేవలందిస్తున్నారని పేర్కొన్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More