...
...
Next Story

తిరుమల లడ్డూ వివాదం : పరిహార హోమం చేపట్టిన వైసీపీ - కూటమి ప్రభుత్వానికి సవాల్

తిరుపతిలో వైసీపీ నేత భూమన శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం చేపట్టారు. శ్రీవారి లడ్డూలో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదనే విషయాన్ని సీబీఐ నివేదిక బయటపెట్టిందన్నారు. దమ్ముంటే 2014- 2019 మధ్య జరిగిన నెయ్యి సరఫరాపై సీబీఐ విచారణ జరిపించాలని సవాల్ చేశారు.

Published on: Jan 30, 2026, 13:57:06 IST
Advertisement

తిరుమల కల్తీ లడ్డూ వివాదంపై సీబీఐ ఇచ్చిన నివేదిక ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వానికి వైసీపీ సూటిగా ప్రశ్నలు సంధిస్తోంది. శ్రీవారి లడ్డూ కేంద్రంగా తప్పుడు చేశారని… కానీ సీబీఐ నివేదిక ద్వారా అసలు విషయాలు బయటికొచ్చాయని చెబుతోంది. ఇదే విషయాన్ని ఆ పార్టీ నేతలు ప్రస్తావిస్తూ… కూటమి ప్రభుత్వానికి ప్రశ్నలు సంధిస్తున్నారు.

పరిహార హోమం…

శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమంలో భూమన
శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమంలో భూమన

ఇదే విషయంపై వైసీపీ ముఖ్య నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం చేపట్టారు. తిరుపతిలోని ఆయన నివాసం వద్దే హోమం కార్యక్రమం జరుగుతోంది. 'సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ పవన్ కళ్యాణ్ శ్రీవారి లడ్డూ ప్రసాదంపై తీవ్రమైన అపనింద మోపారని…. హిందువుల ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామిపై రాజకీయ ఆరోపణలు చేశారని భూమన ఆరోపించారు.

ఆవు కొవ్వుతో లడ్డు ప్రసాదం తయారు చేశారు అని విష ప్రచారం చేశారని భూమని ఫైర్ అయ్యారు." పంది కొవ్వు, చేప కొవ్వు కలిసింది అని తప్పుడు కూతలు కూశారు. కానీ అలాంటివేమి లేవని సీబీఐ… సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చింది. జంతువుల కొవ్వు ఎక్కడా కలవలేదని, రాజకీయ ప్రమేయం లేదని చాలా స్పష్టంగా చెప్పింది. వెంకటేశ్వర స్వామి ప్రసాదంపై వేసిన నిందల కారణంగా శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం చేస్తున్నాం. ఈ హోమం ద్వారా వాళ్ళు వేసిన నింద పోతుందని భావిస్తున్నాం' అని భూమన కరుణాకర్‌ రెడ్డి చెప్పారు.

సీబీఐ విచారణ జరిపించాలి - భూమన సవాల్

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks