...
...
Next Story

OTT Horror Telugu: ఓటీటీలోకి తెలుగు హారర్ థ్రిల్లర్- 15 ఏళ్ల మెడికల్ కాలేజీలో భయపెట్టే గది- 5 భాషల్లో- 8.7 రేటింగ్!

418 OTT Streaming Official: ఓటీటీలోకి తెలుగు సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ 418 వచ్చేస్తోంది. థియేటర్లలో విడుదలైన నెలరోజుల్లోనే 418 ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. 15 ఏళ్ల నాటి పాత మెడికల్ కాలేజీలోని గది చుట్టూ సాగే కథతో 418 ఓటీటీ రిలీజ్ కానుంది. అదెక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Nov 15, 2026, 21:55:25 IST
Advertisement

Telugu Horror Thriller 418 OTT Release Official: టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో రూపొందిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ 418 ఓటీటీలోకి వచ్చేయనుంది. థియేటర్లలో విడుదలైన (అక్టోబర్ 23) కొద్ది రోజులకే ఈ 418 మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమవడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.

ఓటీటీలోకి తెలుగు హారర్ థ్రిల్లర్- 15 ఏళ్ల మెడికల్ కాలేజీలో భయపెట్టే గది- 5 భాషల్లో- 8.7 రేటింగ్!
ఓటీటీలోకి తెలుగు హారర్ థ్రిల్లర్- 15 ఏళ్ల మెడికల్ కాలేజీలో భయపెట్టే గది- 5 భాషల్లో- 8.7 రేటింగ్!

నిజానికి 418 సినిమా థియేటర్లలోకి రాకముందు భారీ హైప్ క్రియేట్ చేసింది. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు ఈ ప్రాజెక్ట్‌తో ముడిపడటం, సెన్సార్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేసిందన్న వార్తలు రావడంతో ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. సినిమాలోని హారర్ సన్నివేశాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయని చిత్రబృందం ప్రచారం చేయడంతో, హారర్ ప్రియులు ఈ చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూశారు.

థియేటర్లలో నిరాశ.. బడ్జెట్ పరంగా సేఫ్!

భారీ అంచనాల మధ్య థియేటర్లలో అడుగుపెట్టిన '418' బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. సినిమా ఆరంభం ఆసక్తికరంగానే సాగినా, ఆ తర్వాత కథనం రొటీన్‌గా మారడం మైనస్ అయింది. మధ్యలో అక్కడక్కడా కొన్ని భయపెట్టే సన్నివేశాలు ఉన్నప్పటికీ, క్లైమాక్స్ గందరగోళంగా ఉండటంతో ప్రేక్షకులు పెదవి విరిచారు.

తక్కువ బడ్జెట్‌తో నిర్మించడంతో నిర్మాతలకు పెట్టుబడి పరంగా పెద్దగా నష్టం వాటిల్లలేదు. కానీ, ఒక భయంకరమైన థ్రిల్లర్ చూద్దామని థియేటర్లకు వెళ్లిన హారర్ అభిమానులకు మాత్రం నిరాశే మిగిలింది. కానీ, ఐఎమ్‌డీబీలో మాత్రం 418 సినిమాకు 8.7 రేటింగ్ దక్కింది.

అసలు '418' గది వెనుక ఉన్న రహస్యమేంటి?

అయితే ఆ హాస్టల్‌లోని 418 నంబర్ గదిని మాత్రం తెరవకుండా అలాగే తాళం వేసి ఉంచుతారు. పైగా ఆ హాస్టల్‌లోకి అమ్మాయిలను అస్సలు అనుమతించరు. అలాంటి వింత నిబంధనలు ఉన్న హాస్టల్‌లోని 417వ గదిలో వివేక్ చేరతాడు. అప్పటికే ఆ గదిలో రోహిత్ (చరణ్ లక్కరాజు) అనే మరో విద్యార్థి ఉంటాడు.

అదే గది కారణం

ఒకరోజు హాస్టల్‌లోని స్నేహితులంతా కలిసి మూసి ఉన్న 418 గది తాళం తీయాలని ప్లాన్ చేస్తారు. వివేక్ తన గదిలోనే ఉండిపోగా, మిగిలిన వారంతా ఆ గది వైపు వెళ్తారు. కానీ చివరి నిమిషంలో భయపడి తమ నిర్ణయాన్ని విరమించుకుని వెనక్కి తగ్గుతారు. సరిగ్గా అదే రోజు రాత్రి వివేక్‌పై హత్యాయత్నం జరుగుతుంది.

అతనికి భయంకరమైన దృశ్యాలు కనిపించడం మొదలవుతుంది. ఈ అనర్థాలన్నింటికీ 418 నంబర్ గదే కారణమని తేలుతుంది. అసలు ఆ గదిని ఎందుకు మూసేశారు? లోపల ఉన్నదెవరు? 15 ఏళ్ల క్రితం ఆ భవనంలో జరిగిన ఘోరం ఏంటి? లండన్ నుంచి వచ్చిన సాయేషా (ప్రీతి పగడాల) ఆ గదిలోకి వెళ్లాలని ఎందుకు ప్రయత్నించింది? దేవిక (చైత్ర ఆచార్) ఎవరు? అన్న ఉత్కంఠభరిత ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

ఓటీటీలో రెండో అవకాశం.. గట్టెక్కుతుందా?

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో థియేటర్లలో ఆడని ఎన్నో చిన్న సినిమాలు ఓటీటీలో అనూహ్య ఆదరణ దక్కించుకుంటున్నాయి. టాలీవుడ్‌లో ఇటీవల హారర్ థ్రిల్లర్లకు మంచి డిమాండ్ ఉంది. థియేటర్లలో పెద్దగా సందడి చేయకపోయినా, రాత్రిపూట ప్రశాంతంగా ఓటీటీలో చూసేందుకు ఇలాంటి మిస్టరీ కథలను నెటిజన్లు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

ఈ నేపథ్యంలో 418 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను అధికారికంగా నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. నవంబర్ 20న తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ వంటి 5 భాషల్లో 418 ఓటీటీ రిలీజ్ కానుంది. అయితే, థియేటర్లలో మిశ్రమ స్పందన తర్వాత 418 నెట్‌ఫ్లిక్స్ విడుదల ఈ చిత్రానికి ఒక మంచి రెండో అవకాశంగా మారింది.

నవంబర్ 20న తేలనున్న జాతకం

డిజిటల్ వేదికపై వచ్చే మౌత్ టాక్ ఈ సినిమా భవిష్యత్తును మార్చే అవకాశం ఉంది. మరి ఓటీటీ ప్రేక్షకులకు ఈ సినిమా అసలైన హారర్ అనుభూతిని ఇస్తుందా, లేక థియేటర్లలో కనిపించిన లోపాలు ఇక్కడా ఇబ్బంది పెడతాయా అన్నది నవంబర్ 20న తేలిపోనుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks