Aakasamlo Oka Tara Trailer: ఆకాశంలో ఒక తార ట్రైలర్ ప్రారంభం నుంచే దర్శకుడు పవన్ సాధినేని సినిమా మెయిన్ ప్లాట్‌పై పూర్తి క్లారిటీ ఇచ్చేశారు. పల్లెటూరి వాతావరణం, ఆస్ట్రోనాట్ కావాలనే ఒక సాధారణ యువతి (సాత్విక) అసాధారణ కల, ఆ కలకు తన కుటుంబమే అడ్డుపడటం.. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు అండగా నిలిచే భర్త.. ఇలా ప్రతి ఫ్రేమ్ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా కట్ చేశారు.
మ్యాజిక్ చేసిన దుల్కర్

దుల్కర్ సల్మాన్ మరోసారి తన డీసెంట్ అండ్ నేచురల్ యాక్టింగ్‌తో మ్యాజిక్ చేశాడు. ఆకాశంలో ఒక తార సినిమాలో భార్య లక్ష్యం కోసం సమాజాన్ని ఎదిరించే 'గ్రీన్ ఫ్లాగ్' భర్త కృష్ణ పాత్రలో జీవించేశాడు. ఇక ఈ సినిమాతో పరిచయమవుతున్న తెలుగమ్మాయి సాత్విక వీరవల్లి స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. కళ్లలోని అమాయకత్వం, లక్ష్యం చేరుకోవాలనే కసిని ట్రైలర్‌లోనే అద్భుతంగా పండించింది.
అదిరిపోయిన శృతి హాసన్ క్యారెక్టరైజేషన్
ఆకాశంలో ఒక తార ట్రైలర్‌లో అందరినీ షాక్‌కు గురిచేసి, క్యూరియాసిటీ పెంచింది మాత్రం స్టార్ హీరోయిన్ శృతి హాసన్. ఆమె ఎంట్రీ ఇచ్చే తీరు, సిగరెట్ తాగుతూ కనిపించే బోల్డ్ అవతార్ సర్ ప్రైజింగ్ గా ఉంది. సెకండాఫ్ లో వచ్చే ఎమోషనల్ కోర్ కు రోహిణిగా ఆమె పాత్రే అత్యంత కీలకం కానుందని ట్రైలర్ చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతోంది. ఆమె క్యారెక్టరైజేషన్ సినిమాకు ప్రధాన బలం కానుంది.
టాప్ క్లాస్ విజువల్స్
ఆకాశంలో ఒక తార సినిమా ట్రైలర్ లో విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. సుజిత్ సారంగ్ కెమెరా వర్క్ పల్లెటూరి అందాలతో పాటు, ఎమోషనల్ సీన్స్ కు తగ్గట్లుగా అద్భుతమైన లైటింగ్ తో ఆకట్టుకుంది. అన్నింటికీ మించి జీవీ ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కు ప్రాణం పోసింది.
{{/usCountry}}ఆకాశంలో ఒక తార సినిమా ట్రైలర్ లో విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. సుజిత్ సారంగ్ కెమెరా వర్క్ పల్లెటూరి అందాలతో పాటు, ఎమోషనల్ సీన్స్ కు తగ్గట్లుగా అద్భుతమైన లైటింగ్ తో ఆకట్టుకుంది. అన్నింటికీ మించి జీవీ ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కు ప్రాణం పోసింది.
{{/usCountry}}గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా లాంటి బడా సంస్థలు ఈ ప్రాజెక్ట్ తో ముడిపడి ఉండటంతో నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీ పడలేదు. పైగా రిలీజ్ కు నాలుగు రోజుల ముందు ట్రైలర్ ను రిలీజ్ చేసిన మేకర్స్.. మూవీపై అంచనాలను మరింత పెంచేశారు.
గూస్ బంప్స్
ఓవరాల్ గా చూసుకుంటే 'ఆకాశంలో ఒక తార' ట్రైలర్ అంచనాలను అమాంతం పెంచేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం ఈ కథకు ఫిదా అవ్వడం, గూస్ బంప్స్ తెప్పించే ఎలిమెంట్స్ ఉండటంతో.. నవంబర్ 20న థియేటర్లలో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది.