...
...
Next Story

ఒకే రోజు ఓటీటీలోకి మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్.. తమిళ మర్డర్ మిస్టరీ.. ఇక్కడ చూసేయండి

ఓటీటీలో థ్రిల్లర్లకు ఉండే క్రేజే వేరు. ముఖ్యంగా తమిళ, మలయాళ థ్రిల్లర్లను తెలుగు ఆడియన్స్ బాగానే ఎంజాయ్ చేస్తారు. ఈ వారం ఒకే రోజు ఇలాంటి రెండు థ్రిల్లర్లు డిజిటల్ స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి. ఆ చిత్రాలు ఏంటో చూసేయండి.

Published on: Nov 25, 2025, 05:49:17 IST
Advertisement

ప్రతి వారం ఓటీటీలోకి కొత్త కంటెంట్ వస్తూనే ఉంది. ఇందులో డిఫరెంట్ జోనర్ల సినిమాలుంటున్నాయి. అయితే థ్రిల్లర్ల వాటా కాస్త ఎక్కువే. ఓటీటీ ఆడియన్స్ ఎక్కువగా డిఫరెంట్ థ్రిల్లర్లు చూడటానికి ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో థియేటర్లలో అదరగొట్టిన రెండు థ్రిల్లర్లు ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అయ్యాయి. ఇందులో ఒకటి మలయాళ సినిమా ది పెట్ డిటెక్టివ్, మరొకటి తమిళ థ్రిల్లర్ ఆర్యన్. ఈ రెండు ఒకే రోజు ఓటీటీలోకి రాబోతున్నాయి.

ది పెట్ డిటెక్టివ్ ఓటీటీ

ఓటీటీలోకి మలయాళం, తమిళ సినిమాలు
ఓటీటీలోకి మలయాళం, తమిళ సినిమాలు

ఈ ఏడాది వరుస సినిమాలతో జోరుమీదున్న అనుపమ పరమేశ్వరన్ నటించిన మరో చిత్రం ది పెట్ డిటెక్టివ్. ఈ మలయాళ థ్రిల్లర్ ఆడియన్స్ కు చ్చితంగా థ్రిల్ పంచుతుంది. ఇందులో షరాఫుద్దీన్, అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్స్ ప్లే చేశారు. ఇది మలయాళం యాక్షన్ కామెడీ థ్రిల్లర్. ఈ మూవీ నవంబర్ 28 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

కథ ఏమిటంటే?

ది పెట్ డిటెక్టివ్ మూవీలో హీరో ఓ ప్రైవేట్ డిటెక్టివ్. ఎలాగైనా పెద్ద కేసు సాల్వ్ చేసి పేరు సంపాదించాలనుకుంటాడు. కానీ అతని దగ్గరకు పెద్దగా కేసులు ఏం రావు. అలాంటి సమయంలో తన ప్రేమను గెలిపించుకోవడం కోసం తప్పిపోయిన ఓ పెంపుడు జంతువును వెతికేందుకు సిద్ధమవుతాడు. ఈ ప్రయాణంలో ఎన్నో ట్విస్ట్ లు చోటు చేసుకుంటాయి. అతను కుక్కను వెతికే క్రమంలో మాఫియా, క్రిమినల్స్ జోలికి వెళ్లాల్సి ఉంటుంది. అలా ఎందుకు జరిగిందన్నది సినిమాలో చూడాల్సిందే.

ఆర్యన్ ఓటీటీ

డిఫరెంట్ స్టోరీ లైన్ తో వచ్చిన తమిళ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ఆర్యన్. విష్ణు విశాల్ హీరోగా నటించిన ఈ మూవీ నవంబర్ 28న నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది. ఇది తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉండనుంది.

స్టోరీ ఇదే

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks