...
...
Next Story

Aparshakti Khurana: యాక్టింగ్ ఆపేసి టైలరింగ్ నేర్చుకుంటా- స్టార్ హీరో తమ్ముడి కామెంట్స్- భార్య తెచ్చిన అదృష్టం అదే!

Aparshakti Khurana Quit Acting Learn Tailoring: బాలీవుడ్ పాపులర్ నటుడు, స్టార్ హీరో తమ్ముడు అపర్‌శక్తి ఖురానా తన కెరీర్, భవిష్యత్తు ప్రణాళికలపై ఆసక్తికర వ్యాఖ్యానాలు చేశారు. రానున్న పదేళ్లలో నటనకు గుడ్ బై చెప్పి, పూర్తిస్థాయిలో దర్జీ (టైలర్) పనులు నేర్చుకోవాలనేది తన కోరికని వెల్లడించారు.

Published on: Jun 12, 2026, 13:55:42 IST
Advertisement

Popular Actor Quit Acting Learn Tailoring Reason: సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి అదృష్టం ఎలా మారుతుందో చెప్పడం కష్టం. టాలీవుడ్‌లోనైనా, బాలీవుడ్‌లోనైనా అవకాశాల కోసం ఏళ్ల తరబడి వేచి చూసేవారే ఎక్కువ.

స్టార్ హీరో తమ్ముడిగా

యాక్టింగ్ ఆపేసి టైలరింగ్ నేర్చుకుంటా- స్టార్ హీరో తమ్ముడి కామెంట్స్- భార్య తెచ్చిన అదృష్టం అదే!
యాక్టింగ్ ఆపేసి టైలరింగ్ నేర్చుకుంటా- స్టార్ హీరో తమ్ముడి కామెంట్స్- భార్య తెచ్చిన అదృష్టం అదే!

బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానా తమ్ముడిగా, 'దంగల్', 'స్త్రీ' వంటి చిత్రాలతో వైవిధ్యమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న అపర్‌శక్తి ఖురానా తాజాగా తన కెరీర్ గురించి సంచలన విషయాలను పంచుకున్నారు. భవిష్యత్తులో తాను నటనకు స్వస్తి చెప్పి సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.

ముంబైలో స్టైలిస్ట్‌గా పాత రోజులు..

నేహా ధూపియా, అంగద్ బేడీ నిర్వహిస్తున్న 'డబుల్ డేట్' టాక్ షోలో అపర్‌శక్తి ఖురానా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన ఫ్యాషన్ సెన్స్ గురించి అంగద్ ప్రశంసించగా, ముంబైలో అడుగుపెట్టిన కొత్తలో తాను పడ్డ కష్టాలను ఆయన గుర్తుచేసుకున్నారు. మొదట్లో ముంబైలో ఎలాగైనా సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతో ఒక ప్రముఖ టీవీ ఛానల్‌లో బాలీవుడ్ షోస్ చేసే యాంకర్లకు స్టైలిస్ట్‌గా పనిచేశానని వెల్లడించారు అపర్‌శక్తి ఖురానా.

దర్జీగా మారాలనే కొత్త కల

"రాబోయే పది లేదా పన్నెండేళ్లలో నేను చేస్తున్న ఈ యాక్టింగ్ కెరీర్‌కు నెమ్మదిగా బైబై చెప్పాలని అనుకుంటున్నాను. ఆ తర్వాత పూర్తిగా టైలరింగ్ (దర్జీ పని) నేర్చుకోవాలనేది నా బలమైన కోరిక. బట్టలు ఎలా కత్తిరించాలి, ఎలా కుట్టాలి అనే విషయాలను మొదటి నుంచి క్షుణ్ణంగా నేర్చుకుంటాను" అని అపర్‌శక్తి ఖురానా తన మనసులోని మాటను బయటపెట్టారు.

చిన్న చిన్న ఉద్యోగాలు

ఒక స్టార్ హోదాలో ఉండి కూడా ఇలాంటి భిన్నమైన ఆలోచన చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇండస్ట్రీలోకి రాకముందు ఢిల్లీ హైకోర్టులో, రేడియో జాకీగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసినట్లు అపర్‌శక్తి తెలిపారు.

"నాకు అంతకుముందు లేడీ లక్ (భార్య అదృష్టం) అనే విషయాలపై అస్సలు నమ్మకం ఉండేది కాదు. కానీ, నా పెళ్లయిన రోజే.. మూడేళ్ల క్రితం నేను పంపిన మెసేజ్‌లకు మూడు వేర్వేరు ప్రొడక్షన్ హౌస్‌ల నుంచి రిప్లైలు వచ్చాయి. వాళ్లకు ఒక హోస్ట్ కావాలని, నన్ను రమ్మని అడిగారు. అప్పుడే నాకు అర్థమైంది, జీవితంలో ఇలాంటి మ్యాజిక్స్ కూడా జరుగుతాయని" అని భార్య అదృష్టం గురించి అపర్‌శక్తి చెప్పుకొచ్చారు.

ఓటీటీ సినిమాలు, సూపర్ హిట్ మూవీస్

మన తెలుగు సమాజంలో కూడా పెళ్లి తర్వాత అదృష్టం కలిసి వస్తుందని బలంగా నమ్ముతారు, అపర్‌శక్తి జీవితంలోనూ అదే నిజమైంది. అపర్‌శక్తి ఖురానా ప్రపంచవ్యాప్తంగా రూ. 2,000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన అమీర్ ఖాన్ 'దంగల్' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు.

ఆ తర్వాత 'బద్రీనాథ్ కీ దులహనియా', 'లుకా చుప్పి' చిత్రాలతో మెప్పించారు. హారర్ కామెడీ చిత్రం 'స్త్రీ' సిరీస్‌లో ఆయన పోషించిన పాత్ర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. జుబిలీ ఓటీటీ సిరీస్‌లో ఆయన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి.

సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ

ఇటీవల పంకజ్ కపూర్, డింపుల్ కపాడియా ప్రధాన పాత్రల్లో నటించిన జబ్ ఖులీ కితాబ్ ఓటీటీ రిలీజ్ చిత్రంలో కనిపించారు. ఈ సినిమా ప్రస్తుతం జీ5లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

కాగా, ఎస్. సూరియ ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రూట్' అనే చిత్రం ద్వారా అపర్‌శక్తి త్వరలోనే తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టనున్నారు. సౌత్ ఆడియన్స్‌ను ఈ సినిమాతో అపర్‌శక్తి ఖురానా ఎలా మెప్పిస్తారో చూడాలి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks