Avasarala Srinivas Comments In Tortoise Song Launch: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన లేటెస్ట్ సినిమా టార్టాయిస్. ఈ సినిమాలో హీరోయిన్స్‌గా అమృత చౌదరి, ధన్య బాలకృష్ణ నటించగా.. అవసరాల శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాను ఎస్‌కే గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు నిర్మిస్తున్నారు.
నీ పరిచయం సాంగ్ లాంచ్

టార్టాయిస్ సినిమాకు రిత్విక్ కుమార్ దర్శకత్వం వహించారు. సస్పెన్స్, డ్రామా, ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా నుంచి నీ పరిచయం సాంగ్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన నీ పరిచయం సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో నటుడు అవసరాల శ్రీనివాస్, హీరోయిన్ ధన్య బాలకృష్ణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
యాక్టర్ అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. "చిన్మయి గారి గాత్రం, అనూప్ గారి మ్యూజిక్ నాకు చాలా ఇష్టం. ఈ పాట వింటుంటే సినిమాలో ఈ సాంగ్‌కు ఉండే ఇంపార్టెన్స్ తెలిసింది. ఇంతమంచి సాంగ్ రాసిన చంద్రబోస్ గారికి థ్యాంక్స్" అని అన్నారు.
అందరు మారారు నేను తప్పా
"ఈ చిత్రంలో చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. ఈ మూవీ ప్లాన్ చేశాక చాలా మంది ఆర్టిస్టులు మారారు కానీ నన్ను మాత్రం మార్చలేదు. ఇలాంటి క్యారెక్టర్స్ నాకు మరిన్ని రావాలని కోరుకుంటున్నా. ఈ ప్రొడ్యూసర్ ఇంకా మరిన్ని మంచి మూవీస్ చేయాలి" అని నటుడు అవసరాల శ్రీనివాస్ తెలిపారు.
"అమృత పర్ఫార్మెన్స్ చూస్తుంటే కొత్త అమ్మాయిలా అనిపించలేదు. ఆమెకు బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నా. ధన్యతో నేను కలిసి నటిస్తున్న మూడో చిత్రమిది. రాజ్ తరుణ్ ఈ చిత్రంలో నా తమ్ముడిగా కనిపిస్తాడు. రాజ్ తరుణ్‌తో కలిసి నటించడం హ్యాపీగా అనిపించింది. ఈ మూవీకి థియేటర్స్‌లో మీరు ఇచ్చే రెస్పాన్స్ చూడాలనే ఎగ్జైట్మెంట్తో ఉన్నాను" అని అవసరాల శ్రీనివాస్ పేర్కొన్నారు.
ఫ్యూర్ ఇన్నోసెన్స్‌తో చేసింది
{{/usCountry}}"అమృత పర్ఫార్మెన్స్ చూస్తుంటే కొత్త అమ్మాయిలా అనిపించలేదు. ఆమెకు బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నా. ధన్యతో నేను కలిసి నటిస్తున్న మూడో చిత్రమిది. రాజ్ తరుణ్ ఈ చిత్రంలో నా తమ్ముడిగా కనిపిస్తాడు. రాజ్ తరుణ్‌తో కలిసి నటించడం హ్యాపీగా అనిపించింది. ఈ మూవీకి థియేటర్స్‌లో మీరు ఇచ్చే రెస్పాన్స్ చూడాలనే ఎగ్జైట్మెంట్తో ఉన్నాను" అని అవసరాల శ్రీనివాస్ పేర్కొన్నారు.
ఫ్యూర్ ఇన్నోసెన్స్‌తో చేసింది
{{/usCountry}}హీరోయిన్ ధన్య బాలకృష్ణ మాట్లాడుతూ.. "ఇదే ప్లేస్‌లో పూజా కార్యక్రమాలతో మా సినిమా ప్రారంభించాం. ఈ రోజు సక్సెస్‌ఫుల్‌గా మా మూవీ కంప్లీట్ చేసి కాన్ఫిడెంట్ గా మీ ముందుకు వస్తున్నాం. ఈ రోజు నుంచి ప్రమోషన్ గట్టిగా స్టార్ట్ చేయబోతున్నాం" అని తెలిపింది.
"ఫస్ట్ డే నుంచి ఈ రోజు దాకా ఈ చిత్రానికి మేము చేసిన జర్నీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగింది. చాలా ఎంజాయ్ చేస్తూ ఈ మూవీ కంప్లీట్ చేశాం. చిన్మయి గారు నా ఫేవరేట్ సింగర్. సింపుల్ లుక్స్‌లో రాజ్ తరుణ్, అమృత ఫ్యూర్ ఇన్నోసెన్స్‌తో చేసిన ఈ పాట నాకు బాగా నచ్చింది. ఈ పాట మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి. టార్టాయిస్ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ మూవీ. మీకు బాగా నచ్చుతుంది. అది మా ప్రామిస్" అని నటి ధన్య బాలకృష్ణ చెప్పుకొచ్చింది.
సింగర్ చిన్మయి కామెంట్స్
నీ పరిచయం పాట పాడిన సింగర్ చిన్మయి మాట్లాడుతూ.. "అనూప్ గారి మ్యూజిక్‌లో ఈ పాట పాడే అవకాశం రావడం సంతోషంగా భావిస్తున్న. అలాగే చంద్రబోస్ గారు ఈ పాటకు బ్యూటిఫుల్ లిరిక్స్ అందించారు. ఈ పాట మీ అందరినీ ఎలా అలరిస్తుందో సినిమా కూడా అంతగానే ఎంగేజ్ చేయాలని కోరుకుంటున్నా" అని ఆకాంక్షించింది.