...
...
Next Story

Manoj Bajpayee Buys Land: 4.45 ఎకరాలు కొన్న వెర్సటైల్ నటుడు మనోజ్ బాజ్‌పాయి.. ధర ఎన్ని కోట్లో తెలుసా?

Actor Manoj Bajpayee Buys 4.45 Acre Land: సౌత్, బాలీవుడ్ పాపులర్ నటుడు మనోజ్ బాజ్‌పాయి రియల్ ఎస్టేట్ రంగంలో మరో భారీ పెట్టుబడి పెట్టారు. మహారాష్ట్రలోని పుణే జిల్లా లోనావాలా సమీపంలో 4.45 ఎకరాల వ్యవసాయ భూమిని సొంతం చేసుకున్నారు. మరి ఈ డీల్ వివరాలపై ఓ లుక్కేద్దాం.

Published on: Aug 28, 2026, 11:46:43 IST
Advertisement

Actor Manoj Bajpayee Buys 4.45 Acre Land: బాలీవుడ్ వెర్సటైల్ నటుడు మనోజ్ బాజ్‌పాయి రియల్ ఎస్టేట్ రంగంలో తన పెట్టుబడులు పెడుతున్నారు. మహారాష్ట్రలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం లోనావాలా సమీపంలో ఆయన భారీగా వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు.

4.45 ఎకరాల స్థలం

4.45 ఎకరాలు కొన్న వెర్సటైల్ నటుడు మనోజ్ బాజ్‌పాయి.. ధర ఎన్ని కోట్లో తెలుసా? (HT Files)
4.45 ఎకరాలు కొన్న వెర్సటైల్ నటుడు మనోజ్ బాజ్‌పాయి.. ధర ఎన్ని కోట్లో తెలుసా? (HT Files)

పుణే జిల్లా ముల్షీ తాలూకా పరిధిలోని తైల్‌బైల్ గ్రామంలో 1.80 హెక్టార్లు (సుమారు 4.45 ఎకరాలు) ఉన్న ఈ స్థలాన్ని తన పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ది ఫ్యామిలీ మ్యాన్ ఓటీటీ సిరీస్ హీరో మనోజ్ బాజ్‌పాయి. చిత్ర పరిశ్రమలో ఆర్జించిన ఆదాయాన్ని ఇలా సురక్షితమైన ఆస్తుల్లో మళ్లించడం సెలబ్రిటీలకు అలవాటే.

హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వికారాబాద్, చేవెళ్ల ప్రాంతాల్లో టాలీవుడ్ ప్రముఖులు ఫామ్‌హౌస్ ల్యాండ్స్ కొనుగోలు చేసినట్లే, ముంబై-పుణే సినీ తారలు లోనావాలా, ముల్షీ ప్రాంతాలపై దృష్టి సారిస్తున్నారు. ప్రాపర్టీ డేటా రీసెర్చ్ సంస్థ 'సిఆర్ఈ మ్యాట్రిక్స్' (CRE Matrix) వెల్లడించిన పత్రాల ఆధారంగా ఈ ల్యాండ్ డీల్ వివరాలు బయటకు వచ్చాయి.

రూ.1.37 కోట్ల డీల్.. రిజిస్ట్రేషన్ వివరాలు ఇవే!

ఈ వ్యవసాయ భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2026 ఆగస్టు 25న పూర్తయింది. విమల్‌చంద్ ఖిమ్‌రాజ్ జైన్ అనే వ్యక్తి నుంచి మనోజ్ బాజ్‌పాయి ఈ ఆస్తిని రూ.1,37,31,000 వెచ్చించి కొనుగోలు చేశారు. ఈ వ్యవహారంలో స్టాంప్ డ్యూటీ రూపంలో రూ.6.86 లక్షలు, రిజిస్ట్రేషన్ రుసుము కింద రూ.30 వేలు చెల్లించినట్లు అధికారిక పత్రాలు చెబుతున్నాయి.

మనోజ్ బాజ్‌పాయికి రియల్ ఎస్టేట్ కొత్త కాదు!

ఓటీటీ వేదికలపై 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ ద్వారా అపారమైన ప్రజాదరణ సంపాదించుకున్నారు మనోజ్ బాజ్‌పాయి. నటనలోనే కాకుండా, ఆస్తుల నిర్వహణలోనూ మనోజ్ బాజ్‌పాయి సరైన ప్రణాళికతో వ్యవహరిస్తున్నారు.

4 కమర్షియల్ ఆఫీస్ యూనిట్లు

గతంలో 2023 అక్టోబర్‌లో ముంబైలోని ఓషివారా ప్రాంతంలో వీరా దేశాయ్ రోడ్డులో ఉన్న 'సిగ్నేచర్ బిల్డింగ్'లో నాలుగు కమర్షియల్ ఆఫీస్ యూనిట్లను మనోజ్ బాజ్‌పాయి కొనుగోలు చేశారు. ఆ సమయంలో రూ.32 కోట్ల విలువైన ఆస్తుల కోసం రూ.1.86 కోట్లు స్టాంప్ డ్యూటీగా చెల్లించారు.

సెకండ్ హోమ్‌లకు నిలయంగా ముల్షీ!

అమితాబ్ బచ్చన్, కాజోల్, అజయ్ దేవగన్ వంటి దిగ్గజ తారల బాటలోనే మనోజ్ బాజ్‌పాయి కూడా కమర్షియల్, అగ్రికల్చరల్ ప్రాపర్టీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. లోనావాలా పరిధిలోని ముల్షీ రీజియన్ ప్రశాంతమైన వాతావరణానికి పేరుగాంచింది.

ధరలు మరింత పెరిగే అవకాశం

ముల్షీ డ్యామ్ పరిసర ప్రాంతాల్లో వీకెండ్ హోమ్స్, ఫామ్‌హౌస్‌లు నిర్మించుకోవడానికి సెలబ్రిటీలు అమితమైన ఆసక్తి చూపుతుంటారు. నగర రద్దీ నుంచి ఉపశమనం పొందేందుకు 'సెకండ్ హోమ్' ఎంచుకోవాలనుకునే ముంబై, పుణే సంపన్నులకు ఈ ప్రాంతం ప్రధాన గమ్యస్థానంగా మారింది. మనోజ్ బాజ్‌పాయి చేసిన ఈ కొనుగోలుతో అక్కడ స్థలాల ధరలకు మరింత రెక్కలు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe