ముంబైలో జరిగిన 'స్పోకెన్ ఫెస్ట్' వేదికపై ఒక తండ్రి ప్రేమ, పోరాటం, గెలుపు కలబోసిన అద్భుతమైన ప్రసంగం వినిపించింది. బాలీవుడ్ నటుడు, తెలుగు విలన్ రాజ్ అర్జున్ తన కుమార్తె సారా అర్జున్ గురించి మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఒకప్పుడు అవకాశాల కోసం ముంబై వీధుల్లో అలమటించిన తనకు, తన కుమార్తె ఎలా 'ధురంధర్'లా అండగా నిలిచిందో రాజ్ అర్జున్ వివరించారు.
జీవితాన్ని మార్చేసిన 2005..

"ముంబైకి ఎన్నో కలలతో వచ్చాను. కానీ, వరుస తిరస్కరణలు నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయి. సరిగ్గా 2005లో నా కుమార్తె సారా పుట్టింది. ఆడపిల్ల పుట్టడం అదృష్టం అని విన్నాను. అది నా విషయంలో అక్షరాలా నిజమైంది" అని రాజ్ అర్జున్ తెలిపారు.
"ఆమె (సారా అర్జున్) పుట్టిన వెంటనే నాకు మొదటిసారి లీడ్ రోల్ వచ్చింది. ఆ సినిమా మధ్యలో ఆగిపోయినా, నాలో పట్టుదల మాత్రం తగ్గలేదు. నా జీవితంలో సారా లేకపోతే, ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు" అని రాజ్ అర్జున్ తన గతాన్ని గుర్తు చేసుకున్నారు.
చీకటి రోజుల్లో వెలుగు రేఖ
ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టిన రోజులను గుర్తు చేసుకుంటూ రాజ్ అర్జున్ భావోద్వేగానికి లోనయ్యారు. "నేను విచ్ఛిన్నం కాలేను, అలాగని ఇక్కడి నుంచి పారిపోలేను. ఖాళీ జేబులతో, అద్దం ముందు నిలబడటానికి కూడా భయపడే వాడిని. కానీ నా కూతురి మెరిసే కళ్లు మాత్రం ప్రతిరోజూ 'నాన్న ధైర్యంగా ఉండు, నాకు నువ్వు కావాలి' అని చెబుతున్నట్లు ఉండేవి. తనే నా ధురంధర్ (విజేత) లాగా నన్ను పడిపోకుండా కాపాడింది" అని రాజ్ అర్జున్ పేర్కొన్నారు.
శక్తిగా మారిన సారా అర్జున్
2016లో ముఖేష్ ఛబ్రా ఆఫీస్కు వెళ్లినప్పుడు, సారా చిన్నపిల్లలా తన చేయి పట్టుకుని బయటకు లాక్కురావడం తన తలరాతను మార్చిందని రాజ్ అర్జున్ తెలిపారు. ఆ తర్వాతే 'సీక్రెట్ సూపర్ స్టార్' సినిమాలో అవకాశం రావడం, అది రూ. 900 కోట్ల వసూళ్లు సాధించడం అందరికీ తెలిసిందే.
{{/usCountry}}2016లో ముఖేష్ ఛబ్రా ఆఫీస్కు వెళ్లినప్పుడు, సారా చిన్నపిల్లలా తన చేయి పట్టుకుని బయటకు లాక్కురావడం తన తలరాతను మార్చిందని రాజ్ అర్జున్ తెలిపారు. ఆ తర్వాతే 'సీక్రెట్ సూపర్ స్టార్' సినిమాలో అవకాశం రావడం, అది రూ. 900 కోట్ల వసూళ్లు సాధించడం అందరికీ తెలిసిందే.
{{/usCountry}}"సాధారణంగా తండ్రి చేయి పట్టుకుని కూతురు నడుస్తుందని చెబుతారు. కానీ, నా కథలో మాత్రం నా కూతురి చేయి పట్టుకునే నేను నా గమ్యాన్ని చేరుకున్నాను. ఒకప్పుడు నేను ఆమెను చూసుకునేవాడిని, ఇప్పుడు తనే నన్ను చూసుకుంటోంది. నేడు ప్రపంచవ్యాప్తంగా తన వెలుగును పంచుతూనే, ఆ వెలుగులో కొంత భాగాన్ని నా పేరు మీద రాస్తోంది. ఇది నాకెంతో గర్వకారణం" అని రాజ్ అర్జున్ ముగించారు.
రాజ్ అర్జున్ తెలుగు సినిమాలు
రాజ్ అర్జున్ కూతురు గురించి చెప్పిన మాటలు ప్రతి ఒక్కరి మనసు కదిలించేలా ఉంది. దాంతో అవి వైరల్ అవుతున్నాయి. కాగా, రాజ్ అర్జున్ 2004లో 'బ్లాక్ ఫ్రైడే'తో కెరీర్ మొదలుపెట్టి 'రౌడీ రాథోడ్', 'రాయీస్', 'షేర్షా', 'ఆర్టికల్ 370' వంటి సినిమాలతో మంచి సక్సెస్ సాధించారు. అంతేకాకుండా 'రజాకార్', 'డియర్ కామ్రేడ్' వంటి తెలుగు చిత్రాలు, అంజలి ఝాన్సీ ఓటీటీ సిరీస్‌లో విలన్‌గా నటించి మెప్పించారు.
సారా అర్జున్ కెరీర్
ఇక సారా అర్జున్ ఆరేళ్ల వయసులోనే 'దైవ తిరుమగళ్' (తెలుగులో 'నాన్న') చిత్రంతో యావత్ భారతాన్ని మెప్పించింది. అదిత్య ధర్ దర్శకత్వంలో 'ధురంధర్' చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమై, బాక్సాఫీస్ వద్ద రూ. 1,300 కోట్ల రికార్డు వసూళ్లతో సత్తా చాటింది. ఇప్పుడు ధురంధర్ 2తో తన కెరీర్‌ను కొనసాగిస్తోంది.