...
...
Next Story

Sai Kumar: ఆ హీరో నాకు బిడ్డలాంటి వాడు, ఆ హీరోయిన్‌తో కన్నడలో జంటగా చాలా సూపర్ హిట్ సినిమాలు చేశా- సాయి కుమార్ కామెంట్స్

Sai Kumar On Prema Priyadarshi Suyodhana: తెలుగు విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్ సాయి కుమార్ నటించిన లేటెస్ట్ ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ సుయోధన. ఇవాళ సుయోధన టీజర్ విడుదల అయింది. ఈ సందర్భంగా నిర్వహించిన సుయోధన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో సీనియర్ హీరోయిన్‌పై సాయి కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Published on: Mar 15, 2026, 23:12:24 IST
Advertisement

ప్రజ్వల లైన్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో హీరోయిన్‌గా నటించిన సినిమా సుయోధన. ఈ మూవీలో డైలాగ్ కింగ్ సాయికుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలకపాత్రల్లో నటించారు. వై ఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బోసుబాబు నిడుమోలు నిర్మించారు.

సుయోధన రిలీజ్ డేట్

ఆ హీరో నాకు బిడ్డలాంటి వాడు, ఆ హీరోయిన్‌తో కన్నడలో జంటగా చాలా సూపర్ హిట్ సినిమాలు చేశా- సాయి కుమార్ కామెంట్స్
ఆ హీరో నాకు బిడ్డలాంటి వాడు, ఆ హీరోయిన్‌తో కన్నడలో జంటగా చాలా సూపర్ హిట్ సినిమాలు చేశా- సాయి కుమార్ కామెంట్స్

అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న సుయోధన సినిమా ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. పలు హిట్ చిత్రాలను రిలీజ్ చేసిన శ్రీ లక్ష్మి పిక్చర్స్ సంస్థ "సుయోధన" సినిమాను విడుదల చేస్తోంది.

సుయోధన టీజర్ లాంచ్ ఈవెంట్

తాజాగా ఇవాళ (మార్చి 15) సుయోధన టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సుయోధన రిలీజ్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యంగ్ హీరో, సీనియర్ హీరోయిన్‌పై నటుడు సాయి కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

నెక్ట్స్ ఏంటీ అనే క్యూరియాసిటీ

యాక్టర్ సాయికుమార్ మాట్లాడుతూ.. "ఇందాక దేవి ప్రసాద్ చెప్పినట్లు ఈ సినిమాలో నటిస్తున్న మాకే కొత్తగా అనిపించింది. నెక్ట్స్ ఏంటి అనే క్యూరియాసిటీ కలిగింది. మీలాగే మేము కూడా థియేటర్‌లో ఈ సినిమా చూసేందుకు వెయిట్ చేస్తున్నాం" అని అన్నారు.

గద్దర్ అవార్డ్ కూడా వచ్చింది

"మా టీమ్‌లో మూవీ చూసి వచ్చిన వాళ్లను అడుగుతున్నాం ఎలా అనిపించింది అని. ఈ మూవీని డైరెక్టర్, ప్రొడ్యూసర్ చాలా ఎఫర్ట్స్ పెట్టి చేశారు. నేను ప్రియదర్శితో కలిసి కోర్ట్ సినిమా చేశాను. అది సూపర్ హిట్ అయింది, గద్దర్ అవార్డ్ కూడా పొందింది. ప్రియదర్శి నాకు బిడ్డ లాంటివాడు. ఈ జనరేషన్‌లో దర్శి లాంటి మంచి నటులతో కలిసి నేను వర్క్ చేయడం సంతోషంగా ఉంది" అని సాయి కుమార్ తెలిపారు.

సూపర్ హిట్ సినిమాల్లో జంటగా

యాక్టర్ దేవి ప్రసాద్ మాట్లాడుతూ.. "సుయోధన సినిమాను స్క్రీన్ మీద చూడాలని మేమూ వెయిట్ చేస్తున్నాం. ఇందులో ఒక కొత్త తరహా కంటెంట్ ఉంది. మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న చిత్రమిది" అని అన్నారు.

అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచీ

"నేను ప్రియదర్శితో ఫస్ట్ టైమ్ కలిసి వర్క్ చేస్తున్నా. సాయి కుమార్ గారితో నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచీ మంచి పరిచయం ఉంది. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేలా ఈ సినిమా ఉంటుంది" అని పేర్కొన్నారు నటుడు దేవి ప్రసాద్.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks