Satyadev Comments On Politics Podcast: టాలీవుడ్‌లో వైవిధ్యమైన పాత్రలతో తనదైన గుర్తింపు తెచ్చుకున్న హీరో సత్యదేవ్. వైవిధ్యమైన నటనతో తెలుగులో ఎంతో క్రేజ్ తెచ్చుకున్నాడు సత్యదేవ్. అయితే, తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో నటీనటుల రాజకీయాలపై హీరో సత్యదేవ్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
అభిప్రాయల వల్ల వచ్చే నష్టాలు

నటులుగా ఉన్నవారు తమ రాజకీయ అభిప్రాయాలను బహిరంగంగా చెబితే వచ్చే నష్టాల గురించి పూసగుచ్చినట్లు వివరించారు సత్యదేవ్. ఇటీవలి కాలంలో తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు రాజకీయాల్లోకి రావడం లేదా ఎన్నికల సమయంలో ఏదో ఒక పార్టీకి మద్దతు తెలపడం చూస్తున్నాం. అయితే దీనివల్ల సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగి, సినిమాల కలెక్షన్లపై కూడా ఆ ప్రభావం పడుతోంది. సరిగ్గా ఇదే అంశంపై సత్యదేవ్ మాట్లాడారు.
'రా టాక్స్ విత్ వీకే' పాడ్‌కాస్ట్‌లో అసలు నిజాలు
ప్రముఖ యూట్యూబ్ పాడ్‌కాస్ట్ 'రా టాక్స్ విత్ వీకే' (Raw Talks with VK)లో హీరో సత్యదేవ్ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోస్ట్ అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. సెలబ్రిటీలుగా ఉన్నవారు తమ మనసులోని అసలు రాజకీయ అభిప్రాయాలను ఎందుకు దాచుకుంటారనే విషయానికి ఆయన ఒక వ్యాపార సూత్రాన్ని (Business Model) ఉదాహరణగా చెప్పారు.
"ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మనం ఏ విషయాలపైనా నిజాయితీతో కూడిన రాజకీయ అభిప్రాయాలను బయటకు చెప్పలేం. ఇది ఇండస్ట్రీలో బతకడానికి ప్రతి ఒక్కరూ పాటించాల్సిన ఒక ప్రోటోకాల్. మన సినిమాను థియేటర్లలో అన్ని వర్గాల ప్రేక్షకులు చూడాలి అనుకున్నప్పుడు.. దౌత్యనీతి (Diplomacy) పాటించడం తప్పనిసరి" అని సత్యదేవ్ పేర్కొన్నారు.
డబ్బుంటేనే ఆ రిస్క్ చేయాలి!
సినిమా అనేది ఒక భారీ వ్యాపారమని, ఇక్కడ ప్రతి ప్రేక్షకుడూ ముఖ్యమేనని సత్యదేవ్ అభిప్రాయపడ్డారు. "సినిమా చూసేవాళ్లలో అన్ని రకాల రాజకీయ భావాలు ఉన్నవారు ఉంటారు. నా పని కేవలం సినిమా తీసి, దాన్ని వీలైనంత ఎక్కువ మందికి చూపించడం మాత్రమే" అని సత్యదేవ్ అన్నారు.
{{/usCountry}}సినిమా అనేది ఒక భారీ వ్యాపారమని, ఇక్కడ ప్రతి ప్రేక్షకుడూ ముఖ్యమేనని సత్యదేవ్ అభిప్రాయపడ్డారు. "సినిమా చూసేవాళ్లలో అన్ని రకాల రాజకీయ భావాలు ఉన్నవారు ఉంటారు. నా పని కేవలం సినిమా తీసి, దాన్ని వీలైనంత ఎక్కువ మందికి చూపించడం మాత్రమే" అని సత్యదేవ్ అన్నారు.
{{/usCountry}}"ఒక పది మంది నా సినిమా చూడటానికి వస్తే, వారిలో ఒక్కరిని కూడా రాజకీయాల వల్ల కోల్పోవడానికి నేను సిద్ధంగా లేను. అందుకే నా వ్యక్తిగత ఇష్టాయిష్టాలను పక్కన పెట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడతాను. ఒకవేళ నేను ఏదైనా ఒక రాజకీయ పార్టీ వైపు నిలబడాలి అనుకుంటే.. ఆ తప్పులన్నింటినీ కడిగేసేంత భారీగా నా దగ్గర డబ్బుండాలి. అంత ఆర్థిక బలం లేనప్పుడు నోరు మూసుకుని ఉండటమే మంచిది. నేనైతే నా జీవితంలో నా అసలు రాజకీయ ఆలోచనలను ఎప్పటికీ బయటపెట్టను" అని సత్యదేవ్ స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో నటీనటుల (సెలబ్రిటీలు)పై ఒత్తిడి పెరుగుతోందని, ఏదైనా ఒక చిన్న సామాజిక అంశంపై స్పందిస్తే.. ఆ తర్వాత జరిగే ప్రతి వివాదంపైనా మాట్లాడాలంటూ సెలబ్రిటీలను నెటిజన్లు (ప్రజలు) టార్గెట్ చేస్తున్నారనే పాయింట్‌ను కూడా సత్యదేవ్ ఒప్పుకున్నారు. ఇలాంటి పరిణామాల వల్లే సినిమా వాళ్లు మౌనంగా ఉండటానికే మొగ్గు చూపుతారని చెప్పారు.
వరుస సినిమాలతో సత్యదేవ్ బిజీ
ఇదిలా ఉంటే, సత్యదేవ్ కెరీర్ విషయానికొస్తే.. గతేడాది (2025) గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండతో కలిసి నటించిన 'కింగ్డమ్' (Kingdom) చిత్రంలో ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. అన్నదమ్ముల సెంటిమెంట్‌తో సాగిన ఈ సినిమాలో ఆయన కీలక పాత్ర పోషించారు.
అలాగే ఆది పినిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ నటించిన 'డ్రైవ్' సినిమాలో అతిథి పాత్రలో సత్యదేవ్ మెరిశారు. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి పర్యవేక్షణలో అమెజాన్ ప్రైమ్ వీడియో రూపొందించిన ఓటీటీ సిరీస్ అరేబియా కడలిలోనూ సత్యదేవ్ హీరోగా చేశారు.
సత్యదేవ్ క్రేజీ సినిమాలు
ప్రస్తుతం సత్యదేవ్ చేతిలో క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. వెంకటేష్ మహా దర్శకత్వంలో సత్యదేవ్ నటిస్తున్న 'రావు బహదూర్' (Rao Bahadur) చిత్రం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీనితో పాటు 'ఫుల్ బాటిల్', 'గరుడ: చాప్టర్ వన్', సమవర్తి వంటి సినిమాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి.