విలక్షణ నటుడు శివాజీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘దండోరా’. ‘కలర్ ఫొటో’, ‘బెదురులంక 2012’ వంటి మంచి చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని ‘దండోరా’ మూవీని రూపొందించారు.
దండోరా నటీనటులు

ఈ చిత్రంలో బిగ్ బాస్ శివాజీతో పాటుగా నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ చిత్రానికి మురళీకాంత్ దర్శకత్వం వహించారు. దండోరా సినిమాను డిసెంబర్ 25న భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు.
హీరో శివాజీ కామెంట్స్
ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల నటుడు శివాజీ మీడియాతో ముచ్చటించారు. ఈ ఇంటర్వ్యూలో హీరో శివాజీ ఇంట్రెస్టింగ్ విషయాలు చెబుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
‘వేదం’, ‘కంచెరపాలెం’ చిత్రంలోనూ వేశ్య పాత్రల్ని చూపించారు. ఇందులో ఎలా చూపించబోతోన్నారు?
-‘దండోరా’ చిత్రంలో బిందు మాధవి గారి పాత్రను చాలా క్లాసీగా చూపించారు. ప్రతీ ఒక్కరూ సినిమాతో, పాత్రలతో కనెక్ట్ అవుతారు.
మిమ్మల్ని కొత్త దర్శకులే ఎక్కువగా వాడుకుంటున్నట్టుగా ఉన్నారు?
-నేను దాదాపు కొత్త దర్శకులతోనే పని చేస్తున్నాను. మన మేకర్స్ ఎక్కువగా లెక్కలు వేసుకుంటూ ఉంటారు. మన దగ్గర ఎంతో పొటెన్షియల్ యాక్టర్స్ ఉన్నా కూడా పక్క భాషల నుంచి తీసుకు వస్తుంటారు. ఇందులో నవదీప్, నందు, రవికృష్ణ ఇలా అందరూ అద్భుతమైన ఆర్టిస్టులే.
-ఇక్కడ మన వాళ్ల గురించి మనమే తక్కువ అంచనా వేసుకుంటాం. ఇదే శివాజీ 30 ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నాను. నేను ఇది వరకు ఎన్నో నెగెటివ్ పాత్రలు పోషించాను. కానీ, మన దర్శకులకు నేను ఎక్కువగా కనిపించలేదేమో.
‘మిస్సమ్మ’లాంటి చిత్రాల్ని ఎంజాయ్ చేశారా? ‘కోర్ట్’, ‘డండోరా’ లాంటి చిత్రాల్ని ఎంజాయ్ చేస్తారా?
{{/usCountry}}-ఇక్కడ మన వాళ్ల గురించి మనమే తక్కువ అంచనా వేసుకుంటాం. ఇదే శివాజీ 30 ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నాను. నేను ఇది వరకు ఎన్నో నెగెటివ్ పాత్రలు పోషించాను. కానీ, మన దర్శకులకు నేను ఎక్కువగా కనిపించలేదేమో.
‘మిస్సమ్మ’లాంటి చిత్రాల్ని ఎంజాయ్ చేశారా? ‘కోర్ట్’, ‘డండోరా’ లాంటి చిత్రాల్ని ఎంజాయ్ చేస్తారా?
{{/usCountry}}-‘మిస్సమ్మ’, ‘శైలజా కృష్ణమూర్తి’, ‘అదిరిందయ్య చంద్రం’ ఇలా అన్ని రకాల చిత్రాల్ని ఎంజాయ్ చేశాను. అయితే నటుడిగా నా మీద నాకు నమ్మకం ఉండేది. కామెడీ, నెగెటివ్ షేడ్స్ ఇలా అన్ని రకాల పాత్రల్ని పోషించగలను. ఇప్పుడు నాకు కాలం కలిసి వచ్చిందేమో. అలా అని ప్రస్తుతం అన్నీ ఒకే రకమైన పాత్రల్ని కూడా సెలెక్ట్ చేసుకోవడం లేదు.
‘దండోరా’ తరువాత మీ నుంచి రాబోతోన్న చిత్రాల గురించి చెప్పండి?
-‘దండోరా’ తరువాత నా నుంచి ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ అనే చిత్రం రాబోతోంది. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రానున్న ‘ఎపిక్’ అద్భుతంగా ఉండబోతోంది. ప్రతీ ఫ్యామిలీ, తండ్రీకొడుకులకు కనెక్ట్ అయ్యే ఎన్నో అద్భుతమైన సన్నివేశాలతో ‘ఎపిక్’ ఉంటుంది.