జాతి రత్నాలు సినిమాతో హీరోయిన్‌గా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది బ్యూటిపుల్ ఫరియా అబ్దుల్లా. ఈ సినిమాలో చిట్టిగా తెలుగు యువతను తెగ అట్రాక్ట్ చేసింది. ఫరియా అబ్దుల్లా తాజాగా నటించిన సినిమా గుర్రం పాపిరెడ్డి. డార్క్ కామెడీ కథతో తెరకెక్కిన ఈ సినిమాలో నరేష్ అగస్త్య హీరోగా చేశాడు.
డిసెంబర్ 19న గుర్రం పాపిరెడ్డి రిలీజ్

డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) గుర్రం పాపిరెడ్డి సినిమాను నిర్మించారు. ఈ మూవీకి డైరెక్టర్ మురళీ మనోహర్ దర్శకత్వం వహించారు. గుర్రం పాపిరెడ్డి డిసెంబర్ 19న థియేటర్లలో విడుదల కానుంది.
ఫరియా అబ్దుల్లా కామెంట్స్
ఈ నేపథ్యంలో తాజాగా డిసెంబర్ 17న గుర్రం పాపిరెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పింది.
డిఫరెంట్ డార్క్ కామెడీ మూవీ
హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ.. "ఈ సినిమాలో సౌధామిని క్యారెక్టర్‌లో మీ ముందుకు వస్తున్నాను. ఒక డిఫరెంట్ డార్క్ కామెడీ చిత్రమిది. ఈ ఈవెంట్‌లో మా డైరెక్టర్ మురళీ మనోహర్ గారు ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. అలాంటి క్రియేటివ్ పర్సన్ భావోద్వానికి గురయ్యారంటే మూవీ కోసం ఎంత తపన పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు" అని తెలిపింది.
ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్‌లా
"కృష్ణ సౌరభ్ పాటలతోనే కాదు తన బీజీఎంతో కూడా మూవీని మరో ఎత్తుకు తీసుకెళ్లారు. ఈ మూవీలో నేను ఒక సాంగ్ రాసి పాడి కొరియోగ్రాఫ్ చేశాను. మా ప్రొడ్యూసర్స్ ఒక ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్‌లా మారిపోయారు. వాళ్లతో టూర్ చేసినట్లు షూటింగ్ కంప్లీట్ చేశాం. ఎక్కడా మాకు స్ట్రెస్ ఇవ్వలేదు. మా మూవీని చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాం" అని ఫరియా అబ్దుల్లా చెప్పింది.
కొత్త జోనర్స్‌లో
మ్యూజిక్ డైరెక్టర్ కృష్ణ సౌరభ్ మాట్లాడుతూ.. "ఈ సినిమాకు వర్క్ చేయడం ప్రతి రోజూ ఎగ్జైటింగ్ ఫీల్ కలిగించింది. కొత్త జోనర్స్‌లో సాంగ్స్‌ను కంపోజ్ చేశాం. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్ పైసా డుమ్ డుమ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫరియా గారు సింగర్‌గా ఆకట్టుకుంటారు. ఈ మూవీ జర్నీలో నాకు సపోర్ట్ చేసిన మా టీమ్ అందరికీ థ్యాంక్స్" అని అన్నారు.
గుర్రం పాపిరెడ్డి నటీనటులు
{{/usCountry}}మ్యూజిక్ డైరెక్టర్ కృష్ణ సౌరభ్ మాట్లాడుతూ.. "ఈ సినిమాకు వర్క్ చేయడం ప్రతి రోజూ ఎగ్జైటింగ్ ఫీల్ కలిగించింది. కొత్త జోనర్స్‌లో సాంగ్స్‌ను కంపోజ్ చేశాం. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్ పైసా డుమ్ డుమ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫరియా గారు సింగర్‌గా ఆకట్టుకుంటారు. ఈ మూవీ జర్నీలో నాకు సపోర్ట్ చేసిన మా టీమ్ అందరికీ థ్యాంక్స్" అని అన్నారు.
గుర్రం పాపిరెడ్డి నటీనటులు
{{/usCountry}}ఇదిలా ఉంటే, గుర్రం పాపిరెడ్డి సినిమాలో నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లాతోపాటు బ్రహ్మానందం, యోగి బాబు, ప్రభాస్ శ్రీను, రాజ్ కుమార్ కాసిరెడ్డి, జీవన్ కుమార్, వంశీధర్ కోసిగి, జాన్ విజయ్, మొట్ట రాజేంద్రన్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.