Malavika Mohanan Comments On CM Vijay: కోలీవుడ్ పరిశ్రమలో తిరుగులేని స్టార్ హీరోగా వెలిగి ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా సరికొత్త రికార్డులు సృష్టించారు దళపతి విజయ్. ఆయన రాజకీయ ప్రస్థానం, సాధించిన విజయం ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది.
క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు

విజయ్‌తో కలిసి నటించిన సహనటులు సైతం ఆయన పనితీరును, క్రమశిక్షణను ఎంతగానో అభినందిస్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ది రాజా సాబ్ బ్యూటీ మాళవిక మోహనన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో విజయ్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
సెట్స్‌లో విజయ్ డిసిప్లిన్ వేరే లెవెల్
విజయ్‌తో తనకున్న మొదటి పరిచయాన్ని మాళవిక గుర్తు చేసుకున్నారు. షూటింగ్ తొలిరోజే ఒక సవాలుతో కూడిన సీన్ చేయాల్సి వచ్చిందని, చివరి నిమిషంలో డైలాగులు రావడంతో తాను కంగారు పడ్డానని చెప్పారు. ఆ సమయంలో విజయ్ ఎంతో ప్రశాంతంగా, నిశ్శబ్దంగా తన పని తాను చూసుకుంటూ కనిపించారని ఆమె తెలిపారు.
"సెట్స్‌లో విజయ్ చాలా సైలెంట్‌గా ఉంటారు. చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనిస్తూ, తన పాత్రపైనే పూర్తి దృష్టి పెడతారు. ఒకసారి పరిచయం పెరిగాక ఆయన ఎంతో సరదాగా ఉంటారు. ఎప్పుడు అవసరమొచ్చినా ఫోన్ చేసి మాట్లాడగలిగేంత స్వేచ్ఛను ఇస్తారు. అంత పెద్ద స్టార్ అయి ఉండి కూడా అందరికీ అందుబాటులో ఉండటం గొప్ప విషయం" అని మాళవిక మోహనన్ కొనియాడారు.
సమయపాలనలో ఆ ముగ్గురే స్ఫూర్తి
సినిమా పరిశ్రమలో అగ్రస్థానానికి చేరుకోవడానికి ప్రతిభతో పాటు క్రమశిక్షణ కూడా ఎంతో అవసరమని మాళవిక అభిప్రాయపడ్డారు. రజనీకాంత్, మోహన్ లాల్, విజయ్ వంటి సీనియర్ హీరోల నుంచి ప్రొఫెషనలిజం అంటే ఏంటో నేర్చుకున్నట్లు మాళవిక మోహనన్ వెల్లడించారు. అంటే రజనీకాంత్, మోహన్ లాల్‌తో దళపతి విజయ్‌ను పోలుస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు మాళవిక.
{{/usCountry}}సినిమా పరిశ్రమలో అగ్రస్థానానికి చేరుకోవడానికి ప్రతిభతో పాటు క్రమశిక్షణ కూడా ఎంతో అవసరమని మాళవిక అభిప్రాయపడ్డారు. రజనీకాంత్, మోహన్ లాల్, విజయ్ వంటి సీనియర్ హీరోల నుంచి ప్రొఫెషనలిజం అంటే ఏంటో నేర్చుకున్నట్లు మాళవిక మోహనన్ వెల్లడించారు. అంటే రజనీకాంత్, మోహన్ లాల్‌తో దళపతి విజయ్‌ను పోలుస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు మాళవిక.
{{/usCountry}}ఉదయం 7 గంటలకు షూటింగ్ ఉంటే, వారు 6:55 గంటలకే సెట్స్‌లో ఉంటారని.. ఎప్పుడూ ఆలస్యం చేసి నిర్మాతల డబ్బును వృధా చేయరని ప్రశంసించారు. యువ నటీనటులు వీరిని చూసి చాలా నేర్చుకోవాలని చెప్పారు. కాగా 2021లో వచ్చిన 'మాస్టర్' సినిమాలో విజయ్, మాళవిక కలిసి నటించారు. కరోనా లాక్‌డౌన్ తర్వాత తీవ్ర నష్టాల్లో ఉన్న థియేటర్లకు ఆ సినిమా భారీ వసూళ్లతో ఊపిరి పోసింది.
రూ. 500 కోట్ల 'జన నాయగన్' విడుదలకు మోక్షం
ఇదిలా ఉంటే, దళపతి విజయ్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం 'జన నాయగన్' ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. సెన్సార్ బోర్డ్ (CBFC)తో ఉన్న కొన్ని వివాదాల కారణంగా ఈ సినిమా చాలా కాలంగా ఆలస్యమవుతూ వచ్చింది. దాదాపు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ సినిమా అడ్డంకులు తొలగుతున్నట్లు నిర్మాత వెంకట్ కే నారాయణ స్పష్టం చేశారు. సెన్సార్ ప్రక్రియ చివరి దశకు చేరిందని, త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి హోదాలో విజయ్ స్వయంగా చొరవ తీసుకుని ఈ సమస్యను పరిష్కరించినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
ప్రభాస్‌తో రాజా సాబ్
మరోవైపు మాళవిక మోహనన్ కెరీర్ విషయానికి వస్తే, ఆమె ఇటీవల ప్రభాస్ సరసన 'ది రాజా సాబ్' చిత్రంలో నటించారు. ప్రస్తుతం కార్తీ సరసన 'సర్దార్ 2' సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది గ్లామర్ భామ మాళవిక మోహనన్.