Neha Dhupia On Pregnancy Contractions At Movie Sets: సినిమా రంగంలో గ్లామర్ మాత్రమే కాదు, అంతకు మించిన కష్టం ఉంటుందని బాలీవుడ్ హీరోయిన్ నేహా ధూపియా మరోసారి నిరూపించారు. సాధారణంగా గర్భం దాల్చిన తర్వాత నటీమణులు విశ్రాంతి తీసుకుంటారు. కానీ, నేహా మాత్రం తన రెండో గర్భధారణ సమయంలో ఎనిమిదిన్నర నెలలు నిండిన తర్వాత కూడా షూటింగ్‌లో పాల్గొన్నారు.
మామ్స్ టాక్స్ ఓటీటీ షో

తాజాగా మరో హీరోయిన్ పరిణీతి చోప్రా నిర్వహిస్తున్న 'మామ్ టాక్స్' (Mom Talks) అనే ఓటీటీ టాక్ షోలో నేహా ధూపియా ఈ ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. బుధవారం (ఏప్రిల్ 22) విడుదలైన మామ్ టాక్స్ నేహా ధూపియా ఎపిసోడ్ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
యష్ రాజ్ స్టూడియోలో ఆ అనుభవం
ప్రెగ్నెన్సీ సమయంలో షూటింగ్ అనుభవాల గురించి నేహా ధూపియా స్పందిస్తూ.. "నేను గర్భవతిగా ఉన్నప్పుడు చివరి నిమిషం వరకు పని చేయాలని నిర్ణయించుకున్నాను. ముంబైలోని యష్ రాజ్ స్టూడియోలో షూటింగ్‌లో ఉండగానే నాకు కాంట్రాక్షన్స్ (పురిటి నొప్పులు) మొదలయ్యాయి. అప్పుడు నేను ఎనిమిదిన్నర నెలల గర్భిణిని" అని తెలిపారు.
ఆ సమయంలో నేహా ధూపియా 'ఏ థర్స్ డే' (A Thursday) అనే సినిమా కోసం పని చేస్తున్నారు. విశేషమేమిటంటే ఆ చిత్రంలో కూడా నేహా ధూపియా గర్భిణీగా ఉన్న పోలీస్ ఆఫీసర్ పాత్రనే పోషించడం గమనార్హం. నటిగా తన పాత్రకు న్యాయం చేయడమే కాకుండా, వ్యక్తిగత జీవితంలోని ఆ కీలక దశను కెమెరా ముందు సహజంగా పండించారు.
సమాజం ఏమనుకున్నా పరవాలేదు
తల్లి అయిన తర్వాత మహిళల పట్ల సమాజం చూసే దృక్పథంపై పరిణీతి చోప్రా అడిగిన ప్రశ్నకు నేహా ధూపియా ఆసక్తికర సమాధానం ఇచ్చారు. "తల్లి అయిన తర్వాత కూడా ఒక మహిళ తాను అనుకున్న పనులన్నీ చేయగలగాలి. మాతృత్వం వల్ల మన ఆశయాలు, పనులు మారిపోకూడదు" అని ఆమె స్పష్టం చేశారు.
{{/usCountry}}తల్లి అయిన తర్వాత మహిళల పట్ల సమాజం చూసే దృక్పథంపై పరిణీతి చోప్రా అడిగిన ప్రశ్నకు నేహా ధూపియా ఆసక్తికర సమాధానం ఇచ్చారు. "తల్లి అయిన తర్వాత కూడా ఒక మహిళ తాను అనుకున్న పనులన్నీ చేయగలగాలి. మాతృత్వం వల్ల మన ఆశయాలు, పనులు మారిపోకూడదు" అని ఆమె స్పష్టం చేశారు.
{{/usCountry}}అంగద్ బేడీతో తన వివాహం, ఆ తర్వాత ఎదురైన ట్రోల్స్ గురించి కూడా నేహా ధూపియా నిర్మొహమాటంగా మాట్లాడారు. 2018 మే నెలలో నేహా, అంగద్ బేడీ వివాహం జరగగా, అదే ఏడాది నవంబర్‌లో కుమార్తె మెహర్ జన్మించింది. పెళ్లికి ముందే గర్భం దాల్చడంపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
నీనా, అలియా జాబితాలో
"పెళ్లయిన ఆరు నెలలకే పాప ఎలా పుట్టింది? అంటూ ఇప్పటికీ నన్ను ట్యాగ్ చేస్తూ వార్తలు రాస్తుంటారు. ఇలాంటి విషయాల్లో నేను నీనా గుప్తా, అలియా భట్ వంటి వారి జాబితాలో ఉండటం సంతోషమే. అసలు గర్భం దాల్చడం అనేది ఒక అందమైన అనుభవం, దాన్ని నెగెటివిటీతో చూడటం హాస్యాస్పదం" అని నేహా ధూపియా తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టారు.
ప్రస్తుత ప్రాజెక్టులు
ఇదిలా ఉంటే, నేహా ధూపియా ప్రస్తుతం కెరీర్ పరంగానూ బిజీగా ఉన్నారు. ఇటీవల ఆమె 'సింగిల్ పాపా' అనే షోలో కనిపించారు. కునాల్ ఖేము, ప్రజక్త కోహ్లీ వంటి స్టార్లతో కలిసి నటించిన ఈ కామెడీ డ్రామా నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ అయింది. ఈ ఓటీటీ సిరీస్ సక్సెస్ కావడంతో రెండో సీజన్‌ను కూడా సిద్ధం చేస్తున్నారు మేకర్స్.
కాగా.. వ్యక్తిగత జీవితంలో ఇద్దరు పిల్లలు (మెహర్, గురిక్) ఉన్నప్పటికీ, నేహా తన కెరీర్‌ను సమానంగా బ్యాలెన్స్ చేస్తూ నేటి తరం మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.