Sonam Khan Reveals Affair With Director Rajiv Rai: సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్‌కు మంచి బ్రేక్ దక్కినా, చార్ట్‌బస్టర్ సాంగ్ దక్కినా.. ఆమెకు దర్శకుడితోనో లేదా నిర్మాతతోనో ఏదో సంబంధం ఉందంటూ గాసిప్స్ పుట్టుకురావడం కామన్ అయిపోయింది.
సోనమ్ ఖాన్ అఫైర్ రూమర్స్

అయితే, 1989 నాటి బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ ‘త్రిదేవ్’ (Tridev) సినిమా విషయంలోనూ నటి సోనమ్ ఖాన్ సరిగ్గా ఇలాంటి విమర్శలనే ఎదుర్కొన్నారు. ఆ చిత్రంలోని ఐకానిక్ సాంగ్ ‘ఓయే ఓయే’ (Oye Oye) దేశాన్ని ఊపేసిన సమయంలో.. దర్శకుడు రాజీవ్ రాయ్‌తో ఉన్న ఎఫైర్ వల్లే ఆమెకు ఆ రేంజ్ ఓపెనింగ్స్, స్క్రీన్ టైమ్ దక్కాయని అందరూ భావించారు.
ఫస్ట్ డే షూట్.. ఫస్ట్ సాంగ్.. ఫస్ట్ రూమర్!
తాజాగా ఈ వ్యవహారంపై దాదాపు 35 ఏళ్ల తర్వాత సోనమ్ ఖాన్ స్పందించి, ఆనాటి పుకార్లను పూర్తిగా తిప్పికొట్టారు. సోనమ్ ఖాన్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ‘ఓయే ఓయే’ సాంగ్ వీడియోను పంచుకుంటూ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు.
"ఓయే ఓయే ఓయే ఓయే ఓహ్ నా.. అంటే ఇది అస్సలు నిజం కాదు. త్రిదేవ్ షూటింగ్ మొదటి రోజే, మొదటి పాట రికార్డింగ్ సమయంలోనే నాపై ఆ మొదటి రూమర్ పుట్టింది. నిజం ఏంటంటే, అప్పట్లో నా దర్శకుడితో నాకు ఎలాంటి అఫైర్ లేదు" అని సోనమ్ ఖాన్ స్పష్టం చేశారు.
త్రిదేవ్ విడుదలైన తర్వాత, తాను దర్శకుడితో ప్రేమాయణం సాగించడం వల్లే మిగిలిన ఇద్దరు హీరోయిన్ల కంటే తనకు ఎక్కువ స్క్రీన్ టైమ్, దేశవ్యాప్తంగా మారుమోగిన ఒక సూపర్ హిట్ సాంగ్ దక్కాయనే ప్రచారం జోరుగా సాగిందని ఆమె గుర్తుచేసుకున్నారు.
లొకేషన్లో ఇద్దరికీ వేరే పార్ట్నర్స్ ఉన్నారు!
{{/usCountry}}త్రిదేవ్ విడుదలైన తర్వాత, తాను దర్శకుడితో ప్రేమాయణం సాగించడం వల్లే మిగిలిన ఇద్దరు హీరోయిన్ల కంటే తనకు ఎక్కువ స్క్రీన్ టైమ్, దేశవ్యాప్తంగా మారుమోగిన ఒక సూపర్ హిట్ సాంగ్ దక్కాయనే ప్రచారం జోరుగా సాగిందని ఆమె గుర్తుచేసుకున్నారు.
లొకేషన్లో ఇద్దరికీ వేరే పార్ట్నర్స్ ఉన్నారు!
{{/usCountry}}ఈ ప్రచారంలో ఊహించని ట్విస్ట్ ఇస్తూ.. ఆ సమయంలో తామిద్దరం వేర్వేరు వ్యక్తులతో రిలేషన్‌షిప్‌లో ఉన్నామని సోనమ్ వెల్లడించారు. "మీ పాపులర్ నమ్మకాలకు భిన్నంగా.. త్రిదేవ్ సెట్స్‌లో రాజీవ్ రాయ్ తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఉండేవారు. నేను కూడా సింగిల్‌గా లేను, నా బాయ్‌ఫ్రెండ్ కూడా షూటింగ్ స్పాట్‌కు కాస్త దూరంలోనే కార్ పార్కింగ్‌లో వేచి చూసేవాడు. మేమిద్దరం అప్పటికే వేరే వాళ్లతో కమిట్ అయి ఉన్నాం" అని సోనమ్ ఖాన్ పేర్కొన్నారు.
నేను లాస్ట్ ఛాయిస్.. డైరెక్టర్‌కు నన్ను పెట్టడం ఇష్టం లేదు!
అంతేకాదు, రాజీవ్ రాయ్‌కు మొదట్లో తాను ఆ సినిమాలో నటించడం అస్సలు ఇష్టం లేదనే మరో పచ్చి నిజాన్ని కూడా పంచుకున్నారు సోనమ్. దర్శకుడు యష్ చోప్రా నిర్మించిన 'విజయ్' సినిమా రషెస్ (షూటింగ్ క్లిప్స్) చూసిన రాజీవ్ రాయ్‌కు సోనమ్ నటన అంతగా నచ్చలేదు. అందువల్ల త్రిదేవ్ కోసం ఆయన వేరే హీరోయిన్‌ను అనుకుని, దాదాపు ఒప్పందం కూడా పూర్తి చేసుకున్నారు. కానీ ఆఖరి నిమిషంలో వేరే దారి లేక, సోనమ్‌ను చివరి ఆప్షన్‌గా ఎంచుకోవాల్సి వచ్చింది.
"నాకు ఎలాంటి డైరెక్టర్ ప్రివిలేజ్ (ప్రత్యేక ప్రాధాన్యత) దక్కలేదు, రహస్య ఫోన్ కాల్స్ లేవు. కేవలం ఆ పాట నా అదృష్టం కొద్దీ నా చేతుల్లోకి వచ్చింది. సినిమా సూపర్ హిట్ అయిన చాలా కాలం తర్వాత.. మేమిద్దరం సింగిల్‌గా ఉన్నప్పుడు మాత్రమే డేటింగ్ ప్రారంభించాం. అప్పుడు మేం ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు" అని సోనమ్ క్లారిటీ ఇచ్చారు.
పెళ్లి.. విడాకులు..
త్రిదేవ్ విడుదలయ్యాక ప్రేమలో పడ్డ సోనమ్, రాజీవ్ రాయ్ 1991లో వివాహం చేసుకున్నారు. పెళ్లయిన తర్వాత కుటుంబం కోసం సోనమ్ సినిమాలకు పూర్తిగా గుడ్‌బై చెప్పారు. వీరికి ఒక కుమారుడు జన్మించగా, అతనికి ఆటిజం (Autism) ఉన్నట్లు తెలిసింది.
కొడుకు వైద్యం, సంరక్షణ కోసం వీరు లాస్ ఏంజిల్స్, లండన్ వంటి నగరాల్లో నివసించి, చివరకు యూరప్‌లో స్థిరపడ్డారు. అయితే మనస్పర్థల కారణంగా 2001లోనే విడిపోయిన ఈ జంట, 2016లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. అంటే, పెళ్లయిన 15 ఏళ్లకు సోనమ్, రాజీవ్ రాయ్ విడాకులు తీసుకున్నారు.
ఓటీటీతో రీఎంట్రీ ప్లాన్
1992లో వచ్చిన 'విశ్వాత్మ' సినిమాలో చివరిసారిగా కనిపించిన సోనమ్ ఖాన్.. దాదాపు 30 ఏళ్లకు పైగా సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టాలని చూస్తున్నారు. ఈ సారి ఓటీటీ (OTT) వేదికల ద్వారా డిజిటల్ ఎంట్రీ ఇచ్చి, తన కెరీర్‌లో ఇప్పటివరకు చేయని సరికొత్త సవాల్‌తో కూడిన పాత్రలు చేయాలని ఆశిస్తున్నట్లు ఆమె ప్రకటించారు.