...
...
Next Story

Akhil Samantha: అలాంటి యాక్షన్ చేయడం మాములు విషయం కాదు, సామ్‌ది అద్భుతమైన జాబ్- సమంతపై అఖిల్ అక్కినేని ప్రశంసలు

Akhil Akkineni Praised Samantha Maa Inti Bangaaram: అక్కినేని అఖిల్ తన తాజా చిత్రం 'లెనిన్' ప్రమోషన్స్‌లో బిజీగా ఉంటూనే, సమంత నటించిన లేటెస్ట్ హిట్ 'మా ఇంటి బంగారం' సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ సీన్స్‌లో సమంత నటన అద్భుతమంటూ ప్రశంసలు కురిపించారు.

Published on: Jul 3, 2026, 09:34:32 IST
Advertisement

Akhil Akkineni Praised Samantha Maa Inti Bangaaram: టాలీవుడ్‌లో నటీనటుల మధ్య ఉండే ప్రొఫెషనల్ బాండింగ్ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ఒకరి విజయాలను మరొకరు అభినందించుకుంటూ ఇండస్ట్రీలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని చాటుతుంటారు.

మా ఇంటి బంగారంపై అఖిల్

అలాంటి యాక్షన్ చేయడం మాములు విషయం కాదు, సామ్‌ది అద్భుతమైన జాబ్- సమంతపై అఖిల్ అక్కినేని ప్రశంసలు
అలాంటి యాక్షన్ చేయడం మాములు విషయం కాదు, సామ్‌ది అద్భుతమైన జాబ్- సమంతపై అఖిల్ అక్కినేని ప్రశంసలు

తాజాగా అక్కినేని యువ హీరో అఖిల్, స్టార్ హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ 'మా ఇంటి బంగారం' సినిమాపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తన కొత్త సినిమా ప్రచారంలో తీరిక లేకుండా గడుపుతున్నప్పటికీ, సమంత సాధించిన విజయాన్ని అఖిల్ ప్రత్యేకంగా అభినందించడం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

'లెనిన్' ప్రమోషన్స్‌లో అఖిల్ బిజీ

అఖిల్ అక్కినేని ప్రస్తుతం తన కొత్త యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లెనిన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. జులై 10న లెనిన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అఖిల్ వరుస ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతున్నారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సమంత రీఎంట్రీ సినిమా 'మా ఇంటి బంగారం' ఘన విజయంపై అఖిల్ మనస్ఫూర్తిగా స్పందించారు.

ట్రైలర్ చూశాను

మా ఇంటి బంగారం సినిమాను తాను ఇంకా చూడనప్పటికీ, ట్రైలర్ తనను ఎంతగానో ఆకట్టుకుందని అఖిల్ వెల్లడించారు. "లెనిన్ ప్రమోషన్స్‌లో ఉండడంతో నేను ఇంకా మా ఇంటి బంగారం చూడలేదు. కానీ, ఆ సినిమా ట్రైలర్ చూశాను. చాలా నచ్చింది. ఆ సినిమా వైబ్ అద్భుతంగా ఉంది. ఇది కచ్చితంగా హిట్ అవుతుందని అనిపించింది" అని అఖిల్ అక్కినేని అన్నారు.

సమంత యాక్షన్ పవర్‌పై అఖిల్ ప్రశంసలు

"సినిమా టీమ్ అందరికి కంగ్రాట్స్. నాకు వైబ్ చాలా నచ్చింది. రూటెడ్ మాత్రమే కాకుండా సమ్‌థింగ్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. రూటెడ్‌లో ఆ ఇంట్లో, మా ఇంటి బంగారం అని పేరు పెట్టుకుని అలాంటి యాక్షన్ తీయడం అనేది చాలా ఇంట్రెస్టింగ్. అందులోను ముఖ్యంగా ఫీమేల్ పాత్రతో ఆ లెవెల్ యాక్షన్ చేయడం మాములు విషయం కాదు. నిజంగా సామ్‌ది అద్భుతమైన జాబ్. సినిమా వైబ్ బాగా వర్కౌట్ అయింది" అని అఖిల్ పేర్కొన్నారు.

లెనిన్ పెద్ద హిట్ కావాలని

ఇదిలా ఉంటే, మరోవైపు సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి రీ ఎంట్రీ ఇచ్చిన సమంత.. 'మా ఇంటి బంగారం' సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌తో ఫుల్ ఖుషీగా ఉన్నారు.

సమంత వర్కౌట్ వీడియోలు

జూన్ నెల తనకు ఎంతో అద్భుతమైన జ్ఞాపకాలను అందించిందని ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. బాక్సాఫీస్ వద్ద టికెట్ల అమ్మకాలకు సంబంధించిన ఫోటోలతో పాటు, ఈ సినిమా రోల్ కోసం ప్రెగ్నెన్సీ సమయంలో తాను చేసిన కఠినమైన వర్కవుట్ వీడియోలను కూడా సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe