...
...
Next Story

Lenin: లెనిన్ అరాచకం.. యూట్యూబ్ ను షేక్ చేస్తున్న అఖిల్ మూవీ ట్రైలర్.. టాలీవుడ్ స్టార్ల రియాక్షన్ వైరల్.. హిట్ ఖాయమంటూ!

Lenin: అక్కినేని నట వారసుడు అఖిల్ ఈ సారి పక్కా హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు. అతని అప్ కమింగ్ మూవీ ‘లెనిన్’ ట్రైలర్ పై వస్తున్న పాజిటివ్ రియాక్షనే అందుకు కారణంగా చెప్పొచ్చు. ఈ ట్రైలర్ ను యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. దీనిపై టాలీవుడ్ స్టార్ల రియాక్షన్ కూడా వైరల్ గా మారింది.

Published on: Jul 2, 2026, 13:28:24 IST
Advertisement

Lenin: అక్కినేని యువ హీరో అఖిల్ నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లెనిన్’ (Lenin) ట్రైలర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. మురళీ కిషోర్ అబ్బురు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పవర్‌ఫుల్ విజువల్స్‌కు టాలీవుడ్ అగ్ర హీరోలు ఫిదా అవుతున్నారు. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్‌ను వీక్షించిన సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, నేచురల్ స్టార్ నాని సోషల్ మీడియా వేదికగా చిత్రబృందాన్ని అభినందిస్తూ పోస్టులు పెట్టారు. ఇండస్ట్రీకి చెందిన పెద్ద స్టార్లందరూ అఖిల్ కొత్త మేకోవర్‌ను కొనియాడటంతో ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి.

అఖిల్ నటనకు మహేష్ బాబు ఫిదా

లెనిన్ అరాచకం.. యూట్యూబ్ ను షేక్ చేస్తున్న అఖిల్ మూవీ ట్రైలర్.. టాలీవుడ్ స్టార్ల రియాక్షన్ వైరల్ (x/Sithara Entertainments)
లెనిన్ అరాచకం.. యూట్యూబ్ ను షేక్ చేస్తున్న అఖిల్ మూవీ ట్రైలర్.. టాలీవుడ్ స్టార్ల రియాక్షన్ వైరల్ (x/Sithara Entertainments)

"లెనిన్ ట్రైలర్ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పాత్రలో అఖిల్ అద్భుతమైన నటనను, తీవ్రతను ప్రదర్శించారు. ప్రతి ఫ్రేమ్‌లోనూ అఖిల్ స్క్రీన్ ప్రెజెన్స్ అమోఘం. జూలై 10న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా పెద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నా" అని సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసించారు. అఖిల్ కష్టపడే తత్వానికి, స్క్రీన్ పై ఆయన చూపించిన ఎనర్జీకి మహేష్ అభినందనలు తెలపడం విశేషం.

ఎక్స్‌ప్లోజివ్ అన్న రామ్ చరణ్

థియేటర్లలో విన్నర్

నేచురల్ స్టార్ నాని సైతం లెనిన్ ట్రైలర్ ను పొడిగేశారు. "ప్రియమైన అఖిల్‌కు లెనిన్ సినిమాతో భారీ విజయం దక్కాలని ఆశిస్తున్నాను. ట్రైలర్ చాలా బాగుంది. సినిమా కోసం పడిన కష్టం, శ్రమ ప్రతి ఫ్రేమ్‌లోనూ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అక్కినేని నాగార్జున, నిర్మాత సూర్యదేవర నాగవంశీ చేతుల్లో జూలై 10న ఒక పెద్ద హిట్ సినిమా ఉండబోతోందని నేను నమ్ముతున్నాను" అని నాని పేర్కొన్నారు.

రాయలసీమ నేపథ్యంలో

రాయలసీమ నేపథ్యంలో సాగే ఒక పవర్‌ఫుల్ యాక్షన్ అండ్ లవ్ స్టోరీగా ‘లెనిన్’ చిత్రాన్ని మేకర్స్ రూపొందిస్తున్నారు. ‘ఏజెంట్’ సినిమా తర్వాత అఖిల్ నటిస్తున్న చిత్రం కావడంతో దీనిపై అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి ఉంది. ఈ సినిమాలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీ ట్రైలర్ ఒక్క రోజులోనే 10 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిందని మేకర్స్ ప్రకటించారు.

మనం ఎంటర్‌టైన్‌మెంట్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తుండగా శివాజీ, సునీల్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మొదట జూన్ 26న విడుదల చేయాలని భావించినప్పటికీ, మరింత మెరుగైన ఔట్‌పుట్ కోసం చిత్రబృందం జూలై 10ని కొత్త విడుదల తేదీగా ప్రకటించింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks