Nagarjuna Brand Ambassador To Kapston Home Services: సుమారు రెండు దశాబ్దాలుగా వ్యాపార సంస్థలకు (B2B) విభిన్న సేవలందిస్తూ ఎంతో విశ్వసనీయతను సంపాదించుకున్న 'కాప్‌స్టన్ సర్వీసెస్ లిమిటెడ్', తన అనుబంధ సంస్థ 'కాప్‌స్టన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్' ద్వారా వినియోగదారుల (B2C) మార్కెట్‌లోకి అధికారికంగా అడుగుపెట్టింది.
కాప్‌స్టన్ హోమ్ సర్వీసెస్ యాప్ లాంచ్

హైదరాబాద్ మహానగరంలో సరికొత్త 'కాప్‌స్టన్ హోమ్ సర్వీసెస్' కన్స్యూమర్ యాప్‌ను సంస్థ ఘనంగా ప్రారంభించింది. ఈ సేవలకు బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున వ్యవహరిస్తున్నారు.
హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన యాప్ లాంచింగ్ కార్యక్రమంలో కాప్‌స్టన్ గ్రూప్ చైర్మన్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి డాక్టర్ సి.ఆర్. నాయుడు, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకాంత్ కోడాలి, సంస్థ సీనియర్ నాయకత్వ బృందం సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాప్‌స్టన్ హోమ్ సర్వీసెస్ బ్రాండ్ అంబాసిడర్‌గా బాధ్యతలు చేపట్టిన అక్కినేని నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఇల్లు నమ్మకంపై నిర్మితమవుతుంది: అక్కినేని నాగార్జున
"ఇల్లు అనేది నమ్మకంపై నిర్మితమవుతుంది. అలాగే మన ఇంట్లోకి వచ్చే ప్రతి సేవ వెనుక కూడా అంతే నమ్మకం, భద్రత ఉండాలి. గత రెండు దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా దిగ్గజ సంస్థలకు సేవలందిస్తూ కాప్‌స్టన్ ఆ నమ్మకాన్ని సొంతం చేసుకుంది. అదే ప్రొఫెషనలిజం, పారదర్శకత, నాణ్యతను ఇప్పుడు ప్రతి ఇంటికీ అందించాలనే వారి ఆలోచన నన్ను ఎంతో ఆకట్టుకుంది" అని నాగార్జున పేర్కొన్నారు.
పట్టణీకరణతో హోమ్ సర్వీసులకు విపరీతమైన డిమాండ్
ప్రస్తుతం భారతీయ నగరాల్లో వేగంగా పెరుగుతున్న డిజిటలైజేషన్, శరవేగంగా మారుతున్న పట్టణ జీవనశైలి కారణంగా ఆన్లైన్ గృహ సేవల (Home Services) రంగానికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. అర్బన్ కంపెనీ వంటి ప్లాట్‌ఫామ్‌లు ఇప్పటికే విస్తరిస్తున్నప్పటికీ, సరిగ్గా శిక్షణ పొందిన సిబ్బంది కొరత, సేవల్లో నాణ్యత లేకపోవడం, ధరల్లో పారదర్శకత లోపించడం, భద్రతాపరమైన ఆందోళనలు వినియోగదారులను ఇప్పటికీ వేధిస్తూనే ఉన్నాయి.
{{/usCountry}}ప్రస్తుతం భారతీయ నగరాల్లో వేగంగా పెరుగుతున్న డిజిటలైజేషన్, శరవేగంగా మారుతున్న పట్టణ జీవనశైలి కారణంగా ఆన్లైన్ గృహ సేవల (Home Services) రంగానికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. అర్బన్ కంపెనీ వంటి ప్లాట్‌ఫామ్‌లు ఇప్పటికే విస్తరిస్తున్నప్పటికీ, సరిగ్గా శిక్షణ పొందిన సిబ్బంది కొరత, సేవల్లో నాణ్యత లేకపోవడం, ధరల్లో పారదర్శకత లోపించడం, భద్రతాపరమైన ఆందోళనలు వినియోగదారులను ఇప్పటికీ వేధిస్తూనే ఉన్నాయి.
{{/usCountry}}ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతూ, 17 ఏళ్లకు పైగా కార్పొరేట్ రంగంలో ఉన్న అనుభవంతో కాప్‌స్టన్ ఈ రంగానికి శ్రీకారం చుట్టింది. వెరిఫైడ్ సిబ్బంది, స్పష్టమైన ధరలు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సేవలందించేలా తమ వ్యవస్థను తీర్చిదిద్దింది.
సమగ్ర గృహ సేవలు.. హైదరాబాద్ నుంచి మెట్రో నగరాలకు!
ఈ కాప్‌స్టర్ కన్స్యూమర్ యాప్ ద్వారా బ్యూటీ అండ్ వెల్నెస్, క్లీనింగ్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, కార్పెంటరీ, పెయింటింగ్, ఏసీ సర్వీసింగ్, గృహోపకరణాల రిపేర్లు, పెస్ట్ కంట్రోల్ వంటి అనేక రకాల నిత్యావసర గృహ సేవలు ఒకే చోట అందుబాటులోకి రానున్నాయి.
"హోమ్ సర్వీసెస్ రంగంలో నమ్మకమైన నిపుణులు, పారదర్శకమైన ధరలను కస్టమర్లు కోరుకుంటున్నారు. మా సుదీర్ఘ అనుభవం, పటిష్టమైన శిక్షణతో గృహ సేవల అనుభవాన్ని సరికొత్త ఎత్తుకు తీసుకెళ్తాం" అని కాప్‌స్టన్ చైర్మన్ డాక్టర్ సీఆర్ నాయుడు తెలిపారు.
తొలి వేదికగా హైదరాబాద్
సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకాంత్ కొడాలి మాట్లాడుతూ, ఈ ప్రయాణానికి భాగ్యనగరాన్ని తొలి వేదికగా ఎంచుకున్నామని వెల్లడించారు. త్వరలోనే ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి ప్రధాన నగరాలకు సేవలను విస్తరిస్తామన్నారు.
ఈ ప్రక్రియ ద్వారా దేశవ్యాప్తంగా వేలాది మంది నైపుణ్యం కలిగిన యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు సీఆర్ నాయుడు. అక్కినేని నాగార్జున బ్రాండ్ ఫేస్‌గా ఉండటం వినియోగదారుల్లో మరింత భరోసాను నింపుతుందని సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది.