Alia Bhatt: పాపం ఆ పిల్ల బిక్కుబిక్కుమంటూ నిలబడింది, పరిస్థితి చేయి దాటిపోయింది: అలియా భట్ దాడిపై బాడీగార్డ్ కామెంట్స్
Alia Bhatt Mobbed Incident Reveals Bodyguard: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ తన కెరీర్ ఆరంభంలో ఎయిర్‌పోర్టులో ఎదుర్కొన్న ఒక భయానక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. విద్యావంతులైన ఎయిర్‌పోర్ట్ అధికారులే ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారని మాజీ బాడీగార్డ్ సంచలన విషయాలు వెల్లడించారు.
Alia Bhatt Scarred Incident Reveals Bodyguard: టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తన నటనతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది స్టార్ హీరోయిన్ అలియా భట్. అయితే సెలబ్రిటీ హోదా పెరిగే కొద్దీ వారికి భద్రత అనేది ఎంత ప్రాధాన్యత సంతరించుకుంటుందో చెప్పడానికి ఒక పాత ఉదంతమే సాక్ష్యం.

అలియా అరంగేట్రం చేసిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' (2012) షూటింగ్ సమయంలో విదేశీ ప్రయాణంలో భాగంగా అలియా భట్‌కు ఒక చేదు అనుభవం ఎదురైంది. అప్పట్లో ఆమెకు బాడీగార్డ్‌గా పనిచేసిన జీషన్ ఖురేషి తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆనాటి వివరాలను పంచుకున్నారు.
ఒంటరిగా దొరికితే చుట్టుముట్టేశారు!
అలియా భట్ తన తొలి సినిమా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్తున్న సమయం అది. ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుని అలియా ఒక మూలన నిలబడి ఉండగా, ఎయిర్‌పోర్ట్ సిబ్బంది, కస్టమ్స్ అధికారులు ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టారు. అప్పట్లో ఆమెతో పాటు మేనేజర్ కానీ, బాడీగార్డ్ కానీ పక్కన లేరు. జీషన్ ఖురేషి ఇంకా ఇమ్మిగ్రేషన్ క్యూలోనే ఉండటంతో అలియా ఒంటరిగా దొరికిపోయింది.
"కస్టమ్స్ అధికారులు, ఎయిర్‌పోర్ట్ టీమ్ ఆమెను చూడగానే ఎగ్జైట్ అయ్యారు. ఆలియా ఒంటరిగా ఉండటంతో ఒక్కసారిగా మీద పడ్డారు. 'మేడం.. ఒక్క ఫోటో' అంటూ ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశారు" అని జీషన్ నాటి పరిస్థితులను వివరించారు.
భయంతో వణికిపోయిన హీరోయిన్
ఒక్క నిమిషం వ్యవధిలోనే పరిస్థితి చేయి దాటిపోయింది. చుట్టూ జనం గుమిగూడటంతో అలియా భట్ భయంతో వణికిపోయింది. "పాపం ఆ పిల్ల (అలియా భట్) తన చేతులు, కాళ్లు దగ్గరకు ముడుచుకుని బిక్కుబిక్కుమంటూ నిలబడింది. వారంతా చదువుకున్న వారే కానీ.. ఆమె మీద పడిపోతున్నంతగా ప్రవర్తించారు. కొందరైతే ఆమె మెడపై, భుజాలపై చేతులు వేయడానికి ప్రయత్నించారు" అని జీషన్ ఆవేదన వ్యక్తం చేశారు.
తన ఇమ్మిగ్రేషన్ పూర్తి కాగానే పరిగెత్తుకుంటూ వెళ్లి వారిని గద్దించి, అలియాను అక్కడి నుంచి సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్లు జీషన్ పేర్కొన్నారు. స్క్రీన్ మీద హీరోయిన్ అయినా, బయట ఒక అమ్మాయి అన్న కనీస గౌరవం లేకుండా ప్రవర్తించిన అధికారుల తీరును ఆయన తప్పుబట్టారు.
అలియా చేతిలో భారీ ప్రాజెక్టులు
ప్రస్తుతం ఈ జీషన్ ఖురేషి.. సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ దంపతులకు బాడీగార్డ్‌గా పనిచేస్తున్నారు. ఇక అలియా భట్ తన కెరీర్‌లో అత్యున్నత దశలో ఉంది. ఆమె చేతిలో ప్రతిష్టాత్మకమైన 'వైఆర్ఎఫ్ (YRF) స్పై యూనివర్స్' చిత్రం 'ఆల్ఫా' ఉంది. శివ రావైల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శార్వరీ వాగ్, బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
జూలై 10న అల్ఫా చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. అంతేకాకుండా, సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో 'లవ్ అండ్ వార్' అనే భారీ చిత్రంలోనూ అలియా భట్ నటిస్తోంది. ఇందులో తన భర్త రణ్‌బీర్ కపూర్, విక్కీ కౌశల్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనుంది.
భారీ అంచనాలు
వివాహం తర్వాత రణ్‌బీర్-అలియా కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం 2027 జనవరి 21న విడుదల కానుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


